Bigg Boss Non Stop: అతడితో అషు రెడ్డి ట్రాక్.. ముద్దలు పెడుతూ రచ్చ.. అలా అనడంతో మేటర్ లీక్

తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల కార్యక్రమాలు పరిచయం అయ్యాయి. అయితే, అందులో కొన్నంటే కొన్ని మాత్రమే ప్రేక్షకుల మెప్పును పొందాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ ఒకటి. అస్సలు పరిచయమే లేని కాన్సెప్టుతో నడిచే ఈ కార్యక్రమానికి ప్రేక్షకులు ఊహించని రీతిలో స్పందనను అందించారు.

ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ జోష్‌తోనే ఇప్పుడు 'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్‌ను మొదలు పెట్టారు. ఇందులోకి కంటెస్టెంట్‌గా వచ్చిన బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి.. తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఒకరితో ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించింది. ఆ సంగతులు మీకోసం!

వంద శాతం ఎంటర్‌టైన్‌మెంట్

వంద శాతం ఎంటర్‌టైన్‌మెంట్

గతంలో బిగ్ బాస్ షో రోజంతా రికార్డు చేసి కేవలం గంటసేపు మాత్రమే ప్రసారం చేసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ను ప్రారంభించి దీన్ని రోజంతా ప్రసారం చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇది ఒకరోజు ఆలస్యంగా రన్ అవుతోంది. ఈ సీజన్‌లోకి 17 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. ఈ సీజన్ మొత్తం 84 రోజుల పాటు సాగబోతుందని ముందే ప్రకటించారు.

లైవ్ కావడంతో రచ్చంతా చూపి

లైవ్ కావడంతో రచ్చంతా చూపి

రెగ్యూలర్ బిగ్ బాస్ సీజన్లు బుల్లితెరపై ప్రసారం అయ్యేవి. దీనికి సెన్సార్ ఉండడంతో బోల్డు కంటెంట్‌ను కట్ చేసి చూపించేవారు. అయితే, ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్‌ సీజన్‌ను మాత్రం 24 గంటల పాటు లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీంతో దీనికి సెన్సార్ అవసరం పడడం లేదు. ఫలితంగా ఇందులో ఎక్కువగా బోల్డు కంటెంటే కనిపిస్తోంది. దీంతో ఇది రంజుగా సాగుతోంది.

బోల్డు బ్యూటీపై స్పెషల్ ఫోకస్

బోల్డు బ్యూటీపై స్పెషల్ ఫోకస్

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఎక్కువగా అమ్మాయిలకే ప్రాధాన్యత ఇచ్చారు. అందులోనూ బోల్డ్ బ్యూటీలు చాలా మందే ఎంట్రీ ఇచ్చారు. ఇలా వచ్చిన వారిలో తెలుగు భామ అషు రెడ్డి ఒకరు. మూడో సీజన్‌లో రచ్చ చేసిన ఈ బ్యూటీ.. మధ్యలోనే ఎలిమినేట్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఛాన్స్ వచ్చింది. ఇందులో మాత్రం ఆమె స్పెషల్‌గా ఫోకస్ అయిపోతోంది.

వాళ్లతో కలిసి బూతులతో రచ్చ

వాళ్లతో కలిసి బూతులతో రచ్చ

అషు రెడ్డి బయట ఎంత బోల్డుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ హౌస్‌లోనూ ఈ అమ్మడు అదే కంటిన్యూ చేస్తోంది. గతంలో కంటే ఈ సారి ఆమె మరింత రెచ్చిపోతోంది. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం.. ముక్కుసూటిగా ఎఫైర్ల గురించి రివీల్ చేయడం వంటివి చేస్తోంది. ఫలితంగా అషు ఈ సీజన్‌లో తెగ సందడి చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది.

అతడితో ట్రాక్ నడుపుతుందా

అతడితో ట్రాక్ నడుపుతుందా

బిగ్ బాస్ హౌస్‌లో అషు రెడ్డి వ్యవహరించే తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా వ్యవహరించడం.. డబుల్ మీనింగ్ డైలాగులు వాడడం వంటి వాటిలో హైలైట్ అవుతోంది. అదే సమయంలో అనిల్ రాథోడ్‌తో కలిసి రచ్చ చేస్తోంది. దీంతో అతడితో అషు లవ్ ట్రాకును నడుపుతున్నట్లు కంటెస్టెంట్లు అనడంతో మేటర్ లీక్ అయింది.

కెప్టెన్సీ టాస్క్.. ఇద్దరికి సపోర్ట్

కెప్టెన్సీ టాస్క్.. ఇద్దరికి సపోర్ట్

ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ల కోసం జరిగిన తగ్గేదేలే టాస్కులో చాలెంజర్స్ విజయం సాధించారు. దీంతో ఈ టీమ్ నుంచి శివ, చైతూ, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్ పోటీ పడగా.. వారియర్స్ నుంచి ఆరియానా, హమీదా బరిలో నిలిచారు. ఇందులో అషు రెడ్డి పోటీలో లేకున్నా బాగా సపోర్ట్ చేసింది. అయితే, అనూహ్యంగా ఆరియానా తర్వాత అనిల్ రాథోడ్‌కు ఆమె మద్దతుగా నిలిచింది.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu
ముద్దలు తినిపించి నిజంగానే

ముద్దలు తినిపించి నిజంగానే

చాలా రోజులుగా అనిల్ రాథోడ్‌పై అషు రెడ్డి స్పెషల్ ఫోకస్ చేస్తుండడం.. ఆ తర్వాత అతడు గెలవాలని సపోర్ట్ చేయడం వంటి వాటితో చూసే వాళ్లకు కూడా వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అనిల్‌కు అషు గోరుముద్దలు తినిపించింది. ఆ తర్వాత కొంటెగా చూస్తూ కవ్వించడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X