Bigg Boss Non Stop: టాప్ సీక్రెట్ లీక్ చేసిన బిగ్ బాస్.. ఇంటి సభ్యులు షాక్.. చివరి ఓటింగ్ కొత్తగా!
బిగ్ బాస్.. బుల్లితెర ప్రియులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఈ షో దాదాపు ఐదేళ్లుగా భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుంటూ తెలుగు టెలివిజన్ రంగాన్ని శాసిస్తోంది. తద్వారా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికే ఇలా ఐదింటిని నిర్వహకులు దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను తీసుకొచ్చారు. ఇది కూడా వీక్షకుల మెప్పును పొందుతూ ముందుకు సాగుతోంది.
దీంతో మంచి క్లిక్కులను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈరోజు జరగబోయే ఎపిసోడ్‌లో ఈ షోలో ఊహించని పరిణామాలు జరిగినట్లు తాజాగా వచ్చిన ప్రోమోలో చూపించారు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం పదండి!

పూర్తి స్థాయి వినోదం అందించేలా
ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఫిబ్రవరిలో ప్రారంభం అయింది. దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలాగే, ఒక గంటసేపు ఉన్న ఎపిసోడ్‌ను కూడా అందులో వదులుతున్నారు. వీటికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఆరంభంలోనే ఇది రసవత్తరంగా మారి మజాను పంచుతోంది.

17 మంది ఎంట్రీ.. ఇద్దరు అవుట్
బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఫస్ట్ వీక్ ముమైత్, రెండో వారం శ్రీ రాపాక ఎలిమినేట్ అయ్యారు.

మూడో వారం మరింత రంజుగానే
నాన్ స్టాప్ సీజన్ ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. దీన్ని ప్రతివారం సరికొత్త టాస్కులతో మరింత రంజుగా మార్చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వారం ఏకంగా 12 మందిని నామినేట్ చేశారు. అలాగే, ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లను ఎంపిక చేయడం కోసం ‘అంతా మీ ఇష్టం' అనే టాస్క్‌ను ఇచ్చారు. అలాగే, యాంకర్ శివకు సీక్రెట్ టాస్కును ఇచ్చారు.

ఆరియానాను జతచేసిన బిగ్ బాస్
యాంకర్ శివకు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఇంట్లో ఓటింగ్ పెట్టిన సమయంలో అతడు వేసిన ఓట్ ప్రకారమే రిజల్ట్‌ను మారుస్తున్నారు. ఇక, ఈ టాస్క్ గురించి నిన్న జరిగిన ఎపిసోడ్‌లో ఆరియానా గ్లోరికి లీక్ చేశాడు బిగ్ బాస్. ఆమెను అతడికి సాయం చేయమని చెప్పాడు. అందుకు అనుగుణంగానే ఈ బ్యూటీ తన వైపు డైవర్ట్ చేస్తూ తికమక పెట్టేసింది.
టాప్ సీక్రెట్ లీక్ చేసిన బిగ్ బాస్
గురువారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో సీక్రెట్ టాస్కును ఆడుతూ ఫలితాలను మారుస్తున్న వాళ్లను కనుక్కోమని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఓటింగ్ పెట్టాడు. ఇందులో చాలా మంది శివకే ఓటు వేశారు. ఇక, చివర్లో అతడే సీక్రెట్ టాస్క్ ఆడుతున్నాడని బిగ్ బాస్ అసలు మేటర్ లీక్ చేసినట్లు ఇందులో చూపించారు.
Recommended Video

అంతా షాక్.. అఖిల్ మాత్రం ఫైర్
ఈ ప్రోమోలో తనకు ఫేక్ పర్సన్ ట్యాగ్ రావడంపై అఖిల్ ఫైర్ అవుతుండడాన్ని చూపించారు. అలాగే, ఆరియానా కూడా గొడవ చేస్తూ కనిపించింది. ఇక, శివ గురించి అందరికీ నిజం తెలిసిన తర్వాత అతడు వచ్చి అఖిల్‌కు సారీ చెప్పాడు. కానీ, అతడు మాత్రం సారీని యాక్సెప్ట్ చేయలేదు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ షాకింగ్ పరిణామాలతో ఆసక్తికరంగా సాగబోతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











