Bigg Boss Non Stop : సరయూ విషయంలో యాంకర్ శివకి షాకిచ్చిన బిందు మాధవి.. పాపం పులిహోర రాజా!
బిగ్ బాస్ నాన్ స్టాప్ ఆసక్తికరంగా సాగుతోంది. 24 గంటల స్ట్రీమింగ్ చూడకపోయినా రోజుకు రెండు ఎపిసోడ్ లు చూస్తూ ప్రేక్షకులు బిగ్ బాస్ నాన్ స్టాప్ మిస్సవకుండా ఫాలో అవుతున్నారు. అయితే ఈ బిగ్ బాస్ సీజన్ లో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్ లు ఎవరూ లేకపోయినప్పటికీ ఉన్న వారు మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్స్ కూడా జరగడంతో ఒకరి మధ్య ఒకరికి మనస్పర్థలు కూడా ఏర్పడ్డాయి. అయితే ఎవరో ఒకరితో పులిహోర కలిపి లవ్ ట్రాక్ నడపాలని ప్రయత్నాలు చేస్తున్న యాంకర్ శివ ప్రయత్నాలకు పదే పదే బ్రేకులు పడుతూనే ఉన్నాయి. తాజాగా యాంకర్ శివ కు బిందుమాధవి షాక్ ఇచ్చింది.. ఆ వివరాల్లోకి వెళితే

లవ్ ట్రాక్ లు
బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్ లు నిర్మించుకునే పనిలో పడుతున్నారు కంటెస్టెంట్లు. జంటగా ఉంటే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉండడంతో ఎవరో ఒకరిని ఫ్లర్ట్ చేసి లైన్ లో పెట్టాలని కొంత మంది కుర్రాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా యాంకర్ శివ హౌస్ లో ఉన్న అందగత్తెలను పడేసే పనిలో పడ్డాడు. హౌస్ లోనే ఎక్కువగా ఫ్లర్టింగ్ చేస్తే కంటెస్టెంట్ గా యాంకర్ శివ మారిపోయాడు.

హమీదాను కూడా
వచ్చీ రాగానే మిత్రాను ఫ్లర్ట్ చేయడానికి ప్రయత్నించగా ఆమె బ్రదర్ అనేసింది. ఆ తరువాత బిందును ఫ్లర్ట్ చేయబోతే ఆమె కూడా బ్రదర్ అనేసింది. అయితే ఎందుకైనా మంచిదని హమీదాను కూడా ట్రై చేస్తున్నాడు. బిందు మేకప్ వేస్తుంటే బిందు నువ్వు మేకప్ వేస్తే చూడలేకపోతున్నాను.. అంటూ తనను తెగ ఫ్లర్ట్ చేస్తున్నాడు.

నా దగ్గరికి రాకు
ఇక యాంకర్ శివ అన్ని పనులు పక్కన పెట్టి కేవలం అమ్మాయిలను ఫ్లర్ట్ చేయడంపైనే దృష్టి పెడుతుండటంతో మిగితా చాలెంజర్స్ అతడిని ఆటపట్టిస్తున్నారు. హమీదా వచ్చి యాంకర్ శివతో మాట్లాడబోతే నువ్వు మాట్లాడినప్పుడు బిందు రావద్దు.. బిందూ మాట్లాడినప్పుడు నువ్వు నా దగ్గరికి రాకు.. అని శివ క్లారిటీగా చెప్పడం ఆసక్తికరంగా మారింది.

కూల్ అయిపోతా
అయితే శివ తమ ఇద్దరినీ ఫ్లర్ట్ చేస్తున్నాడని తెలిసి కూడా ఇద్దరూ ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారు. అయితే హమీదా సరయు మధ్య గొడవ అవుతుంటే హమీదా కోసం మాట్లాడబోయి సరయూతో గొడవ పెట్టుకున్నాడు. సరయుతో గొడవపడిన అనంతరం.. లోపలికి వచ్చి 'ఏంటి బిందూ.. నాపై అంత గట్టిగా అరుస్తుంటే ఏం మాట్లాడటం లేదు ఏంటి.. రా ఇక్కడికి వచ్చి కూర్చో.. ఎంత సీరియస్‌గా ఉన్నా బిందూని చూస్తే నేను కూల్ అయిపోతా' అని మళ్ళీ పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు.

ఎక్కువ చేస్తున్నాడని
అయితే ఆ మాటలు విన్న బిందు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. ''అబ్బా.. కాస్త ఎక్కువ అవుతుంది తగ్గిస్తే మంచిది.. వీడు మరీ ఎక్కువ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. తగ్గించుకోవడానికి ట్రై చేయి అని చెప్పింది. ఆ తర్వాత కూడా శివ బిగ్ బాస్ ఇది మాత్రం ప్లే చేయండి.. కట్ చేయకుండా వేయండి.. బిందుతో ఫ్రేమ్‌లో కనిపించాలి అనుకుంటే.. సరయుతో ఫ్రేమ్ సెట్ చేస్తున్నారు.. మమ్మల్నే ప్రోమోలో పెట్టండి అని అంటూ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆమె కౌంటర్ దెబ్బకు శివ సైలెంట్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











