Bigg Boss Non Stop: నమ్మినవాడి చేతుల్లోనే మోసపోయిన బిందుమాధవి.. అలా వెన్నుపోటు!

బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో ప్రస్తుతం పవర్ఫుల్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న వారిలో బిందుమాధవి ఒకరు. ఆమె జరిగిన టాస్క్ లలో గెలవక పోయినప్పటికీ కూడా ప్రేక్షకుల మద్దతు అయితే ఏమాత్రం తగ్గలేదు అని చెప్పాలి. రెండు వారాల్లోనే తనదైన శైలిలో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న బిందుమాధవి హౌస్ లో కొందరితో మంచి స్నేహంతో అలాగే మరికొందరు తో ధీటైన శత్రుత్వం తో కొనసాగుతోంది. అయితే ఫైనల్ గా బిందు మాధవికి నమ్మిన వాడి నుంచే వెన్నుపోటు ఎదురవడం విశేషం. అయితే అతను కూడా న్యాయంగానే బిందు మాధవి వెన్నుపోటు పొడిచినట్లు కనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

కావాలని శత్రుత్వం

కావాలని శత్రుత్వం

బిగ్ బాస్ లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా బిందుమాధవి నలుగురికీ నచ్చని దారిలోనే కొనసాగుతుంది. అయితే ఆమె మిగతా వారిలాగా మాత్రం గ్రూపుగా గేమ్ ఆడడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఒకవైపు స్నేహితులను కూడా ఆమె గట్టిగానే ఏర్పరచుకుంటుంది. ఇక మరోవైపు బిందు ఎదుగుదలను చూసిన మరికొంతమంది కావాలని శత్రుత్వాన్ని కూడా పెంచుకుంటున్నారు.

నెంబర్ వన్..

నెంబర్ వన్..

అయితే బిందుమాధవి పై ప్రత్యర్థులు ఎంత నెగిటివ్ గా కామెంట్ చేసినా కూడా ఏ మాత్రం ఆమె వెనక్కి తగ్గడం లేదు. ఒక విధంగా బిందుమాధవి ఆడియన్స్ సపోర్ట్ చాలా బలంగా ఉంది అని చెప్పాలి. ఆమె రెండవ వారం నుంచి కూడా ఓటింగ్స్ లో అయితే టాప్ పొజిషన్ లోనే కొనసాగుతోంది. ఆమె తర్వాత మిగతావారు ఓట్ల విషయంలో స్థానాలు మారుతున్నాయి. కానీ బిందుమాధవి తరహాలో అయితే ఓట్లు మాత్రం అందుకోవడం లేదు.

వెన్నుపోటు

వెన్నుపోటు

అయితే బిందు మాధవి మాత్రం ఎవరితో ఎలా ఉన్నా కూడా ఒక వ్యక్తి మాత్రం మొదటి నుంచి ఆమెతో చాలా ఫ్రెండ్లీగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతనే చివరికి బిందు మాధవి వరెస్ట్ కంటెస్టెంట్ అని ఊహించని విధంగా వెన్నుపోటు పొడవడం విశేషం. ఒక విధంగా అతను చెప్పిన కారణం కూడా కరెక్ట్ గానే ఉంది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

వరస్ట్ ఇంటి సభ్యురాలిగా..

వరస్ట్ ఇంటి సభ్యురాలిగా..

గడిచిన టాస్క్ లలోని పరిణామాలతో తగిన కారణాలు చెప్పి ఇంట్లోని వరస్ట్ ఇంటి సభ్యుడిని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పగా ఎక్కువమంది బిందుమాధవిని సెలెక్ట్ చేశారు. అఖిల్ బ్యాచ్ ఎప్పటిలానే బిందుమాధవి పై ఫోకస్ చేయగా యాంకర్ శివ కూడా ఆమెనే వరస్ట్ అని చెప్పడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

బిందుమాధవి చేసిన మిస్టేక్

బిందుమాధవి చేసిన మిస్టేక్

యాంకర్ శివ అలా చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. బిందుమాధవి గత టాస్క్ లో కాయిన్స్ కాపాడుకోవాడంలో మరీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అసలు రోబో ఫ్యాక్టరీ టాస్క్ లో కూడా పెద్దగా ప్రభావం చూప లేదు. పరిస్థితులు ఆమెకు విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా గ్రూప్ గా ఆడుతున్నారు అనే ఒకే ఒక్క పాయింట్ ను హైలెట్ చేసింది. బిందుమాధవి తన కాయిన్స్ ని కూడా కాపాడుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని శివ ఆమెను జైల్లోకి పంపాడు. ఇక రాబోయే రోజుల్లో బిందుమాధవి శివ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X