Bigg Boss Non Stop: మిత్రా శర్మ బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదు.. ఖరీదైన కార్లు, బంగ్లా..వ్వాటే లైఫ్
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసింది. మొన్నటివరకు ఈ షో బోరింగ్ గా కొనసాగుతోంది అనే కామెంట్స్ చాలానే వచ్చాయి. ఇక బిగ్ బాస్ హఠాత్తుగా షోలో కంటెంట్ డోస్ పెంచడంతో ప్రతీ కంటెస్టెంట్ కూడా వారి కంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మిత్ర శర్మ అంటే అంతకుముందు వరకు జనాలకు పెద్దగా తెలియదు.
హీరోయిన్ అని చెప్పినప్పటికీ ఆమె ఎదో మిడిల్ క్లాస్ కు చెందిన అమ్మాయి అని అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిశాక ఆమె బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదని అర్థమైంది. ఆమె ఆస్తులు కార్లు బంగ్లాకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిశాక
అసలైతే బిగ్ బాస్ షో మొదలైనప్పుడు కంటెస్టెంట్స్ ఎంట్రీ విషయంలో ప్రేక్షకులు పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేరు అనే చెప్పాలి. ఈసారైనా కాస్త కొత్తవారిని తెస్తారు అని అనుకుంటే మళ్ళీ మాజీ కంటెస్టెంట్స్ ను షో లోకి తీసుకురావడం పై సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇక మిత్ర శర్మ అనే అమ్మాయి ఎవరని ప్రశ్నలు కూడా రాగా ఇప్పుడు ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిశాక షాక్ అవుతున్నారు. ఆమె సొంతంగా ఒక బంగ్లాలో సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

మిత్రబిందగా అడుగుపెట్టిన మిత్రశర్మ..
ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలోకి మిత్రబిందగా అడుగుపెట్టిన మిత్ర శర్మ అంటే అంతకుముందు వరకు ఎవరికీ అంత పెద్దగా తెలియదు. తొలి సంధ్యవేళ అనే సినిమా చేసిందట. అయితే ఆ సినిమా వచ్చినట్లు జనాలకు పెద్దగా తెలియదు. ఇక బిగ్ బాస్ షో ద్వారా ఎలాగైనా మంచి గుర్తింపు అందుకోవాలి అని మిత్రశర్మ హౌస్ లోకి అడుగుపెట్టింది.

చిన్న చూపు చూసినట్టుగా..
ఇక ఈమె మొదటి వారంలోనే బయటికి వెళ్లి పోతుంది అని అందరూ అనుకున్నారు. అంతేకాకుండా మిగతా కంటెస్టెంట్ కూడా ఆమెని చాలా చిన్న చూపు చూసినట్టుగా అనిపించింది. రెండవ వారంలో కూడా ఆమె వెళ్ళిపోతుంది సోషల్ మీడియాలో కామెంట్ కూడా వచ్చాయి. కానీ మిత్ర శర్మ పట్టుదల గట్టిగానే ఉండడంతో మూడవ వారం గట్టిగానే నెట్టుకొచ్చింది.

వెనుకడుగు వేయకుండా..
ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా మిత్రశర్మ నామినేషన్స్ విషయంలో చాలా దూకుడుగా వ్యవహరించింది. తన తప్పు లేకపోతే మిగతా వారిని నిలదీసి చాలా బలంగా తన వాయిస్ ను పెంచుతోంది. ఇక మొన్నటి వరకు ఒక లెక్క ఇప్పటినుంచి ఒక లెక్క అనే విధంగా మిత్రశర్మ తన ఆటను కొనసాగించాలి అని డిసైడ్ అయింది.

విబేధాలతో..
మిత్ర శర్మ పర్సనల్ లైఫ్ విషయాలకు వస్తే ఆమె తండ్రి హిందీ చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇక తండ్రి మరణాంతరం శ్రీ పిక్చర్స్ లో పలు సినిమాలను కూడా నిర్మించిన ఆమె కుటుంబ సభ్యులతో విబేధాలతో ఆ తర్వాత పూర్తిగా హైదరాబాద్ లోకి షిఫ్ట్ అయిపోయింది. ఇక తెలుగులో ఆమె కొన్ని చిన్న సినిమాల్లో కూడా నటించింది. అంతేకాకుండా నిర్మాతగా కూడా అడుగులు వేసే ప్రయత్నం చేస్తోంది.

కోట్ల రూపాయలు విలువ చేసే బంగ్లా
అయితే మిత్రశర్మ తన సొంత తెలివితేటలతో పలు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలను అందుకుందట. ఇక హైదరాబాదులో ఆమెకు కోట్ల విలువ చేసే ఒక బంగ్లా కూడా ఉంది. అందులో ఐదు బెడ్ రూమ్ లు ఉన్నాయట. దాదాపు ఇంట్లోనే 10కుక్కలను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మిత్ర శర్మ ఒక విధంగా తన సొంత తెలివితేటలతోనే తన సామ్రాజ్యాన్ని స్థాపించుకుందట.
Recommended Video


హైదరాబాద్ లో ఆ కారు ఆమె దగ్గర మాత్రమే
ఇక మిత్రశర్మ కార్ల కలెక్షన్ చూస్తే ఎవరైనా సరే షాకవ్వాల్సిందే. మార్కెట్లోకి కొత్త మోడల్ వచ్చింది అంటే ముందుగా ఆమె దాన్ని టెస్ట్ డ్రైవ్ చేయకుండా ఉండదట. ఒకవేళ అది నచ్చితే మాత్రం ఎంత ఖరీదైనా సరే వీలైనంత త్వరగా కొనేస్తుందట. ఇక ఆ తర్వాత కార్లు నచ్చకపోతే వెంటనే మార్చేస్తుందట. ఇక కోటి 20 లక్షలు ఖరీదు చేసే బెంజ్ ఆల్టర్ కారు కూడా ఉందట. ఈ లగ్జరీ కారు ఇండియాలో పది మాత్రమే ఉండగా ఒక్కటి హైదరాబాద్‌లో మిత్ర దగ్గర ఉండడం విశేషం.


Click it and Unblock the Notifications











