Bigg Boss Non Stop సంచలన రికార్డు.. మొదటి రోజే అతిపెద్ద రియాల్టీ షోగా!
బిగ్ బాస్ రియాలిటీ షో మీద ప్రేక్షకులకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడో విదేశాలలో మొదలైన ఈ షో ముందుగా హిందీలో ప్రసారం చేశారు హిందీలో వచ్చిన క్రేజ్ ద్వారా దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో కూడా ఈ షో ఇప్పుడు నిర్వహిస్తున్నారు. అయితే గత ఏడాది హిందీ బిగ్ బాస్ విషయంలో ఒక ప్రయోగం చేశారు. టీవీలో ప్రసారం చేయకుండా కేవలం ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ ద్వారా ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకుని ఒక సీజన్ విజయవంతంగా పూర్తి చేశారు కూడా. ఇప్పుడు తెలుగులో కూడా అదే విధంగా బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్ ఇప్పుడు అద్భుతమైన రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది వివరాల్లోకి వెళితే

24 గంటల లైవ్ స్ట్రీమింగ్
బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో గత శనివారం రోజున అట్టహాసంగా బిగ్ బాస్ ఓట్ ఓటీటీ వర్షన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 3, 4, 5 సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్ల మధ్య కోపాలు, ప్రేమలు, గొడవల అన్నీ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చుతున్న కారణంగా కేవలం దానిని రోజుకు గంట సేపు పరిమితం చేయకూడదు హౌస్ లో జరుగుతున్న దాన్ని జరుగుతున్న విధంగా చూపించాలి అనే ఉద్దేశంతో తెలుగులో 24 గంటల లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తున్నారు.

ప్రముఖుల పేర్లు
ఓటీటీ కోసం ఈ షోను నాన్‌స్టాప్ వినోదంగా మలిచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ చేస్తున్నారు. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రాబోతుందని ప్రకటించిన వెంటనే బిగ్‌బాస్ అభిమానులలో ఆసక్తి ఒక్కసారిగా తారాస్థాయికి చేరిపోయింది. సామాజిక మాధ్యమాలలో ఈ సారి పోటీదారులు వీరేనంటూ చాలా మంది ప్రముఖుల పేర్లు వినిపించాయి.

ఫిబ్రవరి 25న అట్టహాసంగా
బిగ్‌బాస్ పాత సీజన్‌లలో పాల్గొన్న వారు కూడా ఈ సీజన్‌లలో కూడా పాల్గొంటున్నారని వీరే వారంటూ ప్రచారం గట్టిగానే జరిగింది. ఈ అంచనాలకు ఫుల్‌స్టాప్ పెట్టి అసలైన షో చూసేయండంటూ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఫిబ్రవరి 25న అట్టహాసంగా ప్రారంభమైంది. సామాజిక మాధ్యమాలలో సర్క్యులేట్ అయిన జాబితాలోని కంటెస్టెంట్‌లు కొంతమంది అసలు షోలో ఉంటే మరికొంత మంది అసలు కనిపించలేదు.

షో మీద ఆసక్తి
కానీ ఈ బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో సోషల్ మీడియాలో మంచి ఫేమస్ అయిన అషు రెడ్డి, తేజస్వి మాదివాడ, ముమైత్ ఖాన్, ఆర్జే చైతు, అరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, బిందు మాధవి, స్రవంతి చొక్కారపు వంటి వారు టైటిల్ కోసం పోటీపడుతుండటంతో షో మీద ఆసక్తి పెరిగింది.
Recommended Video

నూతన రికార్డు
టీఆర్‌పీ రేటింగ్స్‌లో బిగ్‌బాస్‌ను మించిన మొనగాడు ఇప్పటి వరకూ టీవీ షోలో లేదన్నట్లుగా రికార్డులు తిరగ రాసింది. ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్ పై కూడా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ నూతన రికార్డును సృష్టించింది. తొలి రోజే పది లక్షలకు పైగా లాగిన్స్ ఈ షో కారణంగా జరగడంతో రికార్డు సృష్టించినట్టు అయింది. ఈ మధ్య కాలంలో ఓటీటీ పై ఓ తెలుగు షోకు వచ్చిన అసాధారణ స్పందన అని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











