Bigg Boss Non Stop: డబుల్ ఎలిమినేషన్ వివరాలు లీక్.. మళ్లీ తప్పించుకున్న లేడీ.. ఆ ఇద్దరు ఎలిమినేట్
ఎన్నో వివాదాలు చుట్టు ముట్టినా ఏమాత్రం ఆదరణ కోల్పోకుండా.. దాదాపు ఐదేళ్లుగా ఇండియాలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది తెలుగు బిగ్ బాస్. ఎప్పటికప్పుడు ఆసక్తిని పెంచేసే కంటెంట్‌తో సరికొత్త ప్రయోగాలు చేస్తూ దీన్ని మరింతగా రక్తి కట్టిస్తున్నారు నిర్వహకులు. దీంతో ఈ షో ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌ను ప్రారంభించారు. ఇది కూడా ఆరంభం నుంచే జనరంజకంగా సాగుతూ మజాను పంచుతోంది. మరీ ముఖ్యంగా ఊహించని ఎలిమినేషన్స్‌తో ఇది మరింత రంజుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఆరో వారం డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్లు తాజాగా లీకైంది. మరి ఇందులో ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసుకుందాం పదండి!

మరింత ఆసక్తికరంగా బిగ్ బాస్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్నా బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ భారీ స్థాయిలో ఆదరణను అందుకుంటూ ముందుకు సాగుతోంది. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త టాస్కులు పెట్టడంతో పాటు బోల్డు కంటెంట్‌ను ఎక్కువగా చూపించడంతో ఇది అందరి దృష్టిలో పడుతోంది. అంతేకాదు, రోజు రోజుకూ మరింత రంజుగా మారుతూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది.

5 వారాల్లో... వాళ్లు ఎలిమినేషన్
ఈ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంటర్ అయ్యారు. వీళ్లలో నుంచి ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు ఎలిమినేట్ అయిపోయారు.

6వ వారం 10 మంది నామినేట్
ఆరో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ కూడా ఎన్నో గొడవలతో సాగింది. ఇందులో మొత్తంగా పది మంది నామినేట్ అయ్యారు. అందులో మిత్రా శర్మ, నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టా, అషు రెడ్డి, హమీదా, బిందు మాధవి, యాంకర్ శివ, అజయ్, స్రవంతి, ముమైత్ ఖాన్‌లు ఉన్నారు. అంటే కెప్టెన్ అఖిల్‌తో పాటు ఆరియానా గ్లోరీ మాత్రమే తప్పించుకున్నారు.

ఆ కంటెస్టెంట్‌కే సగం ఓటింగ్
తాజాగా ప్రసారం అవుతోన్న నాన్ స్టాప్ సీజన్‌లోకి 17 మంది కంటెస్టెంట్లుగా వచ్చినా.. హీరోయిన్ బిందు మాధవి మాత్రం టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఆమెకు ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆరో వారం నామినేషన్స్‌లో ఉన్న బిందుకు దాదాపు సగం ఓట్లు పడి ఆమె సేఫ్ అయినట్లు తెలిసింది.

సేఫ్ అయిన కంటెస్టెంట్లు వీళ్లే
బిగ్ బాస్ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆరో వారం నామినేషన్స్‌లో ఉన్న వారిలో యాంకర్ శివ రెండో అత్యధిక ఓట్లు, అషు రెడ్డి మూడో అత్యధిక ఓట్లు, హమీదా నాలుగో అత్యధిక ఓట్లు, అజయ్ ఐదో అత్యధిక ఓట్లు, నటరాజ్ మాస్టర్ ఆరో అత్యధిక ఓట్లు, మిత్రా శర్మ ఏడో అత్యధిక ఓట్లు సాధించారట. తద్వారా వీళ్లంతా ఈ వారానికి కూడా సేఫ్ అయ్యారని తెలుస్తోంది.

ఆ ముగ్గురు డేంజర్ జోన్‌లోనే
ఆరో వారానికి జరిగిన ఓటింగ్‌లో మహేశ్ విట్టాకు వాళ్లతో పోలిస్తే తక్కువ ఓట్లు వచ్చాయట. దీంతో అతడు ఎనిమిదో స్థానానికే పరిమితం అయ్యాడని అంటున్నారు. ఇక, మొదటి నుంచీ ముమైత్ ఖాన్ చివరి స్థానంలో కొనసాగుతోందట. ఆమె కంటే ముందు అంటే తొమ్మిదో స్థానంలో స్రవంతి చోకారపు ఉందట. అంటే ఈ వారం వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని ప్రచారం జరిగింది.

ఇద్దరు లేడీస్ ఎలిమినేషన్‌తో
తాజా సమాచారం ప్రకారం.. ఆరో వారంలో బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్‌తో షాకిచ్చాడట. దీంతో ఈ వారానికి గానూ జరిగిన ఓటింగ్‌లో చివరి రెండు స్థానాల్లో ఉన్న ముమైత్ ఖాన్, స్రవంతి చోకారపు షో నుంచి ఎలిమినేట్ అయిపోయారని విశ్వసనీయంగా తెలిసింది. ఇక, ఆరంభం నుంచే విమర్శలు ఎదుర్కొంటోన్న మిత్రా శర్మ మరోసారి ఎలిమినేషన్ తప్పించుకుంది.


Click it and Unblock the Notifications











