Bigg Boss Elimination: టాప్‌లో టైటిల్ ఫేవరెట్.. అతడికి కూడా భారీ ఓటింగ్.. ఈ సారి ఎలిమినేట్ ఎవరంటే!

తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందడంతో పాటు దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది బిగ్ బాస్. పేరుకు కొత్త షోనే అయినా ఇక్కడి ప్రేక్షకులు దీనికి ఊహించని రీతిలో స్పందనను అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఐదు సీజన్లు ముగిసిన తర్వాత ఇప్పుడు ఓటీటీ వెర్షన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి దాన్ని ప్రారంభించారు. ఇది కూడా ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతోంది? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది? అనేవి తెలుసుకుందాం పదండి!

చిత్ర విచిత్రంగా.. ఫుల్ మజాగానే

చిత్ర విచిత్రంగా.. ఫుల్ మజాగానే

మామూలు సీజన్లలా బుల్లితెరపై ప్రసారం కాకపోయినా బిగ్ బాస్ నాన్ స్టాప్‌ ఆరంభం నుంచే మంచి స్పందనను అందుకుంటోంది. 24 గంటలూ ప్రసారం అవడంతో పాటు ఒక గంట ఎపిసోడ్ కూడా వస్తుండడంతో స్పందన దక్కుతోంది. అందుకు అనుగుణంగానే ఇది మొదటి నుంచే సరికొత్తగా నడుస్తూ మజాను అందిస్తోంది. ఫలితంగా రోజు రోజుకూ మరింత రంజుగా మారుతోంది.

17 మందిలో ముగ్గురు బయటకు

17 మందిలో ముగ్గురు బయటకు

ఓటీటీ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో 3 వారాల్లో ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూలు ఎలిమినేట్ అయిపోయారు.

నామినేషన్స్ కోసం సరికొత్త ప్లాన్

నామినేషన్స్ కోసం సరికొత్త ప్లాన్

బిగ్ బాస్ షోలో ఎన్నో రకాల టాస్కులు ఉంటాయి. కానీ, అందులో అత్యంత ముఖ్యమైనదిగా నామినేషన్స్‌ను చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఎవరిని ఉంచాలో ప్రేక్షకులు డిసైడ్ చేస్తుంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నాన్ స్టాప్ సీజన్‌లో ఎక్కువ మంది నామినేషన్స్‌లో ఉండేలా నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. తద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచే స్ట్రాటజీని అమలు చేస్తున్నారు.

ఈ వారం ఏడుగురు నామినేషన్

ఈ వారం ఏడుగురు నామినేషన్

సాధారంగా బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్క్ రచ్చగా ఉంటోంది. అందుకు అనుగుణంగానే నాన్ స్టాప్ మూడో వారం నామినేషన్స్ టాస్క్ కూడా కొన్ని గొడవలతో సాగింది. ఇందులో మొత్తం బిందు మాధవి, స్రవంతి చోకారపు, మిశ్రా శర్మ, మహేశ్ విట్టా, యాంకర్ శివ, హమీదా ఖతూన్, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, అఖిల్ సార్థక్‌, అజయ్, ఆర్జే చైతూ, తేజస్వీలు నామినేట్ అయ్యారు.

టైటిల్ ఫేవరెట్ టాప్ ప్లేస్‌లోనే

టైటిల్ ఫేవరెట్ టాప్ ప్లేస్‌లోనే

నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి ఎంతో మంది ఎంట్రీ ఇచ్చారు. కానీ, అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్లుగా పేరు సంపాదించుకున్నారు. అందులో ప్రముఖ హీరోయిన్ బిందు మాధవి ఒకరు. ఆరంభంలోనే అందరి దృష్టిలో పడిన ఆమె.. అన్నింటా మెప్పిస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో నాలుగో వారం నామినేషన్స్‌లో ఉన్న బిందు ఎక్కువ ఓట్లతో టాప్‌లో ఉందట.

అతడికి భారీగా.. ఓటింగ్ ఆర్డర్

అతడికి భారీగా.. ఓటింగ్ ఆర్డర్

ఈ షోలో ఓటింగ్ ఒక్క సంఘటనతోనే మారిపోతుందన్న విషయం తెలిసిందే. ఈ వారం ఆరంభం నుంచే ఆకట్టుకుంటోన్న యాంకర్ శివకు కూడా భారీ ఓటింగ్ పడుతుందట. దీంతో అతడు రెండో స్థానంలో ఉన్నాడని తెలిసింది. ఆ తర్వాత పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న అజయ్ మూడో స్థానంలో, ఆరియానా గ్లోరి నాలుగో స్థానంలో, సరయు రాయ్ ఐదో స్థానంలో ఉన్నారని సమాచారం.

Recommended Video

Kannadigas Angry With RRR Movie..తప్పెవరిది ? | RRR Vs KGF 2 | Filmibeat Telugu
వాళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్?

వాళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్?


నాలుగో వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో ఆరంభం నుంచే అనిల్ రాథోడ్ చివరి స్థానంలో కొనసాగుతున్నాడట. అతడి కంటే ముందు అంటే ఆరో స్థానంలో మిత్రా శర్మ ఉందని తెలుస్తోంది. అంటే ఈ వారం వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే, ఇది బిగ్ బాస్ షో కాబట్టి.. చివర్లో ఫలితం మారినా ఆశ్చర్యపోయే అవసరం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X