Bigg Boss Elimination: 2వ వారం ఓటింగ్‌లో ట్విస్ట్.. టాప్‌లో టైటిల్ ఫేవరెట్.. ఆ ఇద్దరిలో ఒకరు ఔట్

ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను అందుకుంటూ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోన్న ఏకైక షో బిగ్ బాస్. అంతలా ఇది ఐదేళ్లుగా అందరినీ అలరిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. దీంతో ఇప్పుడు ఓటీటీ వెర్షన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్‌ను కూడా ప్రారంభించారు. ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోన్న ఇది.. ప్రేక్షకులకు మజాను పంచుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రెండో వారానికి సంబంధించి ఏకంగా పదకొండు మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. వీళ్లలో ఎవరికి ఎక్కువగా ఓట్లు పడుతున్నాయి? ఈ వారం డేంజర్‌ జోన్‌లో ఉన్నది ఎవరు? అన్న విషయాలను తెలుసుకుందాం పదండి!

నాన్ స్టాప్ వినోదం కోసం కొత్తగా

నాన్ స్టాప్ వినోదం కోసం కొత్తగా

ఓటీటీ వెర్షన్ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్' ఫస్ట్ సీజన్‌ను ఇటీవలే మొదలైంది. ఇది మొత్తం 84 రోజుల పాటు ప్రసారం కానుంది. ఈ సీజన్‌లోకి ఏకంగా 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ హౌస్‌లోకి ప్రవేశించారు. ఇక, దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్నారు. నాన్ స్టాప్‌గా వినోదాన్ని అందించడం కోసం సరికొత్త ప్రయోగాలతో దీన్ని లైవ్‌‌గా ప్రసారం చేస్తున్నారు.

మొత్తం 17 మంది.. ఒకరు ఔట్

మొత్తం 17 మంది.. ఒకరు ఔట్

బిగ్ బాస్ ఓటీటీ ఫస్ట్ సీజన్‌లోకి అషు రెడ్డి, సరయు రాయ్, బిందు మాధవి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, హమీదా ఖతూన్, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, అఖిల్ సార్థక్‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీళ్ల నుంచి మొదటి వారం ముమైత్ ఎలిమినేట్ అయింది.

రెండో వారం నామినేషన్స్ ఇలా

రెండో వారం నామినేషన్స్ ఇలా

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ కొన్ని గొడవలతో రచ్చ రచ్చగా సాగింది. ఇందులో మొత్తం పదకొండు మంది నామినేట్ అయ్యారు. అందులో శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, అషు రెడ్డి, సరయు రాయ్, మహేశ్ విట్టా, యాంకర్ శివ, హమీదా ఖతూన్, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, అఖిల్ సార్థక్‌లు ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నారు.

టాప్‌ ప్లేస్‌లో అతడే.. పోటీగానే

టాప్‌ ప్లేస్‌లో అతడే.. పోటీగానే

బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నట్లు అనిపిస్తోంది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో ఆరంభం నుంచీ టాప్ ప్లేస్ కోసం ఇద్దరు కంటెస్టెంట్లు అంటే అఖిల్ సార్థక్, యాంకర్ శివ పోటీ పడుతున్నారట. కాసేపు ఒకరు టాప్‌లో ఉంటే.. మరికాసేపు ఇంకొకరు నెంబర్ వన్ స్థానంలో ఉంటున్నారని తెలిసింది.

వారియర్స్‌కే ఎక్కువ ఓటింగ్

వారియర్స్‌కే ఎక్కువ ఓటింగ్

ఈ వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో వారియర్స్‌కే ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. మూడో స్థానంలో ఆరియానా గ్లోరీ, నాలుగో స్థానంలో సరయు, ఐదో స్థానంలో నటరాజ్ మాస్టర్, ఆరో స్థానంలో అషు రెడ్డి, ఏడో స్థానంలో హమీదా ఖతూన్, ఎనిమిదో స్థానంలో మహేశ్ విట్టాలు ఉన్నారట. వీళ్లంతా దాదాపుగా సేఫ్ అయినట్లే అని టాక్.

చివర్లో కొనసాగుతోన్నది వీళ్లే

చివర్లో కొనసాగుతోన్నది వీళ్లే

బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండో వారినికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మొదలై రెండు రోజులు అవుతోంది. ఇక, ఇందులో ఆరంభం నుంచి వారియర్స్ టీమ్ సభ్యుడు అనిల్ రాథోడ్ తొమ్మిదో స్థానంలోనే కొనసాగుతున్నాడట. అలాగే, చివరి రెండు స్థానాల్లో వారియర్స్ అయిన మిత్రా శర్మ, శ్రీ రాపాక ఉన్నారని తెలుస్తోంది. ఈ ముగ్గురికే తక్కువ ఓట్లు పోలవుతున్నాయని అంటున్నారు.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu
ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్

ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్

ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ట్రెండ్ చూస్తే.. వారియర్స్ టీమ్ మెంబర్స్ అయిన మిత్రా శర్మ, శ్రీ రాపాక చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇదే కంటిన్యూ అయితే వీళ్లిద్దరి నుంచి ఒకరు కచ్చితంగా ఎలిమినేట్ అవుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇది బిగ్ బాస్ షో. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు కాబట్టి.. ఈ రిజల్ట్ మారినా ఆశ్చర్యపోనవసరం లేదని అనుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X