Bigg Boss Non Stop: ఆరో వారం షాకింగ్ ఓటింగ్.. 10 మందిలో ఒకరికే 50 శాతం.. ఈసారి ఎలిమినేట్ ఎవరంటే!

తెలుగు బుల్లితెరపైకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల నుంచి విశేషమైన మద్దతును కూడగట్టుకుని సూపర్ డూపర్ హిట్ షోగా నిలిచింది బిగ్ బాస్. ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులు ఇవ్వడంతో పాటు జనాలు మెచ్చే సన్నివేశాలను చూపిస్తూ నిర్వహకులు ఈ షోపై ఆసక్తిని మరింతగా పెంచుతున్నారు. ఫలితంగా ఇది ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ నాన్ స్టాప్ ఫస్ట్ సీజన్‌ను కూడా ఆసక్తికరంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా ఇందులో ఎలిమినేషన్స్ ఊహకందని విధంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరో వారం ఓటింగ్ ప్రక్రియ ఎలా సాగుతోంది? ఈ సారి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంది? అనే వివరాలు చూద్దాం పదండి!

మరింత వినోదంతో నాన్ స్టాప్

మరింత వినోదంతో నాన్ స్టాప్

ఓటీటీలో ప్రసారం అవుతోన్నా బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ భారీ స్థాయిలో ఆదరణను అందుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త టాస్కులు పెట్టడంతో పాటు బోల్డు కంటెంట్‌ను కూడా ఎక్కువగా చూపించడంతో ఇది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అంతేకాదు, రోజు రోజుకూ మరింత రంజుగా మారుతూ ప్రేక్షకులకు మజాను అందిస్తోంది.

4 వారాల్లో... ఐదుగురు అవుట్

4 వారాల్లో... ఐదుగురు అవుట్

ఈ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంటర్ అయ్యారు. వీళ్లలో నుంచి ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు ఎలిమినేట్ అయ్యారు.

నామినేషన్స్‌ కొత్త స్ట్రాటజీతో

నామినేషన్స్‌ కొత్త స్ట్రాటజీతో

ఈ రియాలిటీ షోలో ఎన్నో రకాల టాస్కులుంటాయి. కానీ, అందులో అత్యంత ముఖ్యమైనదిగా నామినేషన్స్‌ను చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఎవరిని ఉంచాలో ప్రేక్షకులు డిసైడ్ చేస్తుంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నాన్ స్టాప్ సీజన్‌లో ఎక్కువ మంది నామినేషన్స్‌లో ఉండేలా నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. తద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు.

6వ వారం లిస్టులో 10 మంది

6వ వారం లిస్టులో 10 మంది

ఆరో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ టాస్కు ఎన్నో గొడవలతో సాగింది. ఇందులో మొత్తంగా పది మంది నామినేట్ అయ్యారు. అందులో మిత్రా శర్మ, నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టా, అషు రెడ్డి, హమీదా, బిందు మాధవి, యాంకర్ శివ, అజయ్, స్రవంతి, ముమైత్ ఖాన్‌లు ఉన్నారు. అంటే కెప్టెన్ అఖిల్‌తో పాటు ఆరియానా గ్లోరీ ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకుంది.

ఒక్కరికే సగం ఓట్లు పోలింగ్

ఒక్కరికే సగం ఓట్లు పోలింగ్

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి ఎంతో మంది కంటెస్టెంట్లుగా వచ్చినా.. ప్రముఖ హీరోయిన్ బిందు మాధవి మాత్రం టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఆమెకు ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆరో వారం నామినేషన్స్‌లో ఉన్న బిందుకు దాదాపు 50 శాతం ఓట్లు పడుతున్నాయని తెలిసింది.

మిగిలిన సభ్యులు పొజిషన్స్

మిగిలిన సభ్యులు పొజిషన్స్

తాజా సమాచారం ప్రకారం.. ఆరో వారం నామినేషన్స్‌లో ఉన్న వారిలో యాంకర్ శివ రెండో స్థానంలో, అషు రెడ్డి మూడో స్థానంలో, హమీదా నాలుగో స్థానంలో, అజయ్ ఐదో స్థానంలో, నటరాజ్ మాస్టర్ ఆరో స్థానంలో, మిత్రా శర్మ ఏడో స్థానంలో, మహేశ్ విట్టా ఎనిమిదో స్థానాల్లో కొనసాగుతున్నారట. దాదాపు ఈ వారం కూడా వీళ్లంతా సేఫ్ అయినట్లే అని ప్రచారం జరుగుతోంది.

వాళ్లలో ఒకరు ఎలిమినేషన్

వాళ్లలో ఒకరు ఎలిమినేషన్

ఆరో వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో ఆరంభం నుంచే ముమైత్ ఖాన్ చివరి స్థానంలో కొనసాగుతోందట. ఆమె కంటే ముందు అంటే తొమ్మిదో స్థానంలో స్రవంతి చోకారపు ఉందని తెలిసింది. అంటే ఈ వారం వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కనుక ఉంటే వీళ్లిద్దరూ వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X