Bigg Boss Elimination: ఒక్కరోజులో మారిన ఓటింగ్‌.. డేంజర్ జోన్‌లోకి ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు

తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మన్ననలు అందుకుని సక్సెస్‌పుల్ షోలుగా పేరు తెచ్చుకుంటున్నాయి. అందులో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనికి కారణం ఈ షో ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్‌ను అందుకుంది. తద్వారా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలైంది. ఇందులో రెండో వారానికి ఏకంగా 11 మంది నామినేట్ అయ్యారు. అందులో ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లోకి వెళ్లారని తాజాగా తెలిసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలకై పూర్తిగా చూడండి!

ఎంటర్‌టైన్‌మెంట్ నాన్ స్టాప్‌గా

ఎంటర్‌టైన్‌మెంట్ నాన్ స్టాప్‌గా

‘బిగ్ బాస్ నాన్ స్టాప్' ఫస్ట్ సీజన్‌ రెండు వారాల క్రితమే మొదలైంది. ఇది మొత్తం 84 రోజుల పాటు ప్రసారం కానుంది. ఈ సీజన్‌లోకి 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇక, దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. నాన్ స్టాప్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడం కోసం దీన్ని కొంత బోల్డుగానే ప్రసారం చేస్తున్నారు.

17 మందిలో ఒకరు ఎలిమినేట్

17 మందిలో ఒకరు ఎలిమినేట్

బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లోకి అషు రెడ్డి, సరయు రాయ్, బిందు మాధవి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, హమీదా ఖతూన్, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, అఖిల్ సార్థక్‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీళ్లలో మొదటి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది.

ఏకంగా 11 మంది నామినేషన్

ఏకంగా 11 మంది నామినేషన్

బిగ్ బాస్‌లో నామినేషన్స్ రచ్చ ఎలా ఉంటుందో తెలిసిందే. అందుకు అనుగుణంగానే నాన్ స్టాప్ రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ కొన్ని గొడవలతో సాగింది. ఇందులో మొత్తం పదకొండు మంది శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, అషు రెడ్డి, సరయు రాయ్, మహేశ్ విట్టా, యాంకర్ శివ, హమీదా ఖతూన్, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, అఖిల్ సార్థక్‌లు నామినేట్ అయ్యారు.

అఖిలే టాప్ ప్లేస్‌.. శివ పోటీగా

అఖిలే టాప్ ప్లేస్‌.. శివ పోటీగా

బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఏరోజుకు ఆరోజు మారుతున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో ఆరంభం నుంచీ టాప్ ప్లేస్ కోసం ఇద్దరు కంటెస్టెంట్లు అంటే అఖిల్ సార్థక్, యాంకర్ శివ పోటీ పడుతున్నారట. కానీ, వారియరే ముందుంటున్నాడని తెలుస్తోంది. కొత్త కుర్రాడు శివ కూడా బాగానే ఓట్లు రాబడుతున్నాడట.

ఒక్కరోజులోనే మారిన ఓటింగ్

ఒక్కరోజులోనే మారిన ఓటింగ్

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ‘తగ్గేదేలే' అనే టాస్క్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో వారియర్స్, చాలెంజర్స్ జట్ల సభ్యులు బాహాబాహీకి దిగడంతో పాటు తమ ఒరిజినల్ క్యారెక్టర్లను బయటపెడుతున్నారు. ఫలితంగా స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్లు చివరికి, వీక్ అనుకున్న వాళ్లు పైపైకి వెళ్తున్నారని తెలుస్తోంది. ఒక్క ఎపిసోడ్‌తో ఓటింగ్ సరళి మారిందని అంటున్నారు.

చివరి వాళ్లు పైకి వెళ్లడంతో

చివరి వాళ్లు పైకి వెళ్లడంతో

రెండో వారానికి సంబంధించిన ఓటింగ్ మొదలైన తర్వాత శ్రీ రాపాక, మిత్రా శర్మ చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. కానీ, హౌస్‌లో వీళ్లిద్దరూ చక్కని ఆటతీరును కనబర్చడంతో పైపైకి వెళ్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా తాజా సమాచారం ప్రకారం.. అఖిల్ సార్థక్, యాంకర్ శివ, ఆరియానా గ్లోరీ, హమీదా, అషు రెడ్డి, శ్రీ రాపాక, మిత్రా శర్మ, సరయులు ఎనిమిది స్థానాల్లో ఉన్నారని సమాచారం.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu
డేంజర్‌ జోన్‌లో వారియర్స్

డేంజర్‌ జోన్‌లో వారియర్స్


తాజా సమాచారం ప్రకారం.. అనిల్ రాథోడ్ తొమ్మిదో స్థానంలో ఉండగా.. నటరాజ్ మాస్టర్, మహేశ్ విట్టాలు డేంజర్ జోన్‌లోకి వెళ్లారట. బిందు మాధవితో గొడవ వల్ల నటరాజ్ మాస్టర్‌ ఓటింగ్‌పై ప్రభావం పడుతోందని తెలుస్తోంది. అలాగే, మహేశ్ విట్టా కూడా కోపంగా అందరికీ అరుస్తుండడంతో ఓట్లు తగ్గాయని అంటున్నారు. ఇదే కొనసాగితే ఈ ఇద్దర్లో ఒకరు ఎలిమినేట్ అవడం ఖాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X