Bigg Boss Non Stop: ఆర్జే చైతూ ఎలిమినేషన్‌పై డౌట్స్.. బయట ఉన్న వాళ్ల పనే.. అతడే అలా అనడంతో!
దేశంలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగు బుల్లితెరపై మాత్రమే భారీ స్థాయిలో స్పందనను అందుకుంటూ.. అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను రాబడుతోన్న షో బిగ్ బాస్. అస్సలు పరిచయమే లేని కాస్సెప్టే అయినా దీనికి ప్రేక్షకులు ఊహించని రీతిలో స్పందనను అందించారు. ఫలితంగా ఈ షో సూపర్ సక్సెస్ అయింది. దీంతో ఇప్పుడు ఓటీటీ వెర్షన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్‌ను నిర్వహకులు ప్రారంభించారు. ఇది కూడా ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు మజాను పంచుతోంది. అంతా సాఫీగా సాగిపోతోన్న సమయంలో ఈ సీజన్‌లో ఆర్జే చైతూ ఎలిమినేషన్ అందరికీ షాకిచ్చింది. ఈ నేపథ్యంలో అతడు తన ఎలిమినేషన్‌పై కొన్ని ఆరోపణలు చేశాడు. ఆ వివరాలు మీకోసం!

ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్
‘బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఇది మొత్తం 84 రోజుల పాటు ప్రసారం కానుంది. దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇది ఆరంభం నుంచే రంజుగా సాగుతోంది. తద్వారా ప్రేక్షకులకు వంద శాతం ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూనే ఉంది. ఏకంగా లైవ్‌లో కాకుండా ఒకరోజు ఆలస్యంగా ప్రసారం చేస్తున్నారు.

17 మంది.. ఇద్దరు బయటకు
ఈ సీజన్‌లోకి అషు రెడ్డి, సరయు రాయ్, బిందు మాధవి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, హమీదా ఖతూన్, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, అఖిల్ సార్థక్‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీళ్లలో మొదటి వారం ముమైత్, రెండో వారం శ్రీ రాపాక ఎలిమినేట్ అయిపోయారు.

12 మంది నామినేషన్‌లోనే
బిగ్ బాస్‌లో నామినేషన్స్ టాస్క్ గొడవలతోనే సాగుతూ ఉంటుంది. అందుకు అనుగుణంగానే నాన్ స్టాప్ మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా రచ్చగా సాగింది. ఇందులో పన్నెండు మంది బిందు మాధవి, స్రవంతి చోకారపు, మిశ్రా శర్మ, మహేశ్ విట్టా, యాంకర్ శివ, హమీదా ఖతూన్, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, అఖిల్ సార్థక్, అజయ్, ఆర్జే చైతూ, తేజస్వీలు నామినేట్ అయ్యారు.

ఈ వారం ఆర్జే చైతూ అవుట్
సాధారణంగా బిగ్ బాస్ సీజన్‌లతో షాకింగ్ ఎలిమినేషన్స్ అంటూ కొన్ని జరుగుతూ ఉంటాయి. ప్రతి సీజన్‌లోనూ ఇలా ఒకరిద్దరు ఫేవరెట్ కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోతుంటారు. అయితే, బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో మాత్రం మూడో వారమే షాకింగ్ ఎలిమినేషన్ కనిపించింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆర్జే చైతూ తక్కువ ఓట్లు పడ్డ కారణంగా ఎలిమినేట్ అయ్యాడు.

శోకసంద్రంలో కంటెస్టెంట్లు
ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ వచ్చిన నాగార్జున.. చివర్లో మిగిలిన ఇద్దరిలో ఆర్జే చైతూ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దీంతో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లతో పాటు షోను చూస్తున్న వాళ్లు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అదే సమయంలో బిందు మాధవి, మిత్రా శర్మ, యాంకర్ శివ సహా పలువురు కంటెస్టెంట్లు శోకసంద్రంలో మునిగిపోయారు.

బయట ఉన్న వాళ్ల పనేనని
టైటిల్ ఫేవరెట్ ఆర్జే చైతూ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన తర్వాత హౌస్‌లో చాలా సేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ సమయంలో తన ఎలిమినేషన్‌కు కారణం ఏంటా అని అతడు తోటి కంటెస్టెంట్లతో చర్చించాడు. అప్పుడు ఆర్జే చైతూ.. ‘ఇంట్లో మాత్రం ఈ వారం బాగానే ఉన్నాను. కచ్చితంగా ఇది బయట ఉన్న వాళ్ల పనే' అంటూ కొత్త అనుమానాలకు ఆద్యం పోశాడు.
Recommended Video


ఎన్నో డౌట్లు.. ఆమె కూడానా
స్ట్రాంగ్ కంటెస్టెంట్.. పైగా గత సీజన్లలో శ్రీముఖి, ఆర్జే కాజల్‌కు ఓట్లు వేయించిన సామర్ధ్యం ఉన్న ఆర్జే చైతూ మూడో వారమే ఎలిమినేట్ అవడంతో బిగ్ బాస్ తీరుపై అనుమానాలు, విమర్శలు వస్తున్నాయి. కావాలనే అతడిని ఎలిమినేట్ చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు, కొందరు మాత్రం ముమైత్ బయట చేస్తున్న ప్రచారమూ చైతూకు దెబ్బకొట్టిందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











