Bigg Boss Non Stop: ఓటింగ్‌లో భారీ మార్పు.. పేరు లేని కంటెస్టెంట్‌ పైపైకి.. ఈ వారం వెళ్లేది ఎవరంటే!

ఊహకే అందని ట్విస్టులు.. సరికొత్త టాస్కులతో సాగుతూ ప్రేక్షకులకు ఆద్యంతం మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. అందుకే అంచనాలు లేకుండానే వచ్చి ఈ షో సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అదే సమయంలో భారీగా రేటింగ్‌ను అందుకుని దేశంలోనే నెంబర్ వన్ షోగా నిలిచింది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్‌ను ప్రారంభించారు. ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. ఫలితంగా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక, నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ గురించి షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అవేంటో చూద్దాం పదండి!

 రంజుగా మారిపోయిన బిగ్ బాస్

రంజుగా మారిపోయిన బిగ్ బాస్

ఓటీటీలోనే ప్రసారం అవుతోన్నా బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను ప్రేక్షకుల నుంచి భారీ స్పందనే దక్కుతోంది. ఇందులో ఆరంభం నుంచి సరికొత్త టాస్కులు ఇస్తూ.. బోల్డు కంటెంట్‌ను చూపిస్తూ నిర్వహకులు అందరి దృష్టినీ ఆకర్షించారు. ఫలితంగా ఇది విజయవంతంగా నడుస్తోంది. ఆట కూడా రోజు రోజుకూ కష్టంగా మారడంతో ప్రేక్షకులకు వినోదం కూడా దక్కుతోంది.

మూడు వారాల్లో.. ముగ్గురు ఔట్

మూడు వారాల్లో.. ముగ్గురు ఔట్

ఈ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో 3 వారాల్లో ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూలు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

నామినేషన్స్‌తో స్ట్రాటజీ చూపి

నామినేషన్స్‌తో స్ట్రాటజీ చూపి

వాస్తవానికి బిగ్ బాస్‌లో ఎన్నో రకాల టాస్కులుంటాయి. కానీ, అందులో అత్యంత ముఖ్యమైనదిగా నామినేషన్స్‌ను చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఎవరిని ఉంచాలో ప్రేక్షకులు డిసైడ్ చేస్తుంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నాన్ స్టాప్ సీజన్‌లో ఎక్కువ మంది నామినేషన్స్‌లో ఉండేలా నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. తద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు.

4వ వారం ఏడుగురు నామినేట్

4వ వారం ఏడుగురు నామినేట్

బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్క్ రచ్చగా ఉంటోంది. అందుకు అనుగుణంగానే నాన్ స్టాప్ నాలుగో వారం నామినేషన్స్ టాస్క్ కూడా కొన్ని గొడవలతో సాగింది. ఇందులో మొత్తం బిందు మాధవి, మిశ్రా శర్మ, యాంకర్ శివ, ఆరియానా గ్లోరీ, అజయ్, సరయు రాయ్, అనిల్ రాథోడ్‌లు నామినేట్ అయ్యారు. ఇందులో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న మాత్రం ఆసక్తికరంగా మారింది.

టాప్ ప్లేస్‌లో టైటిల్ ఫేవరెట్

టాప్ ప్లేస్‌లో టైటిల్ ఫేవరెట్

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి టైటిల్ ఫేవరెట్‌గా ఎంట్రీ ఇచ్చిన వారిలో ప్రముఖ హీరోయిన్ బిందు మాధవి ఒకరు. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఆమెకు ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నాలుగో వారం నామినేషన్స్‌లో ఉన్న బిందుకు భారీ మద్దతు దక్కినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఆమె ఎక్కువ ఓట్లతో సేవ్ అయినట్లు సమాచారం.

మారిన ఓటింగ్... ఎవరెక్కడ?

మారిన ఓటింగ్... ఎవరెక్కడ?

బిగ్ బాస్ షోలో ఎవరికి ఎక్కువ మద్దతు దక్కుతుందో.. ఎవరికి తక్కువ ఓట్లు పడతాయో చెప్పడం కష్టం. మూడు వారాలుగా ఎలిమినేసన్స్‌లో అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక, ఈ వారం బిందు మాధవి తర్వాత ఎక్కువ ఓట్లు సాధించి యాంకర్ శివ, అజయ్, ఆరియానా గ్లోరిలు సేఫ్ అయ్యారట. అయితే, అనూహ్యంగా మిత్రా శర్మకు ఓటింగ్ పెరిగి ఆమె కూడా సేవ్ అయిందని టాక్.

 ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్?

ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్?

నాలుగో వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో ఆరంభం నుంచే అనిల్ రాథోడ్ చివరి స్థానంలో కొనసాగుతున్నాడని తెలుస్తోంది. అతడి కంటే ముందు అంటే ఆరో స్థానంలో మిత్రా శర్మ ఉన్నా.. ఆ తర్వాత పుంజుకుందట. దీంతో సరయు రాయ్ ఒక స్థానం పడిపోయిందట. దీంతో ఈ వారం వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X