Bigg Boss Non Stop: ఆ కంటెస్టెంట్‌కు భారీ ఓటింగ్.. డేంజర్‌ జోన్‌లో ఇద్దరు.. మళ్లీ లేడీనే ఎలిమినేట్!

సరికొత్త కాన్సెప్టుతో నడిస్తూ.. ఊహకే అందని ట్విస్టులు.. ఎప్పటికప్పుడు వినూత్నమైన టాస్కులతో సాగుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. అంచనాలు లేకుండానే వచ్చినా ఈ షో సూపర్ డూపర్ సక్సెస్ అయిందంటే అదే కారణం. అందుకే భారీగా రేటింగ్‌ను అందుకుని దేశంలోనే నెంబర్ వన్ షోగా నిలిచింది. ఇక, ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోన్న ఓటీటీ వెర్షన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్‌ కూడా ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతూ మజాను అందిస్తోంది. ఫలితంగా సక్సెస్‌ఫుల్‌గా ప్రసారం అవుతోంది. ఈ నేపథ్యంలో ఐదో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అసలు ఎవరు ఏ స్థానంలో ఉన్నారన్న దానిపై లుక్కేద్దాం పదండి!

Recommended Video

Bigg Boss Telugu OTT : Bindu Madhavi ప్రభంజనానికి అడ్డుపడుతున్న Akhil Sarthak | Filmibeat Telugu
రంజుగా సాగుతోన్న బిగ్ బాస్

రంజుగా సాగుతోన్న బిగ్ బాస్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోన్నా బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను ప్రేక్షకుల నుంచి భారీ స్పందనే దక్కుతోంది. ఇందులో ఆరంభం నుంచి సరికొత్త టాస్కులు ఇస్తూ.. బోల్డు కంటెంట్‌ను చూపిస్తూ నిర్వహకులు అందరి దృష్టినీ ఆకర్షించారు. ఫలితంగా ఇది విజయవంతంగా నడుస్తోంది. ఆట కూడా రోజు రోజుకూ కష్టంగా మారడంతో ప్రేక్షకులకు వినోదం దక్కుతోంది.

4 వారాల్లో.. నలుగురు అవుట్

4 వారాల్లో.. నలుగురు అవుట్

నాన్ స్టాప్ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయులు ఎలిమినేట్ అయిపోయారు.

కొత్త స్ట్రాటజీతో నామినేషన్స్

కొత్త స్ట్రాటజీతో నామినేషన్స్

బిగ్ బాస్‌లో ఎన్నో రకాల టాస్కులుంటాయి. కానీ, అందులో అత్యంత ముఖ్యమైనదిగా నామినేషన్స్‌ను చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఎవరిని ఉంచాలో ప్రేక్షకులు డిసైడ్ చేస్తుంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నాన్ స్టాప్ సీజన్‌లో ఎక్కువ మంది నామినేషన్స్‌లో ఉండేలా నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. తద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచే స్ట్రాటజీని అమలు చేస్తున్నారు.

5వ వారం లిస్ట్‌లో ఏడుగురు

5వ వారం లిస్ట్‌లో ఏడుగురు

నాన్ స్టాప్ ఐదో వారం నామినేషన్స్ టాస్క్ కొన్ని గొడవలతో సాగింది. అయితే, మధ్యలో స్వైప్ చేసే టాస్కును కూడా ఇచ్చారు. దీంతో అషు, మహేశ్ విట్టా దీని నుంచి సేఫ్ అయ్యారు. ఇందులో మొత్తం బిందు మాధవి, మిశ్రా శర్మ, యాంకర్ శివ, ఆరియానా గ్లోరీ, స్రవంతి చోకారపు, తేజస్వీ మదివాడ, అనిల్ రాథోడ్‌లు నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఆ కంటెస్టెంట్‌కు భారీ ఓట్స్

ఆ కంటెస్టెంట్‌కు భారీ ఓట్స్


బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఎంతో మంది వచ్చినా.. టైటిల్ ఫేవరెట్‌గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం ప్రముఖ హీరోయిన్ బిందు మాధవినే. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఆమెకు ఫాలోయింగ్ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఐదో వారం నామినేషన్స్‌లో ఉన్న బిందుకు భారీ మద్దతు దక్కిందట. ఫలితంగా ఆమెకు 50 శాతం ఓట్లు పడుతున్నాయని టాక్.

ఏ కంటెస్టెంట్ ఏ పొజిషన్‌లో

ఏ కంటెస్టెంట్ ఏ పొజిషన్‌లో

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ ఎలిమినేషన్ ఊహించని విధంగా సాగుతోంది. దీంతో ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నా చివర్లో మారిపోయింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఐదో వారంలో బిందు మాధవి తర్వాత ఎక్కువ ఓట్లు సాధించి యాంకర్ శివ, ఆరియానా గ్లోరిలు సేఫ్ అయ్యారట. అనూహ్యంగా మిత్రా శర్మ నాలుగో స్థానంలో తేజస్వీ మదివాడ ఐదో స్థానంలో ఉన్నారట.

మళ్లీ లేడీనే పంపేస్తారంటూ

మళ్లీ లేడీనే పంపేస్తారంటూ


ఐదో వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో ఆరంభం నుంచే స్రవంతి చోకారపు చివరి స్థానంలో కొనసాగుతుందని తెలుస్తోంది. ఆమె కంటే ముందు అంటే ఆరో స్థానంలో అనిల్ రాథోడ్ ఉన్నాడని అంటున్నారు. దీంతో ఈ వారం వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది. వీరిలో స్రవంతి వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X