Bigg Boss Elimination: అఖిల్‌కు షాక్.. టాప్‌లో లేడీ స్టార్.. డేంజర్‌ జోన్‌లో ఫేమస్ కంటెస్టెంట్లు

బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా సందడి చేస్తూ.. అన్ని భాషల్లోకి కూడా వచ్చేసిన షో బిగ్ బాస్. మరీ ముఖ్యంగా తెలుగులో ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఫలితంగా ఆరంభంలోనే సక్సెస్‌ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది. అదే సమయంలో భారీ టీఆర్పీతో దేశంలోనే నెంబర్ వన్ షోగా మారింది. దీంతో సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌ను మొదలు పెట్టారు. ఇందులో మూడో వారానికి సంబంధించి ఏకంగా 12 మంది నామినేట్ అయ్యారు. అందులో ఇద్దరు ఫేమస్ కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లోకి వెళ్లారని తాజాగా తెలిసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో చూద్దాం పదండి!

నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్

నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్

'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్‌ మూడు వారాల క్రితమే స్టార్ట్ అయింది. ఇది మొత్తం 84 రోజుల పాటు ప్రసారం కానుంది. ఈ సీజన్‌లోకి 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇక, దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇది ఎంతో బోల్డుగా సాగుతూ నాన్ స్టాప్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ ముందుకు సాగుతోంది.

17 మంది.. ఇద్దరు ఎలిమినేట్

17 మంది.. ఇద్దరు ఎలిమినేట్

ఓటీటీ సీజన్‌లోకి అషు రెడ్డి, సరయు రాయ్, బిందు మాధవి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, హమీదా ఖతూన్, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, అఖిల్ సార్థక్‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీళ్లలో మొదటి వారం ముమైత్, రెండో వారం శ్రీ రాపాక ఎలిమినేట్ అయ్యారు.

ఏకంగా 12 మంది నామినేషన్

ఏకంగా 12 మంది నామినేషన్

బిగ్ బాస్‌లో నామినేషన్స్ టాస్క్ రచ్చ రచ్చగా ఉంటోంది. అందుకు అనుగుణంగానే నాన్ స్టాప్ రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ కొన్ని గొడవలతో సాగింది. ఇందులో మొత్తం పన్నెండు మంది బిందు మాధవి, స్రవంతి చోకారపు, మిశ్రా శర్మ, మహేశ్ విట్టా, యాంకర్ శివ, హమీదా ఖతూన్, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, అఖిల్ సార్థక్‌, అజయ్, ఆర్జే చైతూ, తేజస్వీలు నామినేట్ అయ్యారు.

అఖిల్‌కు షాకిచ్చిన లేడీ స్టార్

అఖిల్‌కు షాకిచ్చిన లేడీ స్టార్

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి ఎంతో మంది కంటెస్టెంట్లు వచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే టైటిల్ ఫేవరెట్లుగా బరిలో దిగారు. అందులో నాలుగో సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్ ఒకడు. గత వారం కూడా నామినేషన్‌లో ఉన్న అతడు.. ఎక్కువ ఓట్లు సాధించి టాప్‌లో ఉన్నాడు. అయితే, మూడో వారంలో మాత్రం బిందు మాధవి అతడిని వెనక్కి నెట్టిందని తెలిసింది.

ఎవరే పొజిషన్‌లో ఉన్నారు?

ఎవరే పొజిషన్‌లో ఉన్నారు?

మూడో వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో ఆటతీరుకే ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. మూడో స్థానంలో ఆరియానా గ్లోరీ, నాలుగో స్థానంలో యాంకర్ శివ, ఐదో స్థానంలో హమీదా, ఆరో స్థానంలో అజయ్, ఏడో స్థానంలో ఆర్జే చైతూ, ఎనిమిదో స్థానంలో తేజస్వీలు ఉన్నారట. వీళ్లంతా దాదాపుగా సేఫ్ అయినట్లే అని టాక్.

చివర్లో కొనసాగుతోన్నది వీళ్లే

చివర్లో కొనసాగుతోన్నది వీళ్లే

బిగ్ బాస్ నాన్ స్టాప్ మూడో వారినికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మొదలై రెండు రోజులు అవుతోంది. ఇక, ఇందులో ఆరంభం నుంచి కొత్త కంటెస్టెంట్ మిత్రా శర్మ తొమ్మిదో స్థానంలోనే కొనసాగుతుందట. అలాగే, పదో స్థానంలో నటరాజ్ మాస్టర్ ఉన్నాడని తెలుస్తోంది. వీళ్లిద్దరు కూడా దాదాపుగా డేంజర్ జోన్‌లో ఉన్నారని బుల్లితెర వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం.

ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్

ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్

ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ట్రెండ్ చూస్తే.. ఒక సీనియర్ మహేశ్ విట్టా.. ఒక జూనియర్ స్రవంతి చోకారపు చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇదే కంటిన్యూ అయితే వీళ్లిద్దరి నుంచి ఒకరు కచ్చితంగా ఎలిమినేట్ అవుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇది బిగ్ బాస్ షో. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు కాబట్టి.. ఈ రిజల్ట్ మారినా ఆశ్చర్యపోయే పరిస్థితి లేదని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X