Bigg Boss Non Stop: ఆ ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ మీద ఎలిమినేషన్ కత్తి.. ఎవరి పొజిషన్ ఏంటో తెలుసా?

ఎక్కడో విదేశాల్లో పుట్టుకొచ్చిన బిగ్ బాస్ అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ దేశంలో కూడా నెంబర్ వన్ షోగా నిలిచింది. ఇక, ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఓటీటీ వెర్షన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్‌ కూడా మొదటి నుంచి ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఐదో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అసలు ఎవరు ఏ స్థానంలో ఉన్నారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Recommended Video

Bigg Boss Telugu OTT : Bindu Madhavi ప్రభంజనానికి అడ్డుపడుతున్న Akhil Sarthak | Filmibeat Telugu
 బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట

బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట

ముందు నుంచి ఆసక్తి రేకెత్తించిన బిగ్ బాస్ ఓటీటీ బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట ప్రారంభం అయింది. అలా ఈ సీజన్లో అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టా, తేజస్వీ మదివాడ, సరయు రాయ్, హమీదా ఖాతూన్, అఖిల్ సార్థక్‌లు వారియర్స్ గా అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతు, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, యాంకర్ శివ, బిందు మాధవిలు ఛాలెంజెర్స్ గా ఎంట్రీ ఇచ్చారు.

ఐదో వారం నామినేషన్స్

ఐదో వారం నామినేషన్స్


వీరిలో ముమైత్ ఖాన్ మొదటి వారం , శ్రీ రాపాక రెండో వారం, ఆర్జే చైతు మూడో వారం, సరయు నాలుగో వారం ఎలిమినేట్ అయిపోయారు. అయితే ముమైత్ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది ఆ సంగతి పక్కన పెడితే ఇక లిస్ట్‌లో ఏడుగురు నాన్ స్టాప్ ఐదో వారం నామినేషన్స్ లో ఉన్నారు.

ఎలిమినేట్ అయి బయటకు

ఎలిమినేట్ అయి బయటకు


అయితే, మధ్యలో స్వైప్ చేసే టాస్క్ ఇవ్వడంతో దానిని వాడుకుని అషు, మహేష్ విట్టా దీని నుంచి సేఫ్ అయ్యారు. ఇందులో మొత్తం బిందు మాధవి, మిశ్రా శర్మ, యాంకర్ శివ, ఆరియానా గ్లోరీ, స్రవంతి చొక్కారపు, తేజస్వీ మదివాడ, అనిల్ రాథోడ్‌లు నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అయి బయటకు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.

అత్యధిక ఓట్లతో

అత్యధిక ఓట్లతో


ఓటింగ్ ఫలితాల ప్రకారం, బిందు మాధవి, శివ మరియు అరియానా సేఫ్ జోన్‌లో ఉన్నారు. అనిల్ రాథోడ్, మిత్ర శర్మ కాస్త అటూ ఇటూ కాని పొజిషన్లో ఉండగా తేజస్వి, స్రవంతి డేంజర్ జోన్‌లో ఉన్నారు. అనధికారిక బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటింగ్ ఫలితాల ప్రకారం, తేజస్వి తక్కువ ఓట్లతో అట్టడుగున ఉండగా, బిందు మాధవి అత్యధిక ఓట్లతో అగ్రస్థానంలో ఉంది.

ఎవరు బయటకు వెళతారు?

ఎవరు బయటకు వెళతారు?


ప్రస్తుతం నామినేషన్స్ లో అఖిల్ లేడు కాబట్టి బిందు మాధవికి ఓటింగ్ గట్టిగా వస్తుంది. మొత్తం జరుగుతున్న 35 శాతం నుంచి 40 శాతం వరకు కూడా ఓటింగ్ ఆమె ఒక్కదానికే జరుగుతోందని అంటున్నారు. అలాగే, యాంకర్ శివ కూడా బిందుని ఫాలో అవుతూ ఉండగా సెకండ్ పొజిషన్ లో ఉన్నాడని చెప్పచ్చు. నామినేషన్స్ లో వీరిద్దరూ వచ్చినా సేఫ్ జోన్ లోనే ఉంటున్నారు. మొత్తం మీద ఈ వారం ఓటింగ్ వ్యవహారం మాత్రం ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఈ వారం ఎవరు బయటకు వెళతారు అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X