Bigg Boss Non Stop: అఖిల్ బ్యాచ్‌కు కోలుకోలేని షాక్.. ఐదో వారం ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్!

ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులు.. ఊహించని సంఘటనలు.. టెన్షన్ పెంచే ఎలిమినేషన్స్ వీటితో పాటు కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. లవ్ ట్రాకులు.. రొమాన్స్ వీటన్నింటిని సమాహారమే రియాలిటీ ఆధారంగా నడుస్తోన్న బిగ్ బాస్ షో. ఎన్నో అనుమానాల నడుమ తెలుగు బుల్లితెరపైకి వచ్చిన ఇది.. భారీ రెస్పాన్స్‌తో సూపర్ హిట్ అయింది. దీంతో ఐదు సీజన్లు కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు నడుస్తోన్న బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ కూడా విజయవంతం అవుతోంది. ఈ నేపథ్యంలో ఐదో వారానికి సంబంధించిన ఎలిమినేషన్స్ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు అనే విషయాన్ని చూద్దాం పదండి!

Recommended Video

Bigg Boss Telugu OTT : Bindu Madhavi ప్రభంజనానికి అడ్డుపడుతున్న Akhil Sarthak | Filmibeat Telugu
రసవత్తరంగా సాగుతోన్న షో

రసవత్తరంగా సాగుతోన్న షో

బుల్లితెరపై ప్రసారం కాకపోయినా బిగ్ బస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌కు కూడా నెటిజన్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుతోంది. దీనికి కారణం ఇందులో గతంలో ఎన్నడూ చూడని సరికొత్త కంటెంట్ కనిపిస్తుండడమే. దీనికితోడు ఈ సీజన్‌ను కొంత బోల్డుగా నడిపిస్తున్నారు. ఫలితంగా ఇది రోజురోజుకూ ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు ప్రతిరోజూ మజాను అందిస్తూనే నడుస్తోంది.

4 వారాల్లో... నలుగురు ఔట్

4 వారాల్లో... నలుగురు ఔట్

తాజా సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో 4 వారాల్లో ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయులు ఎలిమినేట్ అయ్యారు.

నామినేషన్స్ సరికొత్తగానే

నామినేషన్స్ సరికొత్తగానే

సాధారణంగా బిగ్ బాస్‌లో ఎన్నో రకాల టాస్కులు ఉంటాయి. కానీ, అందులో నామినేషన్స్‌ను అత్యంత ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. దీని ద్వారా ఎవరిని ఉంచాలో ప్రేక్షకుల ఓట్లు ద్వారా డిసైడ్ చేస్తుంటారు. అయితే, నాన్ స్టాప్ సీజన్‌లో ఎక్కువ మంది నామినేషన్స్‌లో ఉండేలా నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. తద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచాలని వాళ్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వారం లిస్ట్‌లో వీళ్లంతా

ఈ వారం లిస్ట్‌లో వీళ్లంతా

ఐదో వారం నామినేషన్స్ టాస్క్ కొన్ని గొడవలతో సాగింది. అయితే, మధ్యలో స్వైప్ చేసే టాస్కును కూడా ఇచ్చారు. దీంతో అషు, మహేశ్ విట్టా దీని నుంచి సేఫ్ అయ్యారు. ఇందులో మొత్తం బిందు మాధవి, మిశ్రా శర్మ, యాంకర్ శివ, ఆరియానా గ్లోరీ, స్రవంతి చోకారపు, తేజస్వీ మదివాడ, అనిల్ రాథోడ్‌లు నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు వెళ్తారన్నది సస్పెన్స్‌గా మారిపోయింది.

టాప్‌లో టైటిల్ ఫేవరెట్

టాప్‌లో టైటిల్ ఫేవరెట్


బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి చాలా మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. కానీ, అందులో ప్రముఖ హీరోయిన్ బిందు మాధవి మాత్రం టైటిల్ ఫేవరెట్‌గా మారింది. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఆమెకు పాపులారిటీ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఐదో వారం నామినేషన్స్‌లో ఉన్న బిందుకు భారీ స్థాయిలో ఓట్లు పడ్డాయని, దీంతో ఆమె సేఫ్ అయిందని టాక్.

 మిగిలిన వాళ్ల పొజిషన్స్

మిగిలిన వాళ్ల పొజిషన్స్

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌‌లో ఎలిమినేషన్ ఎవరూ ఊహించని విధంగా ఉంటోంది. దీంతో ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నా చివర్లో మారిపోయింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఐదో వారంలో బిందు మాధవి తర్వాత యాంకర్ శివ, తేజస్వీ మదివాడ, ఆరియానా గ్లోరీ, మిత్రా శర్మలు ఉన్నారని తెలుస్తోంది. ఫలితంగా వీళ్లందరూ ఈ వారినికి సేఫ్ అయ్యారని అంటున్నారు.

ఈ వారం ఆమెనే అవుట్

ఈ వారం ఆమెనే అవుట్

ఐదో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో అనిల్ రాథోడ్ ఆరో స్థానంలో ఉన్నాడట. అంటే స్రవంతి చోకారపు చివరి స్థానంలో ఉందని ప్రచారం జరుగుతోంది. అఖిల్ బ్యాచ్‌తో గ్యాప్ రావడం వల్లే ఈమెకు ఓటింగ్ తగ్గిందట. దీంతో ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. అదే జరిగితే అఖిల్ బ్యాచ్ నుంచి మరొకరు వెళ్లిపోయినట్లు అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X