Bigg Boss Elimination: ఓటింగ్‌ తారుమారు.. బిందుకు షాకిచ్చిన హీరో.. ఎలిమినేషన్ ప్రమాదంలో హీరోయిన్

తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ ఉన్నా నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అంతలా ఈ కార్యక్రమాన్ని ఇక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీనికి కారణం చిత్ర విచిత్రమైన టాస్కులు, రకరకాల ఎమోషన్స్‌తో ఈ షో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ఉండడమే. రెస్పాన్స్ అంతకంతకూ పెరుగుతుండడంతో నిర్వహకులు కూడా చాలా స్పీడుగా సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌ను కూడా తీసుకొచ్చారు. ఇక, ఇందులో మూడో వారం ఏకంగా 12 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉన్నారు. అందులో ఎవరికి ఎలా ఓట్లు పడుతున్నాయి? టాప్‌, లాస్ట్‌లో ఉన్నది ఎవరు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి!

17 మందిలో ఆ ఇద్దరు అవుట్

17 మందిలో ఆ ఇద్దరు అవుట్

బిగ్ బాస్ నాన్ స్టాప్‌లోకి అషు రెడ్డి, సరయు రాయ్, బిందు మాధవి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, హమీదా ఖతూన్, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, అఖిల్ సార్థక్‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీళ్లలో ఫస్ట్ వీక్ ముమైత్, రెండో వారం శ్రీ రాపాక ఎలిమినేట్ అయ్యారు.

నామినేషన్స్.. కొత్త స్ట్రాటజీతో

నామినేషన్స్.. కొత్త స్ట్రాటజీతో


బిగ్ బాస్ షోలోనే అత్యంత ముఖ్యమైన టాస్కుగా నామినేషన్స్‌ను చెప్పుకోవచ్చు. వారం ఆరంభంలోనే వచ్చే ఇందులోనే షోలో ఎవరు ఉండాలి? ఎవరిని పంపించేయాలి? అని ప్రేక్షకులు డిసైడ్ చేస్తుంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నాన్ స్టాప్ సీజన్‌లో ఎక్కువ మంది నామినేషన్స్‌లో ఉండేలా నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. తద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచే స్ట్రాటజీ చేస్తున్నారు.

ఈ వారం 12 మందికి డేంజర్

ఈ వారం 12 మందికి డేంజర్


ఈ రియాలిటీ షోలో నామినేషన్స్ టాస్క్ రచ్చగా ఉంటోంది. అందుకు అనుగుణంగానే నాన్ స్టాప్ మూడో వారం నామినేషన్స్ టాస్క్ కూడా కొన్ని గొడవలతో సాగింది. ఇందులో మొత్తం బిందు మాధవి, స్రవంతి చోకారపు, మిశ్రా శర్మ, మహేశ్ విట్టా, యాంకర్ శివ, హమీదా ఖతూన్, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, అఖిల్ సార్థక్‌, అజయ్, ఆర్జే చైతూ, తేజస్వీలు నామినేట్ అయ్యారు.

మారిన ఓటింగ్.. హీరోనే టాప్

మారిన ఓటింగ్.. హీరోనే టాప్

బిగ్ బాస్ షోలో ఓటింగ్ ఒక్క సంఘటనతోనే మారిపోతుందన్న విషయం తెలిసిందే. గత ఎపిసోడ్‌లో అఖిల్‌కు ఫేక్ అనే ట్యాగ్ ఇవ్వడం.. ఆ తర్వాత ఆర్జే చైతూను అతడు కెప్టెన్‌గా గెలిపించడం వంటి వాటితో ఓటింగ్ బాగా పెరిగిపోయిందని తెలుస్తోంది. దీంతో అతడు మొదటి నుంచీ టాప్‌లో ఉన్న బిందు మాధవిని వెనక్కి నెట్టేశాడట. తద్వారా మొదటి స్థానానికి చేరాడని తెలుస్తోంది.

తర్వాతి స్థానాల్లో ఎవరంటే?

తర్వాతి స్థానాల్లో ఎవరంటే?

మూడో వారం ఓటింగ్‌లో కంటెస్టెంట్ల స్థానాల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదట. తాజా సమాచారం ప్రకారం.. సీక్రెట్ టాస్క్ గెలిచిన యాంకర్ శివ మూడో స్థానంలో, ఆరియానా గ్లోరీ నాలుగో స్థానంలో ఉన్నారట. ఇక, ఐదో స్థానంలో హమీదా, ఆరో స్థానంలో అజయ్, ఏడో స్థానంలో ఆర్జే చైతూ, ఎనిమిదో స్థానంలో మిత్రాలు ఉన్నారట. వీళ్లంతా దాదాపుగా సేఫ్ అయినట్లేనని తెలిసింది.

డేంజర్ జోన్‌లో మరో ఇద్దరు

డేంజర్ జోన్‌లో మరో ఇద్దరు


బిగ్ బాస్ నాన్ స్టాప్ మూడో వారినికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మొదలై నాలుగు రోజులు పూర్తి అవుతోంది. ఇక, ఇందులో మాజీ కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ తొమ్మిదో స్థానంలోనే కొనసాగుతున్నాడట. అలాగే, పదో స్థానంలో మాత్రం మహేశ్ విట్టా వచ్చినట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరు కూడా ఈ వారానికి దాదాపుగా డేంజర్ జోన్‌లో ఉన్నారనే అర్థం చేసుకోవాలి.

ఈ ఇద్దరిలో ఒకరు అవుట్

ఈ ఇద్దరిలో ఒకరు అవుట్


ఇప్పటి వరకూ జరిగిన ఓటింగ్ ప్రక్రియ ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. మొన్నటి వరకూ ఎక్కువ ఓట్లు రాబట్టిన హీరోయిన్ తేజస్వీ మదివాడ ఒక్క ఎపిసోడ్‌కే చివరి స్థానానికి పడిందట. ఇక, ఆరంభం నుంచీ చివర్లో ఉన్న స్రవంతి చోకారపు ఒక స్థానం మెరుగుపరుచుకుందని సమాచారం. ఇదే కంటిన్యూ అయితే వీళ్లిద్దరి నుంచి ఒకరు కచ్చితంగా ఎలిమినేట్ అవుతారని టాక్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X