Bigg Boss Non Stop: వాళ్లే బిగ్ బాస్ టార్గెట్.. ఆరుగురిలో ఐదుగురు ఎలిమినేట్
బుల్లితెర చరిత్రలోనే ఎవరూ ఊహించని స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందనను అందుకుని తెలుగులోనే కాకుండా దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. సరికొత్త కాన్సెప్టుతో నడిచే షోనే అయినా.. గతంలో ఎన్నడూ చూడని టాస్కులు, గొడవలు, లవ్ ట్రాకులు, రొమాన్స్ ఇలా ఎన్నో రకాల అంశాలు కనిపించడంతో ఆడియెన్స్ దీనికి ఫిదా అయ్యారు. ఫలితంగా తెలుగులో ఈ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ప్రారంభం అయింది. అంతేకాదు, అప్పుడే ఒక వారం పూర్తవడంతో పాటుగా ఎలిమినేషన్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో నడుస్తోన్న తీరు.. ఎలిమినేషన్ గురించి ఓ సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఆ పూర్తి వివరాలు మీకోసం!
Recommended Video

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఆలస్యంగా
‘బిగ్ బాస్ నాన్ స్టాప్' ఫస్ట్ సీజన్‌ను ఫిబ్రవరి 26న గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు. ఇది మొత్తం 84 రోజుల పాటు ప్రసారం కానుంది. ఈ సీజన్‌లోకి ఏకంగా 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ హౌస్‌లోకి ప్రవేశించారు. ఇక, దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే, మధ్యలో ఒకరోజు మొత్తం ఆపేసి.. 24 గంటలు ఆలస్యంగా దీన్ని ప్రసారం చేస్తున్నారు.

ఈ సారి బరిలో నిలిచింది వీళ్లే
భారీ అంచనాల నడుమ మొదలైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టి యమ జోష్‌తో కనిపిస్తున్నారు.

రెండు టీమ్‌లు... బిగ్ ఫైట్స్‌తో
బిగ్ బాస్ నాన్ స్టాప్‌లోకి కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఎంటరయ్యారు. ఇందులో గత సీజన్లలో పాల్గొన్న వాళ్లను వారియర్స్ అని.. కొత్త వాళ్లను చాలెంజర్స్ అని రెండు గ్రూపులుగా విభజించారు. వీళ్లకు పోటాపోటీగా టాస్కులు కూడా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ రెండు గ్రూపుల మధ్య జరుగుతున్న పోరు ఎంతో ఆసక్తికరంగా మారింది. ఫలితంగా షో రంజుగా సాగుతోంది.

ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో వీళ్లే
మామూలు బిగ్ బాస్ షో మాదిరిగానే నాన్ స్టాప్ సీజన్ కూడా ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా ఇది మొదటి వారంలోనే ఎన్నో గొడవలతో ప్రసారం అయింది. నామినేషన్స్ టాస్కు రోజు శృతి మించిన ఫైటింగ్స్ జరిగాయి. ఇక, ఫస్ట్ వీక్‌లో హమీదా ఖతూన్, ఆరియానా గ్లోరీ, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, ఆర్జే చైతూ, సరయు రాయ్ నామినేట్ అయ్యారు.

షో నుంచి ముమైత్ ఖాన్ ఔట్
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై ఆరంభం నుంచీ ఒకే రకమైన టాక్ వినిపించింది. కానీ, అనూహ్యంగా చివర్లో పరిస్థితి ఒక్కసారిగా మారింది. దీంతో ఓటింగ్ సరళి పూర్తిగా చేంజ్ అయింది. ఫలితంగా అనుకున్న వాళ్లు కాకుండా వారియర్స్ టీమ్‌లో ఉన్న ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది. దీంతో ఈ బోల్డ్ బ్యూటీ ఏడుస్తూ వచ్చేసింది.

వాళ్లే బిగ్ బాస్ టార్గెట్ అంటూ
తెలుగు బిగ్ బాస్ షోలో ఇప్పటి వరకూ లేడీ కంటెస్టెంట్లు ఎవరూ విజేతలుగా నిలవలేదు. అంతేకాదు, నిన్నటి ఎపిసోడ్ వరకూ మొత్తం ఆరు సీజన్లు (రెగ్యూలర్ బిగ్ బాస్‌తో పాటు ఓటీటీ వెర్షన్ కలిపి)లో మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియ చూస్తే.. ఆరుగురిలో ఐదుగురు ఆడవాళ్లే బయటకు వెళ్లిపోయారు. దీంతో బిగ్ బాస్ తీరుపై ప్రేక్షకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎవరెవరు వెళ్లిపోయారంటే
బిగ్ బాస్ మొదటి సీజన్‌లో జ్యోతి, రెండో సీజన్‌లో సంజన, మూడో సీజన్‌లో హేమ, నాలుగో సీజన్‌లో సూర్య కిరణ్, ఐదో సీజన్‌లో సరయు రామ్ మొదటి వారమే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక, ఇప్పుడు ముమైత్ ఖాన్ కూడా ఎలిమినేట్ అయింది. ఇలా లేడీస్‌కు షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. దీంతో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది


Click it and Unblock the Notifications











