Bigg Boss Non Stop: ఆ కంటెస్టెంట్‌కు బిగ్ బాస్ కఠిన శిక్ష.. మొదటి వారమే ఇలాంటి పని చేయడంతో!
ఎన్నో అనుమానాల నడుమ తెలుగు బుల్లితెరపైకి వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మది దోచుకున్న షో బిగ్ బాస్. ఎప్పుడూ చూడని కాన్సెప్టే అయినా మన ఆడియెన్స్ దీనికి భారీ స్థాయిలో స్పందనను అందించారు. ఫలితంగా ఇది అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను కూడా సొంతం చేసుకుంది. తెలుగులోనే కాదు.. దేశంలోనే ఎక్కువ రేటింగ్ అందుకుంటోన్న షోగానూ రికార్డులను సాధించింది. దీంతో నిర్వహకులు ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఓటీటీ వెర్షన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్‌ను మొదలు పెట్టారు. ఇక, తాజాగా ఇందులో ఓ కంటెస్టెంట్‌కు బిగ్ బాస్ కఠిన శిక్షను విధించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది వీళ్లే
ఎన్నో అంచనాలతో మొదలైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

ఒకరోజు లేటుగానే బిగ్ బాస్ లైవ్
'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్ ఫిబ్రవరి 26న వైభవంగా మొదలైంది. ఇది మొత్తం 84 రోజుల పాటు ప్రసారం కాబోతుంది. ఈ సీజన్‌లోకి ఏకంగా 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక, దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే, మధ్యలో ఒకరోజు మొత్తం ఆపేసి.. 24 గంటలు ఆలస్యంగా దీన్ని ప్రసారం చేస్తున్నారు.

రెండు గ్రూపుల మధ్య బిగ్ ఫైట్
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో గత సీజన్లలో పాల్గొన్న వాళ్లను వారియర్స్ అని.. కొత్త వాళ్లను చాలెంజర్స్ అని రెండు గ్రూపులుగా విభజించారు. వీళ్లకు పోటాపోటీగా టాస్కులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ రెండు గ్రూపుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా గేమ్ సాగుతోంది. ఫలితంగా బిగ్ ఫైట్ కనిపిస్తోంది.

వారియర్సే విన్నర్స్... కెప్టెన్‌గా
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి వారానికి సంబంధించి జరిగిన కెప్టెన్సీ కంటెండర్ల కోసం మూడు రౌండ్ల టాస్కులు జరిగాయి. వీటిలో వారియర్స్ జట్టే విజయం సాధించింది. ఇలా దీని నుంచి నటరాజ్ మాస్టర్, ఆరియానా గ్లోరీ, తేజస్వీ, అఖిల్ సార్థక్, సరయు, మహేశ్ విట్టా కెప్టెన్సీ కోసం పోటీదారులుగా ఎంపికయ్యారు. ఇందులో తేజస్వీ గెలిచి ఇంటి మొదటి కెప్టెన్‌గా ఎంపికైంది.

బిగ్ బాస్ హౌస్‌లో మరో రచ్చ
బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య తరచూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఎన్నో అంచనాలతో మొదలైన నాన్ స్టాప్ సీజన్‌లో అయితే మొదటి వారం నుంచే ఫైటింగ్‌లు కనిపిస్తున్నాయి. దీంతో అప్పుడే చాలా మంది శత్రువుల్లా మారిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరోసారి కంటెస్టెంట్ల మధ్య గొడవలు పెట్టే టాస్కును బిగ్ బాస్ నిర్వహించాడు.

బెస్ట్ కంటెస్టెంట్‌గా మహేశ్ విట్టా
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఫస్ట్ వీక్‌కు సంబంధించి జరిగిన అన్ని టాస్కులను పరిగణలోకి తీసుకుని ఉత్తమ, చెత్త కంటెస్టెంట్లను ఎంపిక చేయాల్సిందిగా వారియర్స్ టీమ్‌కు బిగ్ బాస్ సూచించాడు. ఇందులో చాలా చర్చలు జరిపిన తర్వాత బెస్ట్ పెర్ఫార్మర్‌గా మహేశ్ విట్టాను ఆ జట్టు సభ్యులు ఎంపిక చేసుకున్నారు. అతడిని బిగ్ బాస్ అభినందించాడు.

అతడికి కఠిన శిక్ష వేసిన బాస్
ఉత్తమ కంటెస్టెంట్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత.. మొదటి వారానికి సంబంధించి చెత్త ఆటగాడి పేరును చెప్పాల్సిందిగా బిగ్ బాస్ చెప్పాడు. దీని గురించి చాలా రకలా చర్చలు జరిపిన వారియర్స్ టీమ్ సభ్యులు.. నటరాజ్ మాస్టర్‌ను వరస్ట్ పెర్ఫార్మర్‌గా ఎంపిక చేసుకున్నారు. దీంతో అతడిని బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న జైలుకు పంపించినట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











