Bigg Boss Non Stop: ఆమెకు ఐ లవ్యూ చెప్పిన శివ.. రియల్ లైఫ్ లో బిందుమాధవి ఎమోషనల్ బ్రేకప్ స్టోరీ!

బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ఎంతమంది ఎన్ని రకాలుగా పోట్లాడుకున్నా కూడా ప్రతి ఒక్కరి జీవితం వెనుక ఏదో ఒక విషాదకరమైన విషయం ఉంటుంది. ఇక బిగ్ బాస్ అప్పుడప్పుడు ఆ విషయాలను కూడా వారి నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమ కథ ఉంటుంది కాబట్టి తొలి ప్రేమ గురించి చెప్పాలి అనే విధంగా ఒక యాక్టివిటీ ని ఇచ్చారు. అదే తలుపు తట్టిన తొలి ప్రేమ.

ప్రతి ఒక్కరు కూడా వారి జీవితం లోని మొదటి ప్రేమ గురించి చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో కొందరు సరదాగా నవ్వుకుంటూ చెప్పగా.. మరికొందరు మాత్రం ఎమోషనల్ గా కంటతడి పెడుతూ వివరణ ఇచ్చారు. నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్లో తొలిప్రేమ యాక్టివిటీ హైలెట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆ వివరాల్లోకి వెళితే..

నటరాజ్ మాస్టర్..

నటరాజ్ మాస్టర్..

ఈ రోజు బిగ్ బాస్ మీకు ఇస్తున్న యాక్టివిటి తలుపు తట్టిన తొలిప్రేమ అనగానే.. మొదట తన ప్రేమను కథను వివరించేందుకు వచ్చిన నటరాజ్ మాస్టర్ నేను లవ్ అనేదాన్ని అసలు లవ్ లాగా చూసేవాన్ని కాదు అని అన్నారు. నేను సిన్సియర్ గా ఒక్కటే చెప్పాను. నేను లవ్ చేయను. పెళ్లి చేసుకొను అని.. కానీ చూసిన పది నిమిషాల్లోనే అని మాస్టర్ చెప్పబోతుంటే అందరూ పగలబడి నవ్వేశారు.

ఆమెకు శివ ప్రపోజ్

ఇక యాంకర్ శివ సీన్ లోకి వచ్చి రాగానే బిందుమాధవి నుంచి ఒక ప్రశ్న ఎదుర్కొన్నాడు. ఇంతవరకు ఎవరికి ఐ లవ్ యు చెప్పలేదా అని అడగగానే నేను ప్రతి ఒక్కరికి చెప్తాను ఐ లవ్ యూ అని శివ సమాధానమిచ్చాడు. ఎందుకంటే ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు అని సమాధానం ఇచ్చిన శివ ముమైత్ ఖాన్ కు ఐలవ్యూ చెప్పాడు ఇక ముమైత్ ఖాన్ కూడా ఐ లవ్ యూ టూ అంటూ సిగ్గు పడిపోవడంతో.. అయిపోయింది అని పక్కనే ఉన్న అఖిల్ కౌంటర్ వేసాడు.

బిందుమాధవి బ్రేకప్ స్టోరీ

బిందుమాధవి బ్రేకప్ స్టోరీ

ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ లవ్ స్టోరీ బ్రేకప్ తోనే మొదలవుతుంది అంటూ బిందుమాధవి తన ఎమోషనల్ లవ్ ట్రాక్ గురించి చెప్పే ప్రయత్నం చేసింది. ఇక తన మొదటి లవ్ లో అతను నేను ఇండిపెండెంట్ గా ఉండాలి అనే విషయాన్ని నేర్పించినట్లుగా చెప్పింది. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను అంటే అందుకు ఒక అతను ఒక కారణం అంటూ మాధవి R లెటర్ రాసి చూపించింది.

స్రవంతి ఎమోషనల్

స్రవంతి ఎమోషనల్

ఇక నటి శ్రవంతి కూడా తన ఎమోషన్ లవ్ స్టోరీ లో మదర్ ప్రేమను కూడా చెప్పడం జరిగింది. ఒక ఆరు నెలల్లో మా అమ్మ కోసం జాబ్ చేసి సెటిల్ అయిన తర్వాత కలుద్దాం అని అతనికి చెప్పినట్లు స్రవంతి వివరణ ఇచ్చింది. అయితే ఒక రోజు మా అమ్మ చనిపోయింది అని ఫోన్ రాగానే తట్టుకోలేకపోయాను అని తన ఎమోషనల్ కథను వివరించింది. దీంతో కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X