Bigg Boss Non Stop: ఆ అబ్బాయి పైనే అమ్మాయిల ఫోకస్.. బ్యాడ్ వైబ్స్ తో గొడవ స్టార్ట్ చేసిన బిగ్ బాస్
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలయిన విధానం చాలా బోరింగ్ గా అనిపించింది అనే కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. కానీ అసలైన క్లాష్ ఇంకా స్టార్ట్ కాలేదు అనే చెప్పాలి. మొదటి నామినేషన్స్ అప్పుడు అయితే చాలా గొడవలు తోనే మొదలయ్యాయి. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ గతంలో మాదిరిగానే మళ్లీ ఎమోషనల్ అవుతూ అందరినీ పై విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు విభిన్నంగా గుడ్ వైబ్స్ వర్సెస్ నెగిటివ్ వైబ్స్ అనే కొత్త తరహా చాలెంజ్ తో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్యలో ఒక కొత్త ఫీలింగ్స్ ను కలిగించబోతున్నారు. ఇక లేటెస్ట్ గా వైరల్ అవుతున్న ప్రోమో పై ఒక లుక్కేస్తే...
Photos Courtesy: Disney+Hotstar

కనెక్ట్ అయితే..
గడిచిన ఐదో సీజన్స్ కూడా టీవీలో గంటపాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను అందించగా ఇప్పుడు ఓటీటీ హాట్ స్టార్ లో 24 గంటలపాటు బిగ్ బాస్ ద్వారా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందుతోంది. ఎప్పుడు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారో ఊహించడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. ఒక విధంగా 24 గంటల నాన్ స్టాప్ గా చూడడం అయితే ఎవరి వల్ల కాదు కానీ ఒక్కసారి బిగ్ బాస్ కనెక్ట్ అయితే మాత్రం జనాలు గ్యాప్ లేకుండా మినిమం లైవ్ స్ట్రీమింగ్ ఫాలో అవుతారు అని చెప్పవచ్చు.

అజయ్ పైనే గుడ్ వైబ్స్
ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ కూడా ఆసక్తిని కలిగించేలా కొత్త తరహా టాస్క్ లను కూడా ఇస్తూ ఉంటాడు. ఇక ఆ టాస్క్ లలో కొంతమంది స్నేహితులు గా మారవచ్చు మరికొంతమంది శత్రువులు గా కూడా మారవచ్చు. ఇటీవల గుడ్ వైబ్స్ వర్సెస్ నెగిటివ్ వైబ్స్ అనే టాస్క్ కూడా ఆసక్తికరంగా మారింది. ఇక అందరు కూడా ఎక్కువగా అజయ్ అనే అబ్బాయి పైన ఫొటోస్ పెడుతూ ఉండడం విశేషం.

ముమైత్, అరియానా కూడా
ముందుగా అజయ్ ను చూడగానే ఒక పాజిటివ్ వైప్ కలిగింది అని ముమైత్ ఖాన్ పొగుడుతూ చెప్పేసింది. ఇక ఆ తర్వాత కూడా అజయ్ వైబ్ వైపు చాలా బాగుంది అని అరియనా ప్రశంసలు కురిపించింది. అతనిలోని స్పాండినీటి కూడా చాలా బాగుంది అని అరియనా నవ్వుతూ చెప్పేసింది. ఇక ఆ తర్వాత అఖిల్ కూడా అజయ్ తో బాండింగ్ బాగుంది అనిపించింది అంటూ అతనిలో చాలా బాగా కనెక్ట్ అయినట్లుగా చెప్పిన అఖిల్ హౌస్ లో ఇలాంటి వారే కావాలి అని వివరణ ఇచ్చాడు.

గుడ్డలు నచ్చి లైక్ చేశా..
ఇక తేజస్విని మదివాడతో గుడ్డలు నచ్చి ముందుగానే లైక్ చేశాను అన్నట్లు బిందు మాధవి కూడా బాగానే లైక్ చేసింది. ఆమెకు గుడ్ వైబ్ అనే ట్యాగ్ కూడా ఇచ్చింది. ఇక ఆ తరువాత అషు రెడ్డి హామీదా అయితే కౌగిలించుకుని బాగానే ఫీల్ అయ్యారు. ఇక ఆ అమ్మాయి హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి తనకు ఒక గుడ్ ఫ్రెండ్లి వైబ్ వచ్చిందని చెప్పిన హామీదా ఆశురెడ్డికి గుడ్ వైబ్ ట్యాగ్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











