Bigg Boss Non Stop: బయటకు వెళ్లిన తరువాత కూడా బిందుమాధవితో అలాంటివి.. యాంకర్ శివ షాకింగ్!

బిగ్ బాస్ లో రిలేషన్ షిప్స్ అనేవి కూడా చాలా విభిన్నంగా ఉంటాయి హౌస్ లో ఎంత మాట్లాడుకున్నా కూడా బయటకు వెళ్ళిన తర్వాత కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రం చాలా స్నేహంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు ఇక మొదటిసారి బిగ్ బాస్ ఓటింగ్ లో పాల్గొన్న కంటెస్టెంట్ ఎవరు చాలా క్లోజ్గా ఫ్రెండ్స్ అవుతారు అనేది హాట్ టాపిక్ గా మారింది ఇక ప్రస్తుతం మంచి జోడీగా బిందుమాధవి యాంకర్ శివ బిగ్ బాస్ లో కొనసాగుతున్నారు ప్రతి అడుగు కూడా వీరు ఏదో ఒక పంచాయతీ పెట్టుకోకుండా ఉండడం లేదు.

ఇక ఆదివారం రోజు సందడి చేయబోతున్న నాగార్జున హౌస్ మెంట్స్ మధ్యలో మరొక వివాదానికి తెర లేపాడు అని చెప్పలేం హౌస్ మెంట్ లలో ప్రస్తుతం బయటకు వెళ్లిన తర్వాత ఎవరు మంచి ఫ్రెండ్ గా ఉంటారు అలాగే ఎవరిని బ్లాక్ చేస్తారు అనే టాస్కర్ ఇచ్చారు.

బయటకు వెళ్లిన తరువాత

బయటకు వెళ్లిన తరువాత

జ్వాలా రెడ్డి పాటతో స్టైలిష్ గా ముద్దుగుమ్మలతో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున వచ్చి రాగానే హౌస్ మెంట్స్ కు డిఫరెంట్ ఛాలెంజ్ ఇచ్చాడు. హౌస్ లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా బయటకు వెళ్లిన తరువాత కూడా ఎవరిని ఫ్రెండ్ గా చేసుకోవాలని అనుకుంటున్నారో చెప్పాలి అని అలాగే బ్లాక్ లిస్ట్ లో ఎవరిని పెట్టాలో చెప్పాలి అని అన్నారు. ఇక హౌస్ మెంట్స్ ఎవరు ఊహించని విధంగా గేమ్ ఆడారు.

బిందుమాధవితో అలా..

బిందుమాధవితో అలా..

ముందుగా బిందుమాధవిని బయటకు వెళ్లిన తరువాత కూడా ఫ్రెండ్ గా చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పిమా యాంకర్ శివ తను మంచి సజేషన్స్ ఇవ్వడంలో ముందు ఉంటుందని చెప్పాడు. తప్పకుండా హెల్ప్ అయ్యే విధంగా సహాయం చేయగలదు అని కూడా చెప్పాడు. ఇక నాగార్జున అందుకు కౌంటర్ వేస్తూ.. కాంట్రవర్సీ శివకే సజేషన్స్ ఇవ్వడమా అని అన్నాడు. ఇక బ్లాక్ లిస్ట్ లో అయితే శివ నటరాజ్ మాస్టర్ ఫొటోను పెట్టాడు.

అషు రెడ్డిపై అనిల్ కామెంట్

అషు రెడ్డిపై అనిల్ కామెంట్

అనిల్ రాథోడ్ అయితే ఎవరు ఊహించని విధంగా అషు రెడ్డిని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక ఆమె గురించి బయటకు వెళ్లిన తరువాత ఫ్రెండ్ గా మరింత తెలుసుకోవాలని ఉందని చెప్పాడు. ఇక్కడ అంతా బ్లాక్ గా గా ఉందా అని నాగార్జున కౌంటర్ వేయగా కాదు కెమెరాలు ఉన్నాయని అజయ్ మరో కౌంటర్ వేశాడు.

మ్యాచింగ్ డ్రెస్

ఇక మరోవైపు అనిల్ ను హామీదా ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. అతన్ని బయటకు వెళ్లిన తరువాత ఫ్రెండ్ చేసుకుంటాను అంటూ అతను చాలా స్వీట్ అని చెప్పగానే అషు గుర్తుపెట్టుకో అని నాగార్జున మరో సెటైర్ వేశాడు. ఏదో తేడాగా ఉందని మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నట్లు అషు మరో కౌంటట్ ఇచ్చింది.

బ్రదర్ లాంటి వాడు..

బ్రదర్ లాంటి వాడు..

ఇక సరయూ కూడా అనిల్ తన బ్రదర్ లాంటి వాడు అని చెప్పుకొచ్చింది. ఇక నటరాజ్ మాస్టర్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అషు రెడ్డి అంటూ తనలాంటి ఫ్రెండ్ ఉంటే ఎక్కడైనా ది బెస్ట్ ఉండవచ్చు అని చెప్పగా అందుకు అషు.. దయచేసి నన్ను హీరోయిన్ ను చేయకండి సర్ అని వివరణ ఇచ్చింది.

టార్గెట్ నటరాజ్

టార్గెట్ నటరాజ్

ఇక అషు రెడ్డి యాంకర్ శివను బ్లాక్ చేసి అతను సెల్ఫీష్ అని కామెంట్ చేసింది. ఇలాంటి వ్యక్తితో నాకు బయట స్నేహం అవసరం లేదని చెప్పింది. ఇక మొత్తానికి నటరాజ్ మాస్టర్ ను మిగతా వారు టార్గెట్ చేయడం జరిగింది. తను సేఫ్ గా గేమ్ ఆడితే అక్కడే ఉండేవాన్ని అంటూ అలా ఆడలేదు కాబట్టే ఇలా చేస్తున్నట్లు చెప్పాడు. మరి వీరి గొడవ ఎంతవరకు వెళుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X