Bigg Boss Non Stop: వారం కాకముందే ఆగిపోయిన తెలుగు బిగ్ బాస్.. మళ్లీ అప్పుడే మొదలు.. కారణం ఏంటంటే!
గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుని సక్సెస్‌ఫుల్ షోగా పేరు సంపాదించుకుంది బిగ్ బాస్. ఇండియాలో చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. మన దగ్గర మాత్రమే దీనికి అత్యధిక రేటింగ్ దక్కుతోంది. ఫలితంగా తెలుగు షో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను జరుపుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్'ను కూడా తీసుకు వచ్చారు. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిందీ షో. ఇలాంటి పరిస్థితుల్లో ఈ షో లైవ్‌ను నిర్వహకులు నిలిపేశారు. అసలేం జరిగింది? మళ్లీ ఈ షో ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అనే వివరాలు మీకోసం!

ఆ ఓటీటీలో ప్రసారం అవుతోంది
'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్ ఫిబ్రవరి 26న ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ఇది మొత్తం 84 రోజుల పాటు సాగనుంది. ఇక, వైభవంగా సాగిన ప్రారంభ ఎపిసోడ్‌లో 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఈ షోను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలాగే, రోజుకు రెండు ఎపిసోడ్స్ చొప్పున రిలీజ్ చేసేస్తున్నారు.

హౌస్‌లోకి ఎంటరైంది ఎవరంటే
భారీ అంచనాల నడుమ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ మొదలైంది. ప్రీమియర్ ఎపిసోడ్‌లో అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

రెండు గ్రూపుల మధ్య పోటాపోటీ
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి పాత కొత్త కంటెస్టెంట్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో గత సీజన్లలో పాల్గొన్న వాళ్లను వారియర్స్ అని.. కొత్త వాళ్లను చాలెంజర్స్ అని రెండు గ్రూపులుగా విభజించారు. వీళ్లకు పోటాపోటీగా టాస్కులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ రెండు గ్రూపుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా గేమ్ సాగుతోంది. ఫలితంగా ఆసక్తికరంగా మారిపోయింది.

సెన్సార్ లేకుండానే ప్రసారాలు
రెగ్యూలర్ బిగ్ బాస్ షో సెన్సార్‌తో ప్రసారం అయ్యేది. అయితే, ఓటీటీ వెర్షన్ 24 గంటలూ ప్రసారం అవుతోన్న నేపథ్యంలో దీనికి ఎలాంటి కట్స్, బీప్స్ ఉండడం లేదు. దీంతో ఈ షో ఆరంభం నుంచే రచ్చ రచ్చగా సాగుతోంది. మరీ ముఖ్యంగా గతంలో ఎన్నడూ చూడని విధంగా బోల్డు టాస్కులు కూడా ఉంటున్నాయి. ఫలితంగా ఆరంభంలోనే ఓటీటీ సీజన్ బాగా హైలైట్ అయింది.

ఆగిపోయిన తెలుగు బిగ్ బాస్ షో
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ప్రారంభమై వారం కూడా కాలేదు. కానీ, దీనికి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఎంతో మంది కొత్త యూజర్లు కూడా హాట్‌స్టార్ మెంబర్‌షిప్‌ను తీసుకుంటున్నారు. ఫలితంగా రోజు రోజుకూ మరింత ఆదరణను అందుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీజన్ లైవ్ స్ట్రీమింగ్‌ను హాట్‌స్టార్ సంస్థ ఆపేసి అందరికీ కోలుకోలేని షాకిచ్చింది.

మళ్లీ అప్పుడే మొదలు కానుంది
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ లైవ్ స్ట్రీమింగ్‌ను బుధవారం అర్ధరాత్రి నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ నిలిపేసింది. దీంతో అసలేం జరుగుతుందో ప్రేక్షకులకు అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో లైవ్ స్ట్రీమింగ్ లింక్‌లో షోను తామే ఆపేశామని.. మళ్లీ గురువారం అర్ధరాత్రి (12 గంటలకు) నుంచి పున: ప్రారంభిస్తామని స్క్రోలింగ్ చేస్తూ క్లారిటీ ఇచ్చేస్తున్నారు.

షో ఆగిపోవడానికి కారణం ఇదే
బిగ్ బాస్ నిర్వహకులు చెబుతున్న దాని ప్రకారం.. బిగ్ బాస్ నాన్ స్టాప్ లైవ్ స్ట్రీమింగ్‌ను ఆపడానికి కారణం వినోదాన్ని మరింతగా పెంచి చూపించే ప్రయత్నమేనట. అయితే, బయట వినిపిస్తోన్న టాక్ ప్రకారం.. దీన్ని లైవ్‌లా కాకుండా ఒక గంట ఆలస్యంగా ప్రసారం చేయబోతున్నారని తెలుస్తోంది. వీటితో పాటు రోజూ నైట్ ఓ ఎపిసోడ్ వీడియోను వదలబోతున్నారని తెలిసింది.


Click it and Unblock the Notifications











