Bigg Boss Non Stop : అఖిల్-అషుల ప్రేమ కథకి ఫుల్ స్టాప్ .. మొదలయ్యే లోపే ఇలా అయ్యిందేంటి?
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఆసక్తికరంగా సాగుతుంది. తెలుగులో మొట్టమొదటి సారిగా ఓటీటీ కాన్సెప్ట్ ప్రవేశ పెట్టడంతో ఈ కాన్సెప్ట్ మీద ముందు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించ లేదు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ షో మీద ఆసక్తి పెంచుకుంటున్నారు. అయితే ఈ షోలో అనేక ఆసక్తికర పరిణామాలు ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి. తాజాగా ఈ షో లో ఒక ప్రేమకథ మొదలవుతుందనుకునే సమయంలో ముగిసినట్లే కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే

అందరి ముందు
ఉగాది సందర్భంగా యాంకర్ సుమ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్ లో ఉన్న సభ్యులందరినీ అలరించింది. ముందుగా ఒక్కో కంటెస్టెంట్ ని ఒక్కో పిండి పదార్థంతో పోలుస్తూ ఎందుకు అలా పోల్చాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా చాలా ఆసక్తికరంగా చెప్పింది. ఆ తర్వాత ఒక్కో కంటెస్టెంట్ ను లేపి వారి జాతకం ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని సరదాగా చెబుతూ కామెంట్ చేసింది. ఈ క్రమంలో అషు రెడ్డి, అఖిల్ మీద తనకు ఆసక్తి ఉందనే విషయాన్ని అందరి ముందు ఒప్పుకోవడం గమనార్హం.

ఎవరినీ పిలవలేను అని
ఎక్కువగా ఏ అనే పేరు ఉన్న మగవాళ్ళతో స్నేహం చేస్తున్నావు ఏమిటి అంటే అది అలా కుదిరింది అని అషు చెప్పింది. అయితే ఎవరెవరితో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పమనగా అజయ్ అన్నయ్య అని అనిల్ రాథోడ్ క్రష్ అని అఖిల్ లవ్ అని చెప్పుకొచ్చింది. అయితే అఖిల్ ను కూడా సరదాగా లేపి ఎవరో ఒకరిని చెల్లెలు అని పిలువ వలసిందిగా కోరగా ఎవరినీ పిలవలేను అని తేల్చి చెబుతాడు.

ఆట ఆడడం కోసమే
అయితే ఇదే వారి మధ్య దూరం పెంచినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే సుమా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆమె వెళ్ళిపోయిన తరువాత అఖిల్ అరియానాతో ఈ విషయం గురించి డిస్కస్ చేస్తూ కనిపించాడు. తాను మొదటిసారి బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పుడు చాలా అద్భుతమైన స్నేహితులను సంపాదించానని ఈసారి స్నేహితుల కోసం కాదు ఆట ఆడడం కోసమే లోపలికి వచ్చాను అని చెప్పుకొచ్చారు. అంతేగాక తనకు ఎవరిమీద ఫీలింగ్స్ కలగడం లేదని అందుకే వాటి జోలికి వెళ్లకుండా ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.

ఆసక్తికర వ్యాఖ్యలు
మరోపక్క అషు కూడా నటరాజ్ మాస్టర్ తో కూర్చుని కబుర్లు చెబుతూ నాకెందుకో అతను అందరితోనూ ఒకలాగే ఉంటున్నాడు నేనే ఎక్కువగా కనెక్ట్ అయిపోతున్నాను ఏమో అనిపిస్తోంది. అలా కనెక్ట్ అవ్వడం వల్ల ఎమోషనల్ అవ్వాల్సి వస్తుంది ఇక మీదట అలా ఉండకుండా ఉండడానికి చూస్తాను. నాకెందుకో ఇది కరెక్ట్ కనిపించడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Recommended Video


ఎమోషనల్ అవుతున్నట్లు
దానికి నటరాజ్ మాస్టర్ కూడా నువ్వు అన్నమాట కరెక్టే ఆయన అందరితోనూ ఒకలాగే ఉంటున్నాడు కానీ నువ్వే కాస్త ఎమోషనల్ అవుతున్నట్లు కనిపిస్తోంది అని చెప్పుకొచ్చాడు. దీంతో నిన్నమొన్నటిదాకా గిల్లికజ్జాలు ఆడుకుంటూ బావ మరదళ్లలా కలిసి కనిపించిన అఖిల్, అషు రెడ్డి మధ్య దూరం పెరిగే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. చూడాలి మరి రాబోతున్న రోజులలో ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకోబోతున్నాయి అనేది.


Click it and Unblock the Notifications











