Bigg Boss Non stop: మొదటి వారం ఓటింగ్ ట్రెండ్స్.. ఈ వారం ఇంటి నుంచీ వెళ్లిపోయేది ఎవరంటే?

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్‏బాస్ ఇప్పుడు ఓటీటీలో బిగ్‏బాస్ నాన్ స్టాప్ అంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయింది. గత నెల 26న ప్రారంభమైన ఈ షోలో గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్స్ వారియర్స్‏గా.. కొత్తవారు చాలెంజర్స్‏గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక లోపలి వెళ్లిన రెండో రోజే నామినేషన్స్ కు తెరలేపడంతో రచ్చ రచ్చ అయింది. మరి మొదటి వారం ఆ వోటింగ్ సరళి ఎలా ఉంది? ఎవరు డేంజర్ జోన్లో ? ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు? అనే వివరాల్లోకి వెళితే

యాంకర్ శివతో

యాంకర్ శివతో


ముందుగా యాంకర్ శివతో ముందు నామినేషన్ ప్రక్రియ షురూ అయ్యింది. మొదట శివ... సరయుని నామినేట్ చేశాడు. ఆ తర్వాత.. ముమైత్ ఖాన్ ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత మిత్రా శర్మ అరియానాను, నటరాజ్ మాస్టర్‏ను నామినేట్ చేసింది. ఆర్జే చైతూ.. హామిదాను, నటరాజ్ మాస్టర్ ను నామినేట్ చేశాడు.

వరుస నామినేషన్లు

వరుస నామినేషన్లు

అజయ్ నటరాజ్ మాస్టర్ ను, ఆ తర్వాత సరయుని నామినేట్ చేశాడు. శ్రీరాపాక అరియానాని, ముమైత్ ను నామినేట్ చేసింది. తర్వాత అనిల్ రాథోడ్.. నటరాజ్ మాస్టర్ ను, సరయుని నామినేట్ చేశాడు. ఆ తర్వాత బిందు మాధవి.. అఖిల్ ను.. నటరాజ్ మాస్టర్ ను నామినేట్ చేసింది. యాంకర్ స్రవంతి.. నటరాజ్ మాస్టర్ ను, సరయుని నామినేట్ చేసింది.

డేంజర్ జోన్ లో?

డేంజర్ జోన్ లో?

అలా మొత్తంగా తొలివారానికి నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్, హమీదా, అరియానా, మిత్రా శర్మ, ఆర్జే చైతులు నామినేట్ అయ్యారు. అయితే ఈ బిగ్ బాస్ నాన్-స్టాప్ లో ఏ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నారో? ఏ కంటెస్టెంట్స్ సేఫ్ జోన్‌లో ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసు కోవాల్సిందే.

సరయు ఫాలోయింగ్ ఎక్కువే

సరయు ఫాలోయింగ్ ఎక్కువే

సోషల్ మీడియా బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ ఓటింగ్ ఫలితాల ప్రకారం, హమీద, అరియానా, ముమైత్ ఖాన్ అలాగే నటరాజ్ మాస్టర్ సేఫ్ జోన్‌లో ఉన్నారు. సరయు, ఆర్జే చైతు, మిత్రా డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీరిలోనే ఎలిమినేషన్ అనేది జరిగే అవకాశం ఉంది. అయితే, ఇక్కడ ఆర్జే చైతూ , మిత్రశర్మల ఫాలోయింగ్ తో పోలిస్తే సరయుకి ఉన్న ఫాలోయింగ్ ఎక్కువే.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu
ఆమె డేంజర్ లో

ఆమె డేంజర్ లో

లాస్ట్ టైమ్ ఫస్ట్ వీక్ ఇంటి నుంచి బయటకు వచ్చిన సరయు ఈసారి కూడా గేమ్ ఏమీ మార్చుకోలేదు కానీ సేఫ్ అవుతుందనే అంచనా. అలా అనుకుంటే ఇక ఆర్జే చైతూ , మిత్రా శర్మల మద్యలోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవవచ్చు అని అంటున్నారు. ఇక వీరిద్దరిలో కొద్దిగా ఓట్లు తేడాతోనే ఎలిమినేషన్ అనేది జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే జరిగిన అన్ని ఎపిసోడ్స్ లో ఆర్జే చైతూకి మంచి స్క్రీన్ స్పేస్ లభించడంతో మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ క్రమంలో ఇప్పటివరకూ జరిగిన అన్ అఫీషియల్ పోలింగ్ సరళి చూస్తే మిత్రా శర్మకి పెద్దగా ఓటింగ్ జరిగినట్లుగా కనిపించడం లేదు. కాబట్టి మిత్రశర్మ ఈసారి ఎలిమినేట్ అయిపోతుందనే అంచనాలున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X