Bigg Boss Non stop : ఎలిమినేటయిన మొమైత్ ఖాన్.. నాగ్ ను పట్టుకు ఏడ్చేస్తూ వాళ్ళ మీద బాంబ్?

సందడిగా ప్రారంభమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ ఇప్పటికే వారం రోజులు పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 26వ తేదీన శనివారం నాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ కోసం 17 మంది కంటెస్టెంట్ల లోపలికి ఎంట్రీ ఇచ్చారు. అందులో ఆరుగురు నామినేషన్ల లో ఉండగా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం మీద ముందు నుంచి సస్పెన్స్ కొనసాగింది. అయితే చివరికి లీకు వీరుల మాటలే నిజమయ్యాయి. ముమైత్ ఖాన్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయిన వెంటనే ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే

తప్పులు ఎత్తి చూపడమే కాక

తప్పులు ఎత్తి చూపడమే కాక

బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ తో ఒక్కోకరితో పేరు పేరునా మాట్లాడారు. ఒక్కొక్కరి గురించి చాలా డీటైల్డ్ గా నాగార్జున మాట్లాడుతూ అందరి తప్పులు ఎత్తి చూపడమే కాక వారిలో ఎవరెవరు బాగా ఆడారు అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు.

సేఫ్ కాకపోవడంతో

సేఫ్ కాకపోవడంతో

యాంకర్ శివ పులిహోర రాజా అంటూ పంచ్ లు వేసిన నాగ్ బిందు మాధవి చాలా బాగా గేమ్ ఆడిందని పొగిడారు. ఇలా ఒకరని కాదు కానీ అందరి తప్పులు ఎత్తి చూపిన్ ఆయన ఆ అందరి కంటెస్టెంట్స్ గేమ్ తీరుని కూడా కొనియాడారు. అలా గేమ్స్ ఆడిస్తూ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించగా నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో అరియానా, నటరాజ్ మాస్టర్, హమీద సేఫ్ అయ్యారు. అయితే అప్పుడు తాను సేఫ్ కాకపోవడంతో సరయు చాలా ఎమోషనల్ అయింది.

టెన్షన్ పడి

టెన్షన్ పడి

తను ఇంకా సేఫ్ అవ్వక పోవడంతో మళ్ళీ ఎక్కడ వెనక్కి వెళ్ళాల్సి వస్తుందో అనే భయంతో ఆమె టెన్షన్ పడింది. దానికి తగ్గట్లే మరో టాస్క్ లో కూడా మిత్ర, చైతు సేవ్ అయినట్లు అనౌన్స్ చేశారు. ఫైనల్ గా సరయు, ముమైత్ ఖాన్ నామినేషన్ లో మిగిలి ఉన్నారు. ఆ తర్వాత ఛాలెంజర్స్, వారియర్స్ మధ్య డాన్స్ కాంపిటీషన్ పెట్టారు. ఈ కాంపిటీషన్ లో ఛాలెంజర్స్ మీద వారియర్స్ గెలిచారు.

 ఒంటరిగా వదిలేయాలని

ఒంటరిగా వదిలేయాలని


ఇక అనంతరం నామినేషన్ లో ఉన్న సరయు, ముమైత్ లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పి చివరికి ముమైత్ ఎలిమినేట్ అయినట్లు చెప్పారు. సరయు అయితే తాను సేఫ్ అయ్యానని భావిస్తూ ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది. ముమైత్ తన ఎలిమినేషన్ ని ఊహించలేదు. దీంతో తనను ఒంటరిగా వదిలేయాలని కోరింది. పెద్దగా ఎవరినీ కలవకుండానే ఆమె బయటకు వచ్చేసింది.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu
ఏడ్చేసి

ఏడ్చేసి


అయితే స్టేజ్ పైకి వచ్చిన ముమైత్ నాగార్జునని చూశాక అసలు ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేసింది. తనను అగ్రెసివ్ అంటూ జనానికి చూపించే ప్రయత్నం చేశారని, అసలు అలా తనను చూసి ఎందుకు భయపడుతున్నారో అర్థం కాలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ ఒక్కొక్కరి గురించి తన ఒపీనియన్ చెప్పింది. అఖిల్‌, అజయ్‌, తేజస్విని, అరియానా, అషురెడ్డిలకు వర్తీ ట్యాగ్‌, సరయు, మిత్ర, శివ, బిందు, ఆర్జే చైతులకు వేస్ట్‌ ట్యాగ్‌ ఇస్తానని ముమైత్‌ ఖాన్‌ చెప్పింది. యాంకర్ శివ, బిందు, చైతుల కారణంగా చాలా ఇబ్బంది పడ్డాను అని ఆమె పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X