Bigg Boss Non Stop : చివరి నిముషంలో లెక్కలు మారిన ఓటింగ్.. ఎవరూ ఊహించని విధంగా ముమైత్ ఖాన్ ఎలిమినేట్?

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే వారం రోజులు పూర్తి కావడంతో మొదటి వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. అయితే ముందు నుంచి కూడా మిత్రశర్మ లేదా చైతులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఎవరూ ఊహించని వ్యక్తి పేరు తెరమీదకు రావడం ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయం సోషల్ మీడియాలో లీక్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే

17 మంది కంటెస్టెంట్స్

17 మంది కంటెస్టెంట్స్

బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ప్రారంభమైన బిగ్ బాస్ ఒటీటీ వర్షన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. ప్రతిరోజు 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తూనే 9 గంటలకు ఒక స్పెషల్ ఎపిసోడ్ కూడా అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. హౌస్ లోకి మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా వీరిలో గతంలో బిగ్ బాస్ లో పాల్గొన్న వారిని వారియర్స్ అనే పేరుతో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వారిని ఛాలెంజర్స్ పేరుతో పిలుస్తున్నారు.

హౌస్ ని వీడేది ఎవరు?

హౌస్ ని వీడేది ఎవరు?

మొదటి వారం కూడా నామినేషన్లు వాడీవేడీగా జరిగాయి. ఈ మొదటి వారం నామినేషన్స్ లో మొదటి వారం నామినేషన్స్‌లో నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, ఆర్జే చైతు సహా అరియానా గ్లోరి ఉన్నారు. వీరిలో ఫస్ట్ ఎలిమినేషన్ ద్వారా హౌస్ ని వీడేది ఎవరు అని ముందు నుంచి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చైతూ సరయూ, మిత్రా శర్మ డేంజర్ జోన్లో ఉన్నారని అన్నారు.

లీకులు బయటకు

లీకులు బయటకు

మిగతా ఇద్దరూ ఫర్వా లేదు మిత్ర హౌస్ లో కూడా పెద్దగా కనపడక పోవడంతో మొదటి వారం ఆమె ఎలిమినేట్ కావడం ఖాయం అని అనుకున్నారు. కానీ లాస్ట్‌ మినిట్‌లో ఓటింగ్‌ తారుమారు అవ్వడంతో ఆమె సేఫ్‌ అయ్యి ముమైత్‌ ఎలిమినేట్‌ అయినట్లు ముందు నుంచి జరుగుతున్నట్టే లీకులు బయటకు వచ్చాయి.

డ్రగ్స్ కేసు

డ్రగ్స్ కేసు

అంటే సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ముమైత్‌ ఖాన్‌ ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తుంది. నిజానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా 2017లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 1 లో కూడా ముమైత్ ఖాన్ పాల్గొన్నారు. అప్పట్లోనే డ్రగ్స్ కేసు చుట్టు ముట్టగా దాని విచారణకు కూడా ఆమె వెళ్లి వచ్చారు.

ముమైత్ కి మైనస్

ముమైత్ కి మైనస్

ఆ మొదటి సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలబడిన ముమైత్ ఖాన్ 7 వారాల పాటు హౌస్ లో ఉండి. ఇక అలా మొదటి సీజన్లో ముమైత్ 49వ రోజు ఎలిమినేటై 8వ స్థానంలో నిలబడింది. పూర్తి స్థాయి తెలుగు రాకపోవడం ముమైత్ కి మైనస్ అనే చెప్పాలి. అప్పుడు ఇప్పుడు కూడా అదే ఆమెకు ప్రధాన సమస్య. ఆమె కొన్ని విషయాలు మాట్లాడుతుంటే అవి బూతులుగా అనిపిస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయనేది ఆదివారం ఎపిసోడ్ వరకు ఆగకతప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X