Bigg Boss Non Stop: ముమైత్ ఖాన్, శ్రీరాపాక రెమ్యునరేషన్స్.. ఎంత ఇచ్చారంటే?

బిగ్ బాస్ మొత్తానికి రోజు రోజుకు చాలా ఆసక్తికరంగా మారుతోంది. కంటెస్టెంట్ ఎవరు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వారి బలాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలిమినేషన్ లో ఉన్న వారు కూడా గట్టిగానే పోరాడుతున్నారు. కానీ చివరికి వచ్చేసరికి ఊహించిన వారే వెళ్ళిపోతున్నారు.. అయితే హౌస్ లోకి మొదట వచ్చినప్పుడు ముమైత్ ఖాన్, శ్రీ రాపాక ఇద్దరు కూడా హాట్ బ్యూటీస్ గా హౌస్ లోనే కొన్ని వారాల పాటు ఉంటారు అని అందరూ అనుకున్నారు. కానీ వారిద్దరూ మొదటి రెండు వారాల్లో ఎలిమినేట్ అవ్వడం విశేషం. ఇక వీరికి బిగ్ బాస్ ఏ స్థాయిలో పారితోషికం ఇచ్చాడు అనే వివరాల్లోకి వెళితే..

ఖర్చు విషయంలో వెనక్కి తగ్గకుండా..

ఖర్చు విషయంలో వెనక్కి తగ్గకుండా..

రెగ్యులర్ బిగ్ బాస్ షో ఏ స్థాయిలో హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సారి ఓటీటీలో కూడా అదే తరహాలో కూడా నిర్వాహకులు చాలా గ్రాండ్ గా మొదలుపెట్టారు. ఖర్చు విషయంలో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు అని తెలుస్తోంది. షో ఆసక్తికరంగా మారాలి అని కొంతమంది మాజీ కంటెస్టెంట్ లను కూడా తీసుకు రావడం విశేషం. ఇక వారికి గతంలో కంటే ఎక్కువ పారితోషికం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరింత ఆసక్తికరంగా..

మరింత ఆసక్తికరంగా..

ఈసారి మాజీ కంటెస్టెంట్స్ ను వారియర్స్ గా ఒక గ్రూపు కింద సెట్ చేసిన బిగ్ బాస్ కొత్తవారిని ఛాలెంజర్లుగా మరొక గ్రూప్ లో చేర్చారు. ఇక ఈ రెండు గ్రూపుల మధ్య ఆసక్తికరమైన టాస్క్ లను సెట్ చేస్తున్న బిగ్ బాస్ రోజురోజుకు వీక్షకుల సంఖ్యను కూడా పెంచుకుంటున్నారు. గత రెండు వారాల కంటే కూడా మూడవ వారం షో మరింత ఆసక్తికరంగా మారింది అనే చెప్పాలి.

 అలాంటిదేమీ లేదని..

అలాంటిదేమీ లేదని..

ఇక ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న వారికి పారితోషికం ఎంత ఇస్తున్నారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. మొదట టెలివిజన్ షోను స్టార్ట్ చేసినప్పుడు కంటెస్టెంట్స్ కు వారు అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చినట్లుగా చాలామంది సెలబ్రిటీలు చెప్పుకొచ్చారు. ఇక ఓటీటీ అంటే కాస్త తక్కువ బిజినెస్ ఉంటుంది కాబట్టి తక్కువ పారితోషికం ఇచ్చి ఉండవచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని నిర్వాహకులు కంటెస్టెంట్స్ అందరికీ అడిగినంత ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ముమైత్ ఖాన్ కు.. ఇచ్చింది ఎంత?

ముమైత్ ఖాన్ కు.. ఇచ్చింది ఎంత?

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐటెం సాంగ్స్ తో సరి కొత్త ట్రెండ్ ను సెట్ చేసిన ముమైత్ ఖాన్ బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గొని మళ్లీ ఇప్పుడు ఓటీటీలో స్పెషల్ గా ఎంట్రీ ఇచ్చింది. తప్పకుండా ఈమె చివరి వరకు ఉంటుంది అని అనుకున్నాడు. కానీ ఆమె తొందరపాటు నిర్ణయాలతో తన గోతిని తానే తవ్వుకుంది. ఇక వారం రోజులు హౌస్ లో ఉన్నందుకు ముమైత్ ఖాన్ కు లక్ష రూపాయల వరకు దక్కినట్లు సమాచారం.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu
శ్రీరాపాక ఎంత తీసుకుందంటే?

శ్రీరాపాక ఎంత తీసుకుందంటే?

మరొక గ్లామరస్ బ్యూటీ శ్రీ రాపాక కూడా కనీసం మరో 20 రోజుల పాటు హౌస్ లో ఉంటుంది అని అనిపించింది. కానీ ఆమెను మాటల్లో చూపించిన తెగువ చేతల్లో చూపించలేకపోయింది అనే విమర్శ వచ్చింది. టాస్క్ ల విషయంలో కూడా కాస్త కన్ఫ్యూజన్ గా ఉండటంతో ఆమెకు ఆట ఈద ఇంకా క్లారిటీ లేదు అని ఈజీగా తేలిపోయింది. ఇక శ్రీ రాపాక రెండు వారాలపాటు హౌస్ లో కొనసాగినందుకు ఒక లక్షకుపైగా ఇచ్చినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X