Bigg Boss Non Stop: వీడియో చూపించి పరువు తీసిన నాగ్.. అందరి ఎఫైర్స్‌ను బయటపెడుతూ!

తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ, అందులో చాలా తక్కువ ప్రోగ్రాంలు మాత్రమే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ ఒకటి. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టే అయినా తెలుగు ఆడియెన్స్ దీన్ని బాగా ఆదరించారు. ఫలితంగా ఈ షో సూపర్ సక్సెస్ అయింది. అంతేకాదు, ఇప్పటికే ఐదు సీజన్లు కూడా ఒకదానికి మించి ఒకటి విజయవంతం అయ్యాయి.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్‌ను మొదలెట్టారు. ఇది కూడా ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆదివారం ప్రోమో విడుదలైంది. అందులోని హైలైట్లను చూద్దాం పదండి!

లైవ్ స్ట్రీమింగే.. ఒకరోజు లేట్‌గా

లైవ్ స్ట్రీమింగే.. ఒకరోజు లేట్‌గా

'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్ ఫిబ్రవరి 26న గ్రాండ్‌గా స్టార్ అయింది. ఇది మొత్తం 84 రోజుల పాటు ప్రసారం కానుంది. ఈ సీజన్‌లోకి ఏకంగా 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ హౌస్‌లోకి ప్రవేశించారు. ఇక, దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే, మధ్యలో ఒకరోజు మొత్తం ఆపేసి.. 24 గంటలు ఆలస్యంగా దీన్ని స్ట్రీమింగ్ చేస్తున్నారు.

వారియర్స్.. చాలెంజర్స్ పోటీ

వారియర్స్.. చాలెంజర్స్ పోటీ

ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌లోకి కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఎంటరయ్యారు. ఇందులో గత సీజన్లలో పాల్గొన్న వాళ్లను వారియర్స్ అని.. కొత్త వాళ్లను చాలెంజర్స్ అని రెండు గ్రూపులుగా నిర్ణయించారు. వీళ్లకు పోటాపోటీగా టాస్కులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ రెండు గ్రూపుల మధ్య టాస్కులను ఏర్పాటు చేసి దీన్ని ఎంతో ఆసక్తికరంగా మార్చేస్తున్నారు.

గుడ్ న్యూస్ చెప్పిన నాగార్జున

గుడ్ న్యూస్ చెప్పిన నాగార్జున

రెగ్యూలర్ బిగ్ బాస్ షోలో వారానికి రెండు రోజుల పాటు సందడి చేసే అక్కినేని నాగార్జున.. నాన్ స్టాప్ సీజన్‌లో మాత్రం ఆదివారం మాత్రమే కనిపిస్తాడని ముందే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం రాత్రి విడుదల కాబోతున్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా వచ్చింది. ఇందులో నాగ్ హోస్టింగ్‌తో అదరగొట్టాడు. అంతేకాదు, ప్రీమియర్ ఎపిసోడ్‌ రికార్డు క్రియేట్ చేసిందని వెల్లడించాడు.

కంటెస్టెంట్ల ఎఫైర్లు ప్రస్తావిస్తూ

కంటెస్టెంట్ల ఎఫైర్లు ప్రస్తావిస్తూ

తాజాగా విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్లలో ఆటలు ఆడించి, డ్యాన్సులు చేయించిన అక్కినేని నాగార్జున.. ఆ తర్వాత వాళ్లకు చుక్కలు చూపించారు. మరీ ముఖ్యంగా ప్రారంభ ఎపిసోడ్లలో కంటెస్టెంట్లు తమ ఎఫైర్ల గురించి చెప్పిన విషయాలను ఇక్కడ ప్రస్తావించాడు. ఇందులో భాగంగానే కొందరు ఇంటి సభ్యులను పరోక్షంగా కామెంట్ చేస్తూ తెగ నవ్వులు పూయించాడు.

 అఖిల్, హమీదా లవ్ ట్రాక్‌లపై

అఖిల్, హమీదా లవ్ ట్రాక్‌లపై

నాగార్జున ఒక సందర్భంలో జై శ్రీకృష్ణా అన్నాడు. అప్పట్లో ఈ మాటను మోనాల్ గజ్జర్ అనేది. దీంతో అఖిల్ వెంటనే లేచి నిల్చున్నాడు. దీంతో అందరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత హమీదాను 'లావు అవుతున్నావు వాకింగ్ తగ్గిందా' అని శ్రీరామచంద్రను గుర్తు చేస్తూ పరోక్షంగా అడిగాడు. దీనికామె 'వాకింగ్ చేయడానికి తోడు ఎవరూ లేరు కదా సార్' అంటూ డైరెక్టుగానే బదులిచ్చింది.

ముమైత్‌ను అలా.. బిందూనిలా

ఇక, ముమైత్ ఖాన్‌తో 'ఏ ముమైత్ ఇంట్లో అందరితో కనెక్ట్ అవుతున్నావా? లేక ఒక్కరితోనేనా' అంటూ అజయ్ గురించి మాట్లాడాడు. ఆ తర్వాత బిందు మాధవితో 'ఎంత మందిని లాగి పీకావు' అంటూ ఆమె లవ్ ట్రాకుల గురించి మాట్లాడాడు. ఆ తర్వాత మహేశ్ విట్టా, యాంకర్ శివ, ఆర్జే చైతూలకు తనదైన శైలిలో పంచ్‌లు వేశాడు. దీంతో ఈ ప్రోమో మొత్తం సందడిగా సాగింది.

ఆ వీడియోతో పరువు తీశాడుగా

ఆ వీడియోతో పరువు తీశాడుగా

ఈ ప్రోమోలో ముందుగా కెప్టెన్ తేజస్వీని అభినందించిన నాగార్జున.. 'నువ్వు కరెక్టుగానే డీల్ చేస్తున్నావా' అని ప్రశ్నించాడు. ఆ తర్వాత ఓ వీడియో చూపిస్తా అంటూ అషు రెడ్డి, ఆరియానా దొంగతనంగా తింటున్న విజువల్స్‌ను చూపించాడు. దీంతో హౌస్‌మేట్స్ అందరూ షాక్ అయ్యారు. ఇదిలా ఉండగా.. ఈరోజు ఎపిసోడ్‌లో ముమైత్ ఎలిమినేట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X