Bigg Boss Non Stop: ఆ రూమ్‌లోకి వెళ్లిన జంట.. ఆ పనులు చేయొద్దంటూ నాగార్జున వార్నింగ్!

తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతూ.. చెరిగిపోని ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది బిగ్ బాస్. కొత్త కాన్సెప్టుతో వచ్చే ఈ కార్యక్రమం మన ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ఫలితంగా భారీ స్థాయిలో స్పందనను అందుకుంది. దీంతో దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు వరుసగా సీజన్లను ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవలే 'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్‌ను ప్రారంభించారు. ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు మజాను పంచుతోంది. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జున ఇద్దరు కంటెస్టెంట్లపై డబుల్ మీనింగ్ డైలాగులు వదిలాడు. దీంతో అందరూ షాక్ అయిపోయారు. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

రంజుగా సాగుతోన్న నాన్ స్టాప్ సీజన్

రంజుగా సాగుతోన్న నాన్ స్టాప్ సీజన్

'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్ ఇటీవలే మొదలైంది. ఇది మొత్తం 84 రోజుల పాటు ప్రసారం కానుంది. ఈ సీజన్‌లోకి ఏకంగా 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ హౌస్‌లోకి ప్రవేశించారు. ఇక, దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇది ఆరంభం నుంచే రంజుగా సాగుతోంది. తద్వారా ప్రేక్షకులకు వంద శాతం ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూనే ఉంది.

17మంది ఎంట్రీ.. ఇద్దరు ఎలిమినేట్

17మంది ఎంట్రీ.. ఇద్దరు ఎలిమినేట్

బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఫస్ట్ వీక్ ముమైత్, రెండో వారం శ్రీ రాపాక ఎలిమినేట్ అయ్యారు.

షాకిచ్చి... సరదాగా కనిపించిన నాగ్

షాకిచ్చి... సరదాగా కనిపించిన నాగ్

బిగ్ బాస్ షోలో ప్రతి ఆదివారం ఎలిమినేషన్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందే కంటెస్టెంట్లు అందరితో హోస్ట్ నాగార్జున పలు రకాల ఆటలు ఆడిస్తుంటాడు. దీంతో సండే ఎపిసోడ్‌ ఫన్‌‌డేగా మారిపోతుంది. ఇక, తాజా ఎపిసోడ్‌లో నాగార్జున తప్పులు చేసిన కంటెస్టెంట్లపై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత ఆటపాటలతో అందరితో సరదాగా గడిపాడు.

కాజల్‌ పర్సనల్ ఫొటో షేర్ చేసిన భర్త: ప్రెగ్నెంట్ అయ్యాక ఇలా కనిపించడం ఇదే తొలిసారి
https://telugu.filmibeat.com/heroine/gautam-kitchlu-share-kajal-aggarwal-baby-bump-photo-107908.html

గొడవలను సెట్ చేసేసిన నాగార్జున

గొడవలను సెట్ చేసేసిన నాగార్జున

ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జున అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. తగ్గేదేలే టాస్కు సమయంలో తప్పులు చేసిన కంటెస్టెంట్లను గుర్తించి.. వాళ్లను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. కొందరికి కఠినంగా చెప్పడంతో పాటు మరికొందరికి మాత్రం సున్నితంగా హెచ్చరించాడు. దీంతో చాలా మంది మధ్య జరిగిన గొడవలు సెట్ అయినట్లు కనిపించాయి.

తొలిసారి అలాంటి మాటలతో రచ్చ

తొలిసారి అలాంటి మాటలతో రచ్చ

సాధారణంగా నాగార్జున వారం మొత్తం మీద జరిగే విషయాలను గుర్తించి.. తప్పులు చేసిన వారిని తిడుతూ.. మంచిగా ఆడిన వాళ్లను అభినందిస్తూ ఉంటాడు. అయితే, ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో మాత్రం సరికొత్త నాగార్జున కనిపిస్తున్నాడు. ఇందులో ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగులను వాడుతున్నాడు. అలాగే, కొంటెగా మాట్లాడుతూ కంటెస్టెంట్లకు లేనిపోని చిక్కలు తెస్తున్నాడు.

వాళ్లిద్దరినీ రూమ్‌లోకి పంపిన నాగ్

వాళ్లిద్దరినీ రూమ్‌లోకి పంపిన నాగ్

ఆదివారం జరిగిన ఎపిసోడ్ ఎంతో సందడిగా సాగింది. ఇందులో ఏకంగా పదకొండు మంది కంటెస్టెంట్లు నామినేట్ అయి ఉండడంతో వాళ్లను ఇద్దరేసి చొప్పున సేఫ్ చేశాడు. ఇందుకోసం పలు రౌండ్లను వినూత్నంగా ప్లాన్ చేశారు. ఒక సందర్భంలో సేఫ్ చేసేందుకు కావాల్సిన సామాగ్రిని తీసుకు రావడం కోసం అఖిల్ సార్థక్, అషు రెడ్డిని స్టోర్ రూమ్‌లోకి జంటగా పంపించాడు.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu
డబుల్ మీనింగ్ డైలాగ్‌తో షాకిచ్చి

డబుల్ మీనింగ్ డైలాగ్‌తో షాకిచ్చి

అషు రెడ్డి, అఖిల్ సార్థక్‌ను స్టోర్ రూమ్‌లోకి పంపించే సమయంలో అక్కినేని నాగార్జున 'స్టోర్ రూమ్‌లో కొన్ని సామాన్లు ఉన్నాయి తీసుకు రండి. అక్కడ వాటిని మాత్రమే తీసుకు రండి. ఇంకేమీ చేయకండి' అంటూ డబుల్ మీనింగ్‌గా మాట్లాడాడు. దీంతో అఖిల్ తల పట్టుకోగా.. అషు 'ఇంకేం చేస్తాం సార్' అని బదులిచ్చింది. నాగ్ డైలాగ్‌తో ఈ జంటపై డౌట్లు క్రియేట్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X