twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Non Stop: బిందు మాధవిపై నాగార్జున ఫైర్.. బూతు వీడియో చూపించి.. గేట్ ఓపెన్ చేయించి!

    |

    బిగ్ బాస్.. ఇంగ్లీష్ షో ఆధారంగా వచ్చి.. తెలుగులోనూ పరిచయమైన షో. కొందరు కంటెస్టెంట్లను ఓ ఇంట్లో ఉంచి.. వాళ్లకు చిత్ర విచిత్రమైన టాస్కులు ఇచ్చి.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న వాళ్లను విజేతగా ప్రకటించడమే దీని నేపథ్యం. హీందీలో ఎప్పుడో వచ్చినా.. తెలుగులో మాత్రం ఐదేళ్ల క్రితమే ఇది వచ్చింది. అనూహ్యంగా ఆరంభంలోనే దీనికి ప్రేక్షకుల భారీ రెస్పాన్స్‌ను అందించడంతో మన షో దేశంలోనే నెంబర్ వన్‌గా ఎదిగిపోయింది.

    దీంతో నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ అనే ఓటీటీ సీజన్‌ను మొదలెట్టారు. ఇందులో ఆదివారం వచ్చే ఎపిసోడ్‌లో నాగార్జున.. కంటెస్టెంట్లకు చుక్కలు చూపించాడు. ఆ వివరాలు మీకోసం!

    లైవ్ సీజన్.. ఒకరోజు ఆలస్యంగా

    లైవ్ సీజన్.. ఒకరోజు ఆలస్యంగా

    'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్ రెండు వారాల క్రితమే స్టార్ట్ అయింది. ఇది మొత్తం 84 రోజుల పాటు ప్రసారం కానుంది. ఈ సీజన్‌లోకి ఏకంగా 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ హౌస్‌లోకి ప్రవేశించారు. ఇక, దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే, మధ్యలో ఒకరోజు మొత్తం ఆపేసి.. 24 గంటలు ఆలస్యంగా దీన్ని ప్రసారం చేస్తున్నారు.

    Bigg Boss Non Stop: అతడిపై ఎదురు తిరిగిన కంటెస్టెంట్లు.. కంప్లైంట్ చేయడంతో ఇంట్లో నుంచి ఔట్Bigg Boss Non Stop: అతడిపై ఎదురు తిరిగిన కంటెస్టెంట్లు.. కంప్లైంట్ చేయడంతో ఇంట్లో నుంచి ఔట్

    రెండో వారం ఏం జరిగిందంటే

    రెండో వారం ఏం జరిగిందంటే

    రెండో వారానికి సంబంధించిన బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ల ఎంపిక కోసం కంటెస్టెంట్లకు 'తగ్గేదేలే' అనే టాస్కును ఇచ్చాడు. ఇందులో స్మగ్లర్లు, పోలీసులుగా మారి రెండు రౌండ్లను పూర్తి చేశారు. ఇందులో చాలెంజర్స్ టీమ్ విజయం సాధించింది. ఇక, ఆ తర్వాత జరిగిన కెప్టెన్సీ టాస్కులో అనిల్ రాథోడ్ విజయం సాధించాడు. తద్వారా ఇంటికి రెండో కెప్టెన్‌గా సెలెక్ట్ అయ్యాడు.

    11 మందిలో ఒకరు ఎలిమినేట్

    11 మందిలో ఒకరు ఎలిమినేట్

    బిగ్ బాస్‌ నాన్ స్టాప్ రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ కొన్ని గొడవలతో రచ్చ రచ్చగా సాగింది. ఇందులో మొత్తం పదకొండు మంది శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, అషు రెడ్డి, సరయు రాయ్, మహేశ్ విట్టా, యాంకర్ శివ, హమీదా ఖతూన్, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, అఖిల్ సార్థక్‌లు నామినేట్ అయ్యారు. వీరిలో ఆదివారం ఎపిసోడ్‌లో ఒకరు ఎలిమినేట్ అయిపోయారు.

    కాజల్‌ పర్సనల్ ఫొటో షేర్ చేసిన భర్త: ప్రెగ్నెంట్ అయ్యాక ఇలా కనిపించడం ఇదే తొలిసారికాజల్‌ పర్సనల్ ఫొటో షేర్ చేసిన భర్త: ప్రెగ్నెంట్ అయ్యాక ఇలా కనిపించడం ఇదే తొలిసారి

    ఆ కంటెస్టెంట్లపై నాగార్జున ఫైర్

    ఆ కంటెస్టెంట్లపై నాగార్జున ఫైర్

    సాధారణంగా బిగ్ బాస్ షోలో వారానికి రెండు రోజుల పాటు సందడి చేసే అక్కినేని నాగార్జున.. నాన్ స్టాప్ సీజన్‌లో మాత్రం ఆదివారం మాత్రమే కనిపిస్తాడని ముందే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం రాత్రి విడుదల కాబోతున్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా వచ్చింది. ఇందులో నాగ్ హోస్టింగ్‌తో అదరగొట్టాడు. అంతేకాదు, కొందరు కంటెస్టెంట్లకు క్లాస్ పీకేశాడు.

    అన్నం గురించి వాళ్లిద్దరికీ క్లాస్

    అన్నం గురించి వాళ్లిద్దరికీ క్లాస్

    రెండో వారంలో తగ్గేదేలే టాస్క్ జరుగుతోన్న సమయంలో బిందు మాధవి అన్న తినకుండా తన ప్లేట్‌ను తేజస్వీ మదివాడపైకి విసిరేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్జే చైతూ కూడా అన్నం తినకుండా పడేశాడు. ఈ రెండు విషయాలను ప్రస్తావిస్తూ నాగార్జున ఫైర్ అయ్యాడు. వీళ్లిద్దరి ముఖాలపై కత్తులను గుచ్చి (నామినేషన్స్ లాగ) ఓ రేంజ్‌లో క్లాస్ తీసుకున్నాడు.

    బ్రాతో యాంకర్ వర్షిణి అందాల విందు: ఆమెను ఈ ఘాటు ఫోజుల్లో చూశారంటే!బ్రాతో యాంకర్ వర్షిణి అందాల విందు: ఆమెను ఈ ఘాటు ఫోజుల్లో చూశారంటే!

    కెప్టెన్సీ టాస్కులో పొరపాటుగా

    రెండో వారానికి సంబంధించి జరిగిన కెప్టెన్సీ టాస్కులో అనిల్ రాథోడ్ విజయం సాధించినట్లు సంచాలకురాలైన తేజస్వీ మదివాడ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించిన నాగార్జున.. అతడి ఎంపిక సరైనది కాదని విమర్శించాడు. దీనికి ఆరియానా కూడా సపోర్ట్ చేయడంతో చిన్నపాటి గొడవ జరిగింది. ఆ తర్వాత ఈ విషయంపై కంటెస్టెంట్ల ఓట్లు తీసుకున్నాడు.

    బూతు వీడియో చూపించడంతో

    బూతు వీడియో చూపించడంతో

    ఆ మధ్య సరయును యాంకర్ శివ 'పిసకడానికి వేరే వాళ్లను పంపుతా' అన్నట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ, తాను అలా అనలేదని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, అది చూపిస్తే ఇంటి నుంచి వెళ్లిపోతానని అన్నాడు. దీంతో ఇప్పుడు నాగార్జున ఆ వీడియో చూపించాడు. అందులో శివ నిజంగానే ఆమెను అన్నాడు. దీంతో బయటకు వెళ్లమంటూ గేట్లు ఓపెన్ చేసి సీరియస్ అయ్యాడు.

    English summary
    Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. Nagarjuna Fire on Bindu Madhavi and Anchor Shiva in Sunday Episode.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X