Bigg Boss Non Stop : ఆ ఒక్కడి కారణంగా లైవ్ బ్రేక్.. అసలు విషయం ఏంటంటే?
బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో మొదలైన కొత్త బిగ్ బాస్ షో మొదలైన కొద్ది రోజులకే బ్రేక్ పడింది. ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు కానీ అసలు ఎందుకు ఆగింది అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు. ఈ విషయం మీద బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఇలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కేవలం గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి మళ్లీ లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు తప్ప దాని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి ? అనే దాని మీద క్లారిటీ లేదు. అయితే రకరకాల వర్షన్లు వినిపించాయి కానీ ఇప్పుడు ఈ షో ఆగిపోవడానికి కారణం బిగ్ బాస్ నాన్ స్టాప్ హోస్ట్ నాగార్జున అనే విషయం తెర మీదకు వచ్చింది. ఆయన దీనికి ఎలా కారణం అయ్యారు? అనే వివరాల్లోకి వెళితే..

గంట ఎపిసోడ్ ని
బిగ్ బాస్ నాన్ స్టాప్ 24 గంటల స్ట్రీమింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే బ్రేక్ లు పడ్డాయి. బిగ్ బాస్ నాన్ స్టాప్ స్ట్రీమింగ్ ఎందుకు ఆపి వేస్తున్నాము అనే విషయం ప్రకటించ లేదు, కానీ గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి మళ్లీ అందుబాటులోకి ఉంటుందని ప్రకటించారు. శనివారం నాడు మొదలైన షో బుధవారం నాడు రాత్రి నిలిపివేయడంతో అసలు ఏం జరిగింది? అనే విషయం మీద వీక్షకులు అందరిలో అనేక అనుమానాలు రేకెత్తాయి. అయితే నిర్వాహకులు ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు కానీ గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి అందుబాటులో ఉంటుందని అలాగే ఇప్పటివరకు విడుదల చేస్తున్నట్లు రోజుకు రెండు ఎపిసోడ్లు కాకుండా రోజు రాత్రి 9 గంటలకు ఒక గంట ఎపిసోడ్ ని అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు.

అదే నిజమై ఉండొచ్చు
అయితే టాలీవుడ్ వర్గాలలో జరిగిన ప్రచారం మేరకు బిగ్ బాస్ తమిళ్ ఒక రోజు గ్యాప్ తో ప్రసారం అయిందని కానీ తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు అదేవిధంగా ఒక్కరోజు గ్యాప్ తోనే ప్రారంభించారు కానీ కొన్ని అనుకోని కారణాలతో ఆ గ్యాప్ 24 గంటల నుంచి తగ్గుతూ తగ్గుతూ వచ్చి రెండు గంటలకు చేరింది అని, ఆ 2 గంటల సమయంలో ఎడిటింగ్ చేయడం కష్టం కాబట్టి ఒక రోజు మొత్తం టెలికాస్ట్ నిలిపివేస్తే దానికి తగిన ఫుటేజ్ సిద్ధం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అందుకే షో నిలిపివేశారని అన్నారు. ఇది కాస్త కన్విన్సింగ్ గా ఉండడంతో ప్రేక్షకులు కూడా అదే నిజమై ఉండొచ్చు అని అనుకున్నారు.

ఎలిమినేట్ చేస్తారు
అయితే ఈ షో నిలిచిపోవడానికి గల కారణం ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున అనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అదేమిటి ఆయన ఎలా దీనికి కారణం అయ్యాడు? అంటే గతంలో నాగార్జున శని, ఆదివారాలలో హౌస్ సభ్యులకు అలాగే బయట ప్రేక్షకులకు కనిపిస్తూ ఉండేవారు. బిగ్ బాస్ లో శనివారం సాయంత్రం నాగార్జున ప్రేక్షకులకు కనబడాలి అంటే ఆయన శనివారం ఉదయం షూటింగ్ కు హాజరవుతారు అట. శనివారం టెలికాస్ట్ అయ్యే షోను ఒక రోజు ముందు అంటే శుక్రవారం నాడు షూటింగ్ చేయడం జరగదు. ఎందుకంటే ఓటింగ్ ప్రక్రియ అంతా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంటుంది కాబట్టి ఆ ఓట్లన్నీ ఇంటిని పరిశీలించి శనివారం ఉదయం నాగార్జున సమక్షంలో ఒకరిని ఎలిమినేట్ చేస్తారు అని అంటున్నారు.

రెండు ఎపిసోడ్లకి సరిపడా
గతంలో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విషయాన్నే ఉదాహరణగా తీసుకుంటే శనివారం నాడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన షూటింగ్ మొత్తాన్ని ఎడిట్ చేసి శనివారం నాడు టెలికాస్ట్ చేసేవారు. అదే రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు జరిగిన షూటింగ్ మొత్తాన్ని ఆదివారం నాడు టెలికాస్ట్ చేసేవారు. అంటే నాగార్జున మొత్తం మీద వారంలో ఒక్కరోజు బిగ్ బాస్ కోసం కేటాయిస్తే ఆయన రెండు రోజుల పాటు ప్రేక్షకులు కనపడినట్లు అయ్యేది. కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో లైవ్ స్ట్రీమింగ్ కు లోపల జరుగుతున్న దానికి గ్యాప్ తగ్గిపోతూ గంటల వ్యవధిలోకి రావడంతో ఇప్పుడు నాగార్జునతో రెండు ఎపిసోడ్లకి సరిపడా షూటింగ్ ఒకే రోజు చేయడం అనేది కష్టం అని భావించారు.
Recommended Video

అలా నాగార్జున కారణం
అందుకే ఓకే ఒక రకంగా బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు ఈ షో టెలికాస్ట్ నిలిపివేశారు అని తెలుస్తోంది. కేవలం టెలికాస్ట్ నిలిపివేశారు తప్ప లోపల జరగాల్సిన అన్ని టాస్కులు మాత్రం యధావిధిగానే జరిగాయట. అంటే బిగ్ బాస్ యాజమాన్యం దగ్గర ఇప్పుడు ఒక రోజుకు సరిపడా కంటెంట్ ముందుగానే సిద్ధంగా ఉంటుంది. దీంతో వాళ్లు ఎలాంటి టెన్షన్ లేకుండా అన్ని ఎడిటింగ్ లు జాగ్రత్తగా చేసుకుని కావాల్సిన కంటెంట్ మాత్రమే ప్రేక్షకులకు చూపించుకునే అవకాశం కలుగుతుంది. అదీ కాక పొద్దున ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట అంటే నాగార్జున వచ్చిన ఎపిసోడ్ ఎలా జనం ముందుకు తీసుకు రావాలి అనే విషయంలో కూడా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది కాబట్టి దాన్ని కూడా ఎత్తివేసి రోజుకు గంట ఎపిసోడ్ మాత్రమే అది కూడా రాత్రి 9 గంటలకు రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అలా నాగార్జున ఈ షో ఆగిపోవడానికి కారణం అయ్యారు అనే విషయం ఇప్పుడు వెల్లడయింది.


Click it and Unblock the Notifications











