Bigg Boss Non Stop: సీక్రెట్ రూమ్‌లో బిందుకు షాకిచ్చిన నాగార్జున.. బూతు వీడియో చూపించగానే సిగ్గుతో!

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ద్వారా ఇండియాలోకి పరిచయమై.. ఐదేళ్ల క్రితమే తెలుగులోకి వచ్చింది బిగ్ బాస్. హిందీలో సక్సెస్ అయినా.. మన దగ్గర ఈ షో విజయం సాధించే పరిస్థితులు లేవన్న టాక్ వినిపించింది. కానీ, అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆరంభంలోనే ప్రేక్షకుల ఆదరణను సైతం సొంతం చేసుకుంది. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు ఐదు సీజన్లను పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌ను మొదలు పెట్టారు. ఇందులోకి టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన బిందు మాధవికి ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున బూతు వీడియో చూపించి భారీ షాకిచ్చాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

మరింత వినోదాన్ని ఇస్తూ

మరింత వినోదాన్ని ఇస్తూ

సాధారణంగా బిగ్ బాస్ షో మొదలవుతుంది అనగానే దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అలాంటిది ఓటీటీలో సెన్సార్ లేకుండా వచ్చే సీజన్ అయితే ఇంకెంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఫలితంగా ఆడియెన్స్‌కు మరింత వినోదం కూడా అందుతోంది.

టైటిల్ ఫేవరెట్‌గా బ్యూటీ

టైటిల్ ఫేవరెట్‌గా బ్యూటీ

బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్లు అడుగు పెట్టే సమయంలోనే వాళ్లలో టైటిల్ ఫేవరెట్ ఎవరు అనేది తెలిసిపోతుంది. నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా.. అందులో ప్రముఖ హీరోయిన్ బిందు మాధవి మాత్రమే ఆరంభంలోనే అందరి దృష్టినీ పట్టేసింది. తద్వారా ఈ సీజన్‌ను గెలిచే సత్తా తనలో ఉందని చెప్పుకుంటూ ముందుకు సాగుతోంది.

ఆటే కాదు.. మైండ్ గేమ్‌తో

ఆటే కాదు.. మైండ్ గేమ్‌తో

నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో టైటిల్ ఫేవరెట్ అనిపించుకుంటోన్న బిందు మాధవి తనదైన ఆటతో అందరినీ కట్టిపడేస్తోంది. టాస్కులను చక్కగా ఆడుతూనే మైండ్ గేమ్ పరంగానూ సత్తా చాటుతోంది. అయితే, మరీ ముఖ్యంగా ఏ విషయంలోనైనా క్లారిటీ వ్యవహరిస్తూ నచ్చని వాటిని వ్యతిరేకిస్తోంది. ఫలితంగా హౌస్‌లోని ఒక వర్గానికి చుక్కలు చూపిస్తూ హాట్ టాపిక్ అవుతోంది.

ఆ బూతు అనేసిన బిందు

ఆ బూతు అనేసిన బిందు

ఇటీవల ఓ కెప్టెన్సీ టాస్కుకు బిందు మాధవి సంచాలకురాలిగా చేసింది. అందులో తనకు అన్యాయం జరిగిందని యాంకర్ శివ ఆమెపై అలిగాడు. దీంతో ఆరోజు రాత్రి అతడిని తన బెడ్ దగ్గరకు రమ్మని బ్రతిమాలింది. కానీ, అతడు మాత్రం అస్సలు వినలేదు. అప్పుడామె What the fuck అంటూ బూతు మాట అనేసింది. దీంతో బిందు మాధవి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.

కన్ఫెషన్‌ రూమ్‌కు బిందు

కన్ఫెషన్‌ రూమ్‌కు బిందు

ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున గత వారం ఎన్నో ఊహించని సంఘటనలు చోటు చేసుకోవడంతో కోపంగా కనిపించాడు. ముందుగా అందరినీ కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి మాట్లాడాడు. ఇందులో భాగంగానే ఆరంభంలో బిందు మాధవిని లోపలికి రమ్మన్నాడు. గతంలో మాదిరిగా కాకుండా అక్కడ ఆమెతోనే కొన్ని విషయాలను సీక్రెట్‌గా మాట్లాడాడు నాగార్జున.

బూతు వీడియో చూపించి

బూతు వీడియో చూపించి


కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన బిందు మాధవిని ‘నిన్ను మోసం చేసేది ఎవరు? నమ్మక ద్రోహం చేసేది ఎవరు' అని ప్రశ్నించాడు. దీనికామె ఆలోచించుకున్న నటరాజ్ మాస్టర్ పేరు చెప్పింది. ఆ తర్వాత బిందు మాధవికి నాగార్జున What the fuck అంటూ బూతు మాట మాట్లాడిన వీడియోను చూపించాడు. దీంతో ఆమె తప్పు చేసినట్లుగా సిగ్గు పడుతూ తల దించుకుంది.

Recommended Video

Bigg Boss Telugu OTT : Bindu Madhavi ప్రభంజనానికి అడ్డుపడుతున్న Akhil Sarthak | Filmibeat Telugu
బిందుకు నాగ్ హెచ్చరిక

బిందుకు నాగ్ హెచ్చరిక


ఆ సమయంలో నాగార్జున మాట్లాడుతూ.. ‘ఇదే బూతు మాట అజయ్ అన్నాడని గొడవ చేశావ్.. ఇప్పుడు నువ్వు అదే పదం వాడావు. ఇద్దరిదీ తప్పు కాదు. కానీ, అందరికీ ఇప్పుడు నేను చెప్పినట్లే డౌట్ వస్తుంది కదా. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండు. ఇకపై ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడు. ఆట చక్కగా ఆడుతున్నావు' అంటూ స్వీట్‌గానే వార్నింగ్ ఇచ్చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X