Bigg Boss Non Stop: అఖిల్ అక్కడ చేయి పెట్టాడన్న హమీదా.. ‘ప్రైవేట్ పార్ట్’ వీడియో చూపించడంతో!

దాదాపు ఐదేళ్లుగా తెలుగు బుల్లితెరపై సంచలనాలను సృష్టిస్తూ.. భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను అందుకుంటూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. చిత్ర విచిత్రమైన టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య కోల్డ్ వార్‌లు.. లవ్ ట్రాకులు.. రొమాన్స్ ఇలా ఎన్నో రకాల సంఘటనలను చూపిస్తూ షోను మరింత ఆసక్తికరంగా మార్చుతున్నారు. దీంతో ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని.. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను మొదలైంది. ఇది సెన్సార్ లేకపోవడంతో రచ్చ రచ్చగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం హమీదా, అఖిల్ మధ్య జరిగిన ప్రైవేట్ పార్ట్ వివాదం గురించి నాగార్జున క్లారిటీ ఇచ్చేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం వచ్చేయండి!

వాటికి మించేలా ఎంటర్‌టైన్‌మెంట్

వాటికి మించేలా ఎంటర్‌టైన్‌మెంట్


'బిగ్ బాస్ నాన్ స్టాప్' నెల రోజుల క్రితమే గ్రాండ్‌గా మొదలైంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సీజన్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మరీ ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో సంఘటనలను ఇందులో చూపిస్తున్నారు. ఫలితంగా రెగ్యూలర్ బిగ్ బాస్ సీజన్లకు మించేలా ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నారు.

17మంది రాక.. నలుగురు బయటకు

17మంది రాక.. నలుగురు బయటకు

ఈ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో నుంచి ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు రాయ్‌లు ఎలిమినేట్ అయిపోయారు.

కంటెస్టెంట్లే కాదు... నాగార్జున కూడా

కంటెస్టెంట్లే కాదు... నాగార్జున కూడా

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫస్ట్ సీజన్‌ ఓటీటీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో కొంత బోల్డ్‌నెస్ ఎక్కువగానే కనిపిస్తోంది. కంటెస్టెంట్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగు, హాట్ డ్రెస్‌లతో అలరిస్తున్నారు. అదే సమయంలో నాగార్జున కూడా గతంలో ఎన్నడూ చూడని విధంగా రెచ్చిపోతోన్నాడు. ఎక్కువగా సెటైర్లు, పంచ్‌లు, డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతూ షాకిచ్చేస్తున్నాడు.

క్లాస్ పీకి.. కామెడీ చేసి.. సందడిగానే

క్లాస్ పీకి.. కామెడీ చేసి.. సందడిగానే

బిగ్ బాస్ షోలో ప్రతి ఆదివారం ఎలిమినేషన్ ఉంటుందన్న విషయం చెప్పక్కర్లేదు. అయితే, అంతకంటే ముందే కంటెస్టెంట్లు అందరితో హోస్ట్ నాగార్జున పలు రకాల ఆటలు ఆడిస్తుంటాడు. దీంతో సండే ఎపిసోడ్‌ ఫన్‌‌డేగా మారిపోతుంది. ఇక, తాజా ఎపిసోడ్‌లో నాగార్జున కొందరు కంటెస్టెంట్లకు క్లాస్ పీకేశాడు. ఆ తర్వాత ఆటపాటలతో అందరితో ఎంతో సందడిగా గడిపాడు.

హమీదాను పిలిచి.. మేటర్ అడిగేసి

హమీదాను పిలిచి.. మేటర్ అడిగేసి

గత వారంలో జరిగిన కెప్టెన్సీ కంటెండర్ల టాస్కులో హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్ మధ్య ఓ పెద్ద వివాదం జరిగిన విషయం తెలిసిందే. లైక్స్ తీసుకున్న క్రమంలోనే అఖిల్ తన ప్రైవేటు భాగాలపై చేతులు పెట్టాడంటూ హమీదా ఆరోపణలు చేసింది. దీని గురించి తెలుసుకునేందుకు ఆదివారం ఎపిసోడ్‌లో ఆమెను కన్ఫెషన్ రూమ్‌కు పిలవగా.. అఖిల్ పొరపాటున చేశాడని అంది.

అఖిల్ కూడా వెళ్లి.. వీడియో వేశాడు

అఖిల్ కూడా వెళ్లి.. వీడియో వేశాడు

గేమ్‌లో భాగంగానే అఖిల్ అలా ప్రవర్తించాడని.. దానిని తాను అర్థం చేసుకుంటానని హమీదా వెల్లడించింది. ఆ తర్వాత అఖిల్‌ను పిలిచి వివరణ అడిగాడు నాగార్జున. అతడు మాత్రం తాను కావాలని టచ్ చేయలేదని.. హమీదా అక్కడ టచ్‌ చేశానని ఆరోపించడంతో బాధ పడ్డాడని చెప్పాడు. దీంతో వాళ్లను ఇంట్లోకి పంపేసి.. ఆ వీడియోను ప్లే చేసి మరీ అందరికీ చూపించాడు.

హౌస్ ఓట్... వివాదం పరిష్కరించి

హౌస్ ఓట్... వివాదం పరిష్కరించి


వీడియోను చూపించిన తర్వాత అఖిల్ కావాలని టచ్ చేయలేదని ఎక్కువ మంది సపోర్ట్ చేశారు. దీంతో నాగార్జున 'నాక్కూడా అఖిల్ కావాలని చేయలేదని అనిపించింది. కానీ, హమీదా బాధ పడింది కాబట్టి.. ఆమెతో కలిసి మాట్లాడి ఉంటే బాగుండేది' అని చెప్పాడు. దీంతో అఖిల్, హమీదా హగ్ చేసుకుని ఒకరికొకరు సారీ అని చెప్పుకుంటూ వివాదాన్ని పరీష్కరించుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X