Bigg Boss Non Stop: షోలో రియల్ ఫైట్.. ‘ఎదవ హౌలే అది కట్ చేస్తా’ అంటూ అతడితో ఘోరంగా!
బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా దాదాపు ఐదేళ్లుగా టెలివిజన్ రంగాన్ని శాసించే రేంజ్‌లో స్పందనను అందుకుంటూ దూసుకుపోతోంది. ఫలితంగా విజయవంతంగా ఐదు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. దీంతో నిర్వహకులు ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను కూడా గ్రాండ్‌గా మొదలు పెట్టారు.
దీనికి కూడా ఆరంభం నుంచే భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ సీజన్ కూడా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. అయితే, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో నటరాజ్ మాస్టర్ రెచ్చిపోయాడు. యాంకర్ శివపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ గొడవకు దిగాడు. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

భారీగా పెరుగుతోన్న ఆదరణ
భారీ అంచనాలతో ప్రారంభం అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌కు మంచి ఆదరణ దక్కుతోంది. ఆరంభం నుంచే ఇందులో కంటెంట్ ఆకర్శవంతంగా ఉండడంతో పాటు బోల్డుగా కనిపించడంతో ఆడియెన్స్ ఫోకస్ చేస్తున్నారు. ఫలితంగా ఈ సీజన్ ఓటీటీలో వచ్చినా సక్సెస్‌ఫుల్‌గానే నడుస్తోంది. దీంతో నిర్వహకులు మరిన్ని ప్రయోగాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

ఫ్యామిలీ టాస్క్ ఇచ్చిన బాస్
శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో ఇంట్లోని సభ్యులకు ఫ్యామిలీ టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం.. ఇంటి పెద్దగా నటరాజ్ మాస్టర్ తన కుటుంబాన్ని ఎంపిక చేసుకుని.. అసలు వాళ్లు ఎందుకు ఆ క్యారెక్టర్ చేయాలో వివరించాలి. అలా అందరినీ ఎంపిక చేసుకున్న తర్వాత ఫన్నీగా స్కిట్ చేయాలి అని బిగ్ బాస్ సూచించాడు. దీంతో ఆయన తనదైన కారణాలతో సెలెక్ట్ చేసుకున్నాడు.

నటరాజ్ పెద్దగా కుటుంబం
ఈ టాస్కు కోసం నటరాజ్ మాస్టర్ తన భార్యగా ముమైత్‌ను ఎంపిక చేశాడు. అలాగే.. అఖిల్ పెద్ద కొడుకుగా, బిందు మాధవి గయ్యాలి కోడలిగా సెలెక్ట్ చేశాడు. వీళ్లతో పాటు అజయ్‌ను చిన్న కొడుకుగా, అషురెడ్డిని పెద్ద కూతురుగా, హమీదాను చిన్న కూతురుగా, మహేష్ విట్టాను వంట మనిషిగా, స్రవంతిని చెల్లెలుగా, అనీల్‌ను స్రవంతి భర్తగా, బేవర్స్ కొడుకుగా శివను ఎంచుకున్నాడు.

యాంకర్ శివ నట విశ్వరూపం
శనివారం జరిగిన ఫ్యామిలీ టాస్కులో అందరూ తమ తమ పాత్రల్లో జీవించారు. మరీ ముఖ్యంగా యాంకర్ శివ బేవార్స్ తాగుబోతు వాడిలా విశ్వరూపం చూపించాడు. తరచూ ఫ్యామిలీ మధ్యలోకి వెళ్లి అందరితో గొడవ పడడం.. మరీ ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ లుంగీ పట్టుకుని లాగడం వంటి వాటితో నవ్వించాడు. అతడికి మిగిలిన వాళ్లు కూడా బాగా సహకరించడంతో ఫన్ వచ్చింది.

హర్టైన నటరాజ్.. వరస్ట్ అని
ఆరో వారానికి సంబంధించి ఉత్తమ, చెత్త కంటెస్టెంట్లను ఎంపిక చేసే ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. ఇందులో నటరాజ్ మాస్టర్.. యాంకర్ శివను నామినేట్ చేశాడు. అప్పుడు 'బిందు అతడి కోసం ఎంతగానో పోరాడుతోంది. అలాంటిది ఇప్పుడు ఆమెనే శివ వరస్ట్ పెర్ఫార్మర్ అన్నాడు' అనే రీజన్ చెప్పాడు. దీంతో శివకు చాలా కోపం వచ్చింది. కానీ, నటరాజ్ సిల్లీగానే మాట్లాడాడు.

ఇద్దరి మధ్య భీకరమైన వార్
బయటకు వచ్చిన తర్వాత యాంకర్ శివ తనకు వరస్ట్ పెర్ఫార్మర్ ఎందుకు ఇచ్చారంటూ నటరాజ్ మాస్టర్‌ను ప్రశ్నించాడు. దీనికి ఆయనకు కోపం వచ్చింది. అంతే.. ఒక్కసారిగా అతడిపై విరుచుకుపడ్డాడు. 'నా లుంగీ పైకెత్తడానికి నువ్వు ఎవర్రా.. ఎదవ.. హౌలే.. బోస్‌డీకే' అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. దీనికి శివ కూడా అదే రీతిలో స్పందించిన బూతుల మాట్లాడలేదు.

బూతులతో రెచ్చిపోయాడు
నటరాజ్ మాస్టర్ అంతటితో ఆగలేదు. బయటే కూర్చుని యాంకర్ శివను మరింతగా రెచ్చగొట్టాడు. అలాగే, లోపలికి వెళ్లిన తర్వాత కూడా మిగిలిన వాళ్లతో చెబుతూ 'వాడు లుంగీ లేపాడు. ఈసారి అయితే వాడిది కట్ చేసేస్తాను' అంటూ బూతులు మాట్లాడాడు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం కనిపించింది. కానీ, శివ సైలెంట్ గానే ఉండడంతో నటరాజ్ కామ్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











