Bigg Boss Non Stop: ‘నీది పిసకలేను.. వాడిని పంపుతా’.. ఆమెతో అసభ్యంగా.. షో నుంచి వెళ్లిపోతానంటూ!

ఎన్నో అనుమానాల నడుమ మొదలై.. ప్రేక్షకుల ఆదరణను అందుకుని వాటన్నింటనీ పటాపంచలు చేసిన ఏకైక షో బిగ్ బాస్. అంతకు ముందెన్నడూ చూడని కాన్సెప్టు.. సరికొత్త టాస్కులు.. మధ్య మధ్యలో కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. ఎలిమినేషన్స్.. ఎమోషన్స్ ఇలా ఎన్నో రకాలుగా వినోదాన్ని పంచుతూ నెంబర్ వన్ షోగా మారిపోయిందిది. అందుకే ఇప్పటికే ఐదు సీజన్లను రికార్డు స్థాయి రేటింగ్‌లతో పూర్తి చేసుకుంది.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్‌ను ప్రారంభించారు. ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోన్న ఇందులో ఎవరూ ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసభ్య పరిణామం బయటకు వచ్చింది. ఆ సంగతులు మీకోసం!

నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్

నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్

ఓటీటీ వెర్షన్ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్' ఫస్ట్ సీజన్‌ ఫిబ్రవరి 26న మొదలైంది. ఇది మొత్తం 84 రోజుల పాటు ప్రసారం కానుంది. ఈ సీజన్‌లోకి ఏకంగా 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ హౌస్‌లోకి ప్రవేశించారు. దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు ప్రసారం చేస్తున్నారు. అయితే, మధ్యలో 24 గంటల పాటు షో మొత్తం ఆపేసి.. ఒకరోజు ఆలస్యంగా దీన్ని స్ట్రీమింగ్ చేస్తున్నారు.

17 మంది ఎంట్రీ.. ఒకరు ఔట్

17 మంది ఎంట్రీ.. ఒకరు ఔట్

బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. ఇందులో మొదటి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది.

రెండు టీమ్‌ల మధ్య పోటీతో

రెండు టీమ్‌ల మధ్య పోటీతో

బిగ్ బాస్ నాన్ స్టాప్‌లోకి కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఎంటరయ్యారు. ఇందులో గత సీజన్లలో పాల్గొన్న వాళ్లను వారియర్స్ అని.. కొత్త వాళ్లను చాలెంజర్స్ అని రెండు గ్రూపులుగా విభజించారు. వీళ్లకు పోటాపోటీగా టాస్కులు కూడా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ రెండు గ్రూపుల మధ్య జరుగుతున్న పోరు ఎంతో ఆసక్తికరంగా మారింది. ఫలితంగా షో రంజుగా సాగుతోంది.

నామినేషన్స్ కోసం ఆసక్తిగానే

నామినేషన్స్ కోసం ఆసక్తిగానే

బిగ్ బాస్ షో మొత్తంలో ఎన్నో టాస్కులు.. మరెన్నో చిత్ర విచిత్రమైన పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అయితే, అన్నింటి కంటే ఎంతో ముఖ్యమైన ఘట్టం నామినేషన్స్ ప్రక్రియే అన్న విషయం తెలిసిందే. వారం మొదలైన రోజు అంటే ప్రతి సోమవారం దీన్ని ప్రసారం చేస్తుంటారు. ఇందులో భాగంగానే బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండో నామినేషన్స్‌పై అందరిలో అంచనాలున్నాయి.

కత్తి పెట్టి పొడుస్తూ నామినేట్

కత్తి పెట్టి పొడుస్తూ నామినేట్


‘బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్ రెండో వారానికి సంబంధించిన జరగనున్న నామినేషన్స్ ప్రక్రియ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో వారియర్స్, చాలెంజర్స్ టీమ్‌లుగా విడిపోయి ఎదుటి జట్టులోని వాళ్లను నామినేట్ చేయాలి. ఇందులో భాగంగా కంటెస్టెంట్ ముఖంతో ఉన్న బోర్డుపై మిగిలిన వాళ్లు కత్తితో పొడిచి.. సరైన కారణాలు చెప్పాల్సి ఉంటుంది.

నీది పిసకలేను అని ఆరోపణ

బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ ఆద్యంతం కంటెస్టెంట్ల మధ్య గొడవలతో రచ్చ రచ్చగా సాగినట్లు అర్థం అవుతోంది. మరీ ముఖ్యంగా కొందరు రెచ్చిపోయి మరీ వ్యక్తిగత దూషణలకు దిగారు. ఇందులో భాగంగానే సరయును యాంకర్ శివ ‘నీ పిండి నేను పిసకలేను కానీ.. వేరే వాడిని పంపుతా' అంటూ అసభ్యంగా మాట్లాడడాని నటరాజ్ ఆరోపణలు చేశాడు.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu
షో నుంచి వెళ్లిపోతానంటూ

షో నుంచి వెళ్లిపోతానంటూ

లేడీ కంటెస్టెంట్‌తో యాంకర్ శివ అసభ్యంగా వ్యవహరించాడని నటరాజ్ ఆరోపణలు చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత శివ దీనిపై స్పందిస్తూ ‘ఒకవేళ మీరు అన్నది కనుక నాకు చూపిస్తే.. మీరెవరూ నన్ను ఎలిమినేట్ చేయొద్దు. నేనే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను' అంటూ సవాల్ విసిరాడు. మొత్తానికి నామినేషన్స్ టాస్కులు కొట్టుకునే స్థాయికి వచ్చేలా కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X