Bigg Boss Non Stop: బాడీ షేమింగ్ కామెంట్లతో బిగ్ ఫైట్.. ఏడ్చేసిన ఇద్దరు మేల్ కంటెస్టెంట్లు

అసలే మాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి వచ్చి.. రికార్డులన్నీ బద్దలు కొట్టేంత రెస్పాన్స్‌ను అందుకుంటూ ముందుకు సాగుతోన్న షో బిగ్ బాస్. ఇండియాలోని చాలా భాషల్లో వస్తున్నా.. మన దగ్గర ప్రసారమయ్యే షోకు మాత్రమే భారీ రేటింగ్ వస్తోంది. ఫలితంగా దేశంలోనే నెంబర్ వన్ షోగా మారిపోయింది. దీంతో నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌ను కూడా మొదలు పెట్టేశారు. ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, తాజాగా జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో పెద్ద ఫైట్ జరిగింది. దీంతో ఇద్దరు మేల్ కంటెస్టెంట్లు ఏడ్చేశారు. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

వైభవంగా ‘నాన్ స్టాప్' సీజన్

వైభవంగా ‘నాన్ స్టాప్' సీజన్

బిగ్ బాస్ రియాలిటీ షోను ఇష్టపడే వాళ్లంతా ఎన్నో రోజులుగా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఓటీటీ మొదటి సీజన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్'ను ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభించారు. దీనికి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఆటపాటలతో అంగరంగ వైభవంగా సాగిన ప్రారంభ ఎపిసోడ్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కొన్ని లక్షల మంది వీక్షించారని తెలుస్తోంది.

 నామినేషన్స్ టాస్కులో ఫైటింగ్

నామినేషన్స్ టాస్కులో ఫైటింగ్

బిగ్ బాస్ షో మొత్తంలో ముఖ్యమైన ఘట్టం నామినేషన్స్ ప్రక్రియే అన్న విషయం తెలిసిందే. వారం మొదలైన రోజు అంటే ప్రతి సోమవారం దీన్ని ప్రసారం చేస్తుంటారు. అయితే, ఇప్పుడు 24 గంటలు ప్రసారం అవుతుండడంతో ఆదివారం రాత్రే ఇది ప్రసారం అయింది. ఇందులో చాలెంజర్స్‌ను ఇద్దరేసి వారియర్స్‌ను నామినేట్ చేయమని చెప్పారు. ఇదంతా ఫైట్లతో సాగింది.

నటరాజ్ మాస్టర్ బాడీ షేమింగ్

నటరాజ్ మాస్టర్ బాడీ షేమింగ్

చాలెంజర్లలో ఎక్కువ మంది నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేశారు. దీంతో ఆయన తట్టుకోలేకపోయారు. మొదట్లో స్రవంతి చొక్కారపుతో ఆ తర్వాత ఆర్జే చైతూ, శ్రీ రాపాకతో గొడవ పడ్డారు. ఒకానొక సందర్భంలో ఆయన ఎక్కువగా తింటారు అన్నట్లుగా ఆర్జే చైతూ, శ్రీ రాపాక అన్నాడట. దీంతో వీళ్లిద్దరూ తమపై నటరాజ్ మాస్టర్ బాడీ షేమింగ్ కామెంట్లు చేశారంటూ పెద్ద గొడవ పెట్టుకున్నారు.

 ఇద్దరు మేల్ కంటెస్టెంట్స్ బాధ

ఇద్దరు మేల్ కంటెస్టెంట్స్ బాధ

నటరాజ్ మాస్టర్ తనను బాడీ షేమింగ్ కామెంట్స్ చేశాడంటూ ఆర్జే చైతూ ఏడ్చేశాడు. దీంతో పలువురు చాలెంజర్లు వచ్చి అతడిని ఓదార్చారు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ కూడా బిగ్గరగా ఏడ్చాడు. 'నేను ఎలాంటి బాడీ షేమింగ్ కామెంట్లు చేయలేదు' అంటూ గట్టిగా అరుస్తూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో నామినేషన్స్ టాస్క్ మొత్తం రచ్చ రచ్చగా సాగిందని చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X