Bigg Boss Non Stop: అతడి వల్లే తేజస్వీ బలి.. ప్లాన్ ప్రకారమే ఎలిమినేట్.. తెరపైకి సంచలన నిజం

ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సంఘటనలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తోన్న ఏకైక షో బిగ్ బాస్. ఐదేళ్ల క్రితమే తెలుగులోకి వచ్చిన ఈ షో ప్రతి ఏటా ఒక్క సీజన్ చొప్పున సాగిపోతోంది. ఇలా ఐదింటిని రికార్డు స్థాయిలో రేటింగ్‌తో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ కూడా ఆరంభం నుంచే రంజుగా సాగుతోంది. మరీ ముఖ్యంగా ఇందులో ఊహించని ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. ఇలా ఇప్పుడు ఐదో వారంలో తేజస్వీ మదివాడ ఎలిమినేట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెను ప్లాన్ ప్రకారమే పంపించారని ఓ అంశం తెరపైకి వచ్చింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

వాటి కంటే వినోదాత్మకంగా సాగుతూ

వాటి కంటే వినోదాత్మకంగా సాగుతూ


తెలుగులో బిగ్ బాస్ షో ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటికి ఏమాత్రం తగ్గకుండా ఇప్పుడు ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ సీజన్ కూడా మరింత వినోదాత్మకంగా సాగుతోంది. ఇందులో గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌ను ప్రసారం చేస్తూ ఆసక్తికరంగా మార్చేస్తున్నారు. ఫలితంగా ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కేలా చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు.

నాలుగు ఎలిమినేషన్స్ సందేహాలతో

నాలుగు ఎలిమినేషన్స్ సందేహాలతో

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో అన్ని సరికొత్తగానే కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎలిమినేషన్స్ మాత్రం బాగా హైలైట్ అవుతున్నాయి. దీనికి కారణం ఇప్పటి వరకూ జరిగిన నాలుగు వారాల్లో ఊహించని కంటెస్టెంట్లే ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం ముమైత్, రెండో వారం శ్రీ రాపాక, మూడో వారం చైతూ, నాలుగో వారం సరయు ఎలిమినేషన్స్ అందరికీ షాక్ ఇచ్చాయి.

ఓటింగ్ కాదు.. వాళ్లకు నచ్చని వాళ్లే

ఓటింగ్ కాదు.. వాళ్లకు నచ్చని వాళ్లే

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఇప్పటి వరకూ మంచిగా ఆడే వాళ్లు, ప్రేక్షకుల ఆదరణ ఉన్న వాళ్లే ఎలిమినేట్ అయ్యారు. దీంతో అసలు ఈ రియాలిటీ షో ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా జరగడం లేదని.. నిర్వహకులు ఎవరిని అనుకుంటే వాళ్లనే బయటకు పంపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ప్రతివారం ఇదే తరహా ఎలిమినేషన్ ఉంటోంది.

5వ వారంలో తేజస్వీ మదివాడ ఔట్

5వ వారంలో తేజస్వీ మదివాడ ఔట్

ఐదో వారానికి సంబంధించిన జరిగిన నామినేషన్స్‌లో బిందు మాధవి, మిశ్రా శర్మ, యాంకర్ శివ, ఆరియానా గ్లోరీ, స్రవంతి చోకారపు, తేజస్వీ మదివాడ, అనిల్ రాథోడ్‌లు నామినేట్ అయిపోయారు. ఇందులో స్రవంతి, మిత్రా శర్మలకు తక్కువ ఓట్లు వస్తున్నాయన్న టాక్ వినిపించింది. కానీ, ఊహించని విధంగా ఈ వారం షో నుంచి తేజస్వీ మదివాడ ఎలిమినేట్ అయింది.

గతంలో కంటే మంచిగా ఉన్నా ఇలా

గతంలో కంటే మంచిగా ఉన్నా ఇలా

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో బోల్డ్ బ్యూటీలు తెగ సందడి చేస్తున్నారు. ఇలా వచ్చిన వారిలో తెలుగు భామ తేజస్వీ మదివాడ ఒకరు. రెండో సీజన్‌లో రచ్చ చేసిన ఈ బ్యూటీ.. మధ్యలోనే ఎలిమినేట్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఛాన్స్ వచ్చింది. ఇందులో మాత్రం ఆమె చాలా స్పెషల్ అనిపించుకుంది. అలాగే, కాసింత మంచి పేరును కూడా సంపాదించుకుంది.

అతడి వల్లే ఎలిమినేట్ అయ్యానని

అతడి వల్లే ఎలిమినేట్ అయ్యానని

బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన వెంటనే తేజస్వీ షాక్ అవడంతో పాటు ఏడ్చేసింది. ఆమెతో పాటు హౌస్‌లోని కంటెస్టెంట్లు కూడా ఆశ్చర్యపోయారు. అయితే, నటరాజ్ మాస్టర్ మాత్రం ఏడుస్తూనే ఉన్నాడు. దీంతో అతడి దగ్గరకు వెళ్లిన తేజస్వీ 'మీరు కోరుకున్నదే జరిగింది కదా మాస్టర్.. ఎందుకు ఏడవడం.. ఇంక హ్యాపీగా ఉండండి' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

నామినేషన్స్ రోజు ఏం జరిగిందంటే

నామినేషన్స్ రోజు ఏం జరిగిందంటే


వాస్తవానికి నామినేషన్స్‌లో తేజస్వీ లేదు. కానీ, స్వైప్ చేసే ఆప్షన్ ఇవ్వడంతో ఆమె ఈ లిస్టులో చేరింది. పాపం ఇది ఆమె తప్పిదం కాదు.. అప్పటి సంచాలకుడు నటరాజ్ మాస్టర్ తీసుకున్న నిర్ణయం వల్లే ఆమె నామినేట్ అయింది. అషు రెడ్డిని నామినేట్ చేయాల్సి ఉన్నా.. ఆమెను కాదని తేజస్వీని బుక్ చేశాడు. ఇప్పుడదే ఆమె కొంప ముంచిందని అందరూ అనుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X