Bigg Boss Non Stop: షోలో రియల్ ఫైట్.. ఏం పీ*తావురా.. దమ్ముంటే రారా అంటూ బూతులతో!
బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని షో ఇది. అంతలా ఇది దాదాపు ఐదేళ్లుగా భారీ స్థాయిలో ఆదరణను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఫలితంగా దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. అందుకే నిర్వహకులు కూడా ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా వరుసగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను కూడా మొదలు పెట్టేశారు. ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోన్న ఇందులో తాజాగా రియల్ ఫైట్ జరిగింది. అంతేకాదు, దారుణమైన బూతులతో కంటెస్టెంట్లు రెచ్చిపోయారు. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించి వివరాలు మీకోసం!
Recommended Video

17 మందితో గ్రాండ్‌గా మొదలు
తెలుగులో బిగ్ బాస్ సీజన్ వస్తుందంటే ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఎన్నో అంచనాలతో వైభవంగా మొదలైంది. ప్రారంభ ఎపిసోడ్‌లో మొత్తం 17 మంది హౌస్‌లోకి ఎంటరయ్యారు. ఇందులో పది మంది లేడీ కంటెస్టెంట్లు కాగా.. మిగిలిన వాళ్లంతా మేల్ కంటెస్టెంట్లు వచ్చారు.

గ్రూపులుగా విభజించేసిన టీమ్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి పాత కొత్త కంటెస్టెంట్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో గత సీజన్లలో పాల్గొన్న వాళ్లను వారియర్స్ అని.. కొత్త వాళ్లను చాలెంజర్స్ అని రెండు గ్రూపులుగా విభజించారు. వీళ్లకు పోటాపోటీగా టాస్కులు ఇస్తున్నారు. దీంతో ఈ రెండు గ్రూపులు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్నాయి.

బూతులు... బోల్డుగా... కనిపిస్తూ
మామూలు బిగ్ బాస్ షో సెన్సార్‌తో నడిచేది. దీంతో ఇందులో ఏవైనా బూతులు మాట్లాడితే మ్యూట్ చేయడమో, బీప్ వేయడమో చేసేశారు. అయితే, ఓటీటీ వెర్షన్ 24 గంటలూ ప్రసారం అవుతోన్న నేపథ్యంలో దీనికి ఎలాంటి కట్స్, బీప్స్ ఉండడం లేదు. దీంతో ఈ షో ఆరంభం నుంచే రచ్చ రచ్చగా సాగుతోంది. దీంతో ఇందులో ఎన్నో బూతులు వినిపిస్తూ కనిపిస్తున్నాయి.

రెండు గ్రూపులు మధ్య ఫైట్లతో
నామినేషన్స్ టాస్కులో సీనియర్లు, జూనియర్ల మధ్య ఎలాంటి వాగ్వాదాలు జరిగాయో తెలిసిందే. అలాగే, మొదటి వారం కెప్టెన్సీ కంటెండర్ల కోసం బిగ్ బాస్ పలు టాస్కులు ఇస్తున్నాడు. ఇందులో భాగంగానే వారియర్స్, చాలెంజర్ల మధ్య ఎన్నో రకాల గొడవలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా రెండు టీమ్‌లలోని సభ్యులు బాహాబాహీకి సైతం దిగుతూ రెచ్చిపోతున్నారు.

స్టిక్కర్ టాస్క్.. మరింత ఘాటు
కెప్టెన్సీ కంటెండర్లను ఎంపిక చేసుకునేందుకు గానూ బిగ్ బాస్.. హౌస్‌లోని కంటెస్టెంట్లకు రెండో రౌండ్‌లో స్టిక్కర్ల టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా వారియర్స్, చాలెంజర్స్ టీమ్‌ల నుంచి ముగ్గురేసి కంటెస్టెంట్లు వచ్చి ఒకరికి ఒకరు తమ రంగు స్టిక్కర్లను అతికించాల్సి ఉంటుంది. ఇందులో శివ, ముమైత్ కెప్టెన్లుగా ఉన్నారు. ఈ టాస్కులో ఎన్నో రకాల గొడవలు జరిగాయి.

శివ-నటరాజ్ రియల్ ఫైటింగ్
స్టిక్కర్ల టాస్కులో నటరాజ్ మాస్టర్ సరిగా ఆడడం లేదని చాలెంజర్స్ టీమ్ సభ్యులు సంచాలకుడిగా ఉన్న యాంకర్ శివకు కంప్లైంట్ చేశారు. దీంతో ఆ తర్వాత అతడు ‘స్టిక్కర్స్ అంటిస్తున్నప్పుడు మీరు చేయితో కిందికి లాగితో బాగోదు. మళ్లీ మళ్లీ అదే చెప్తున్నా చాలా' అంటూ నటరాజ్ మాస్టర్‌ని హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య రియల్ ఫైట్ జరిగిపోయింది.

ఏం పీకుతావు.. దమ్ముంటే రా
శివ హెచ్చరించగానే నటరాజ్ మాస్టర్ కంట్రోల్ తప్పిపోయాడు. ‘ఏయ్ చాలా చాలా అంటున్నావ్ ఏంటి? ఏం పీకుతావు? దమ్ముంటే రారా చూసుకుందాం' అంటూ మీద మీదకు వెళ్లాడు. ఓ సందర్భంలో ఒకరికి ఒకరు తగిలారు కూడా. శివ ఆ తర్వాత ‘పద్దతిగా మాట్లాడండి లేకుంటే నేనేంటో చూపిస్తా' అని వార్నింగ్ ఇచ్చాడు. చివరికి అఖిల్, ముమైత్ గొడవను ఆపారు.


Click it and Unblock the Notifications











