Bigg Boss Non Stopలో కొత్త లవ్ ట్రాక్.. ఈ సారి కూడా అతనికే సెట్ చేశారుగా!

బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే రెండు వారాల్లో పూర్తికాగా రెండు వారాలకు గాను మొదటి వారం ముమైత్ ఖాన్, రెండవ వారం శ్రీ రాపాక ఎలిమినేట్ అయి కూడా బయటకు వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం మూడో వారం విజయవంతంగా నడుస్తోంది ఇప్పుడు హౌస్ లో కొత్త ప్రేమ జంట పుట్టుకు వచ్చినట్టు తాజా ప్రోమోలో వెల్లడయింది. ఆ వివరాల్లోకి వెళితే...

 సాధారణం గానే

సాధారణం గానే


ముందు నుంచి కూడా బిగ్ బాస్ హౌస్ లోపల ప్రేమ వ్యవహారాలు అనేవి చాలా సాధారణం గానే ఉండేవి. బయటకు వచ్చాక ఎలా ఉంటారు అనే సంగతి పక్కన పెడితే హౌస్ లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ వెకిలి చేష్టలు, వాళ్ళ ప్రేమ వ్యవహారాలు చూడడానికి కూడా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. గత సీజన్లో ప్రేమపక్షులు ఎవరూ లేకపోవడంతో షణ్ముక్ జశ్వంత్, సిరి హనుమంతులకు ఆ టాస్క్ అప్పగించారు.

పులిహోర కలపడానికి

పులిహోర కలపడానికి


ఇద్దరికీ బయట ప్రేమ వ్యవహారాలు ఉండడంతో బయటకు వచ్చాక లోపల జరిగిన వ్యవహారాలను దెబ్బకు అవి కూడా పెటాకులు అయ్యాయి అనుకోండి అది వేరే విషయం. అయితే టీవీ విషయంలో కాస్త సెన్సార్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందికర సీన్లను ప్రసారం చేయలేదు కానీ ఇప్పుడు డిజిటల్ వేదికగా ప్రసారమవుతోంది కాబట్టి ఎక్కడ హద్దులు లేవు అనే చెప్పాలి. ఇప్పటివరకు యాంకర్ శివ పలువురు కంటెస్టెంట్ ల తో పులిహోర కలపడానికి ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు.

 గుచ్చుకున్నట్టుగా

గుచ్చుకున్నట్టుగా


ఇప్పుడు అనూహ్యంగా అఖిల్ అషు రెడ్డి మధ్య ప్రేమ వ్యవహారం మొదలైనట్లే కనిపిస్తుంది. నాకు ఎవరైనా నచ్చితే ఐ లైక్ యూ అని చెప్తాను అంటూ అషు రెడ్డి ముందు పులిహోర కలపడం మొదలుపెట్టాడు పులిహోర రాజా అఖిల్. ఇక అషురెడ్డి కూడా హీరోయిన్ లా ఫీల్ అయిపోతూ.. అఖిల్‌ని మరింత రెచ్చగొట్టేస్తుంది. ఇద్దరి మధ్య బిగ్ బాస్ లవ్ సాంగ్‌లు కూడా వేసేస్తున్నాడు. నేను అంటే నీకు గుచ్చుకుంటున్నాయా? అని అఖిల్ అంటే.. ఏమో నువ్వు అంటేనే గుచ్చుకున్నట్టుగా అనిపిస్తున్నాయి ఏమో అంటూ అషురెడ్డి ఓరగా చూడటం ఆసక్తికరంగా మారింది.

స్పెషల్ రూంలోకి వెళ్లి

స్పెషల్ రూంలోకి వెళ్లి


ఒకరకంగా ఈ ఇద్దరూ సీజన్ 5లో సిరి, షణ్ముఖ్‌ల మాదిరిగా స్పెషల్ రూంలోకి వెళ్లిపోయి మాట్లాడుకోవడం మొదలుపెట్టేశారు. అంతేకాదు.. టైటిల్ విన్నర్‌గా ఫీల్ అయిపోతున్న అఖిల్‌ని హౌస్‌లో ఉన్న వాళ్లలోనే ఫేక్ అని ఇంటి సభ్యులు ముద్ర వేయడంతో తెగ ఫీల్ అయిపోయింది అషు. అఖిల్‌ని బిగ్ బాస్ ఫేక్ అని ప్రకటించగానే వాట్ ది * అనేసింది. ఇద్దరు ముగ్గురు నిన్ను ఫేక్ అంటే నువ్ ఫేక్ అయిపోతావా? నువ్వేంటో అందరికీ తెలుసు.. అఖిల్ స్టామినా ఏంటో ప్రేక్షకులకు తెలుసు అంటూ అతనికి ధైర్యం చెప్పడం మొదలుపెట్టింది.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu
ప్రేమ పక్షులలా

ప్రేమ పక్షులలా


అఖిల్ ఫీల్ అవుతున్నాడు కానీ ఆయన కంటే ఎక్కువగా అషురెడ్డి ఫీల్ అయిపోవడాన్ని బట్టి చూస్తే.. ఈ జంట ప్రేమ పక్షులలా మరికొన్ని ఎపిసోడ్స్ లో కనిపించడం ఖాయమని అంటున్నారు. నిజానికి నాలుగో సీజన్ లో కూడా ఇదే అఖిల్ మోనాల్ ప్రేమలో మునిగితేలాడు. బయటకు వెళ్లిన తరువాత అంతా కామన్ అయిపొయింది అనుకోండి. అది వేరే విషయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X