Bigg Boss Non Stop: బిందు మాధవి త్యాగం వృథా.. అతడి వల్ల మరో ఇద్దరు బలి.. కొత్త నామినేషన్స్ ఇవే

తెలుగు బుల్లితెర చరిత్రలోనే రికార్డులకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన షో బిగ్ బాస్. అసలేమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. దీనికి ప్రేక్షకులు భారీ స్థాయిలో ఆదరణను అందించారు. ఫలితంగా చాలా తక్కువ సమయంలోనే సూపర్ డూపర్ హిట్‌ చేశారు. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను కంప్లీట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్‌ను కూడా ప్రారంభించారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఇది కూడా జనరంజకంగానే సాగుతోంది. మరీ ముఖ్యంగా నామినేషన్స్ మాత్రం మజాను పంచుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో నామినేషన్స్ టాస్కులో హైడ్రామా కనిపించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో చూద్దాం పదండి!

మరింత మజాను పంచుతోంది

మరింత మజాను పంచుతోంది


బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఎన్నో అంచనాల నడుమ గత నెలలో వైభవంగా ప్రారంభం అయింది. ఇది ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఇందులో గత సీజన్ల కంటే ఎక్కువగానే గొడవలు జరుగుతున్నాయి. అలాగే, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చతో ఈ సీజన్ అంతకంతకూ మజాను పంచుతూ ముందుకు సాగిపోతోంది.

4 వారాల్లో వీళ్లంతా ఎలిమినేట్

4 వారాల్లో వీళ్లంతా ఎలిమినేట్

ఈ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో నుంచి ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయులు బయటకు వెళ్లిపోయారు.

ఐదో వారంలో ఏడుగురు రాక

ఐదో వారంలో ఏడుగురు రాక

కంటెస్టెంట్ల మధ్య హై హీట్ ఫైటింగ్స్ మధ్య ఐదో వారం నామినేషన్స్ ప్రక్రియ ఎంతో రచ్చ రచ్చగా జరిగింది. ఇందులో కొందరు కొట్టుకున్నంత పని కూడా చేశారు. చివరికి బిందు మాధవి, మిత్రా శర్మ, ఆరియానా గ్లోరి, మహేశ్ విట్టా, యాంకర్ శివ, అషు రెడ్డి, అనిల్ రాథోడ్‌లు నామినేట్ అయ్యారు. దీంతో ఈ సారి ఎవరిని బలి చేయబోతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.

నామినేషన్స్‌లో రెండో లెవెల్

నామినేషన్స్‌లో రెండో లెవెల్

ఐదో వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్క్ సోమవారంతో ముగియలేదు. ఇందులో నామినేట్ అయిన ఏడుగురు సభ్యుల్లో ముగ్గురిని స్వైప్ అంటే మార్చుకునే మరో టాస్కును కూడా ఇచ్చాడు బిగ్ బాస్. ఇందుకోసం మూడు రౌండ్లు ఇచ్చాడు. ఇందులో గెలిచిన వాళ్లతో.. సేఫ్‌గా ఉన్న కంటెస్టెంట్లు నిర్ణయించుకుని తమ నుంచి ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది.

స్రవంతిని స్వైప్ చేసిన అషు

స్రవంతిని స్వైప్ చేసిన అషు

కంటెస్టెంట్లను స్వైప్ చేసుకునే మొదటి రౌండ్‌లో భాగంగా.. నామినేట్ అయిన వాళ్లందరూ నీటి బుడగలను పట్టుకుని ఉండాలి. చివరి వరకూ ఎవరి దగ్గర బెలూన్ ఉంటుందో వాళ్లు గెలిచినట్లు. ఈ టాస్కులో అషు రెడ్డి విజయం సాధించింది. దీంతో సేఫ్‌గా ఉన్న కంటెస్టెంట్లు అందరూ కలిసి స్రవంతిని నామినేట్ చేశారు. దీంతో అషు బదులు ఆమె నామినేషన్స్‌లోకి వెళ్లిపోయింది.

బిందు త్యాగం.. తేజస్వీ బుక్

బిందు త్యాగం.. తేజస్వీ బుక్


రెండో రౌండ్‌లో భాగంగా ఓ పెయింట్ బాక్స్‌లో తమ పుట్‌వేర్‌ను ఎవరైతే ఎక్కువగా ముంచేస్తారో వాళ్లు సేఫ్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో ఆరియానా 11 జతలు ముంచుతానని అనగా.. బిందు 12 వేస్తానని చెప్పింది. ఆఖరికి ఆరియానాను ఒప్పించి 6 జతలు మాత్రమే వేసి టాస్క్ గెలిచింది. దీంతో బిందును సేఫ్ చేసి.. తేజస్వీ మదివాడను నామినేట్ చేసేశారు.

మళ్లీ బిందునే.. ఎవరెవరంటే

మళ్లీ బిందునే.. ఎవరెవరంటే

చివరి రౌండ్‌లో భాగంగా నామినేషన్స్‌లో ఉన్న వాళ్లకు బలాన్ని నిరూపించుకునే టాస్క్ ఇవ్వగా.. ఇందులో మహేశ్ గెలిచాడు. దీంతో సేఫ్ అయిన వాళ్ల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో నటరాజ్ తన సొంత నిర్ణయంతో బిందును నామినేట్ చేశాడు. దీంతో ఈ వారం బిందు, మిత్రా శర్మ, ఆరియానా, తేజస్వీ, యాంకర్ శివ, స్రవంతి, అనిల్ రాథోడ్‌లు నామినేట్ అయినట్లైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X