Bigg Boss Nominations: ఊహించని విధంగా నామినేషన్స్.. టైటిల్ ఫేవరెట్లకు షాక్.. వాళ్లంతా డేంజర్‌లోనే!

చాలా అనుమానాల మధ్య తెలుగు బుల్లితెరపైకి పరిచయం అయినా.. చాలా అంటే చాలా తక్కువ సమయంలోనే సక్సెస్‌ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. కొత్త కాన్సెప్టుతో నడిచేదే అయినా దీనికి ప్రేక్షకులు భారీ స్థాయిలో స్పందనను అందించారు. ఫలితంగా దేశంలోనే ఇది నెంబర్ వన్ షోగా మారిపోయింది. ఈ జోష్‌లోనే ఏకంగా ఐదు సీజన్లను పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను ప్రారంభించారు. ఇది కూడా ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఫలితంగా ప్రేక్షకులకు మజాను అందిస్తోంది. ఇక, నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్‌ ప్రక్రియ ఎలా జరిగింది? ఎవరు నామినేట్ అయ్యారు? అనేవి తెలుసుకుందాం పదండి!

ఒకరోజు లేట్.. మజా అందిస్తూ

ఒకరోజు లేట్.. మజా అందిస్తూ

ఓటీటీ వెర్షన్ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్‌ ఎన్నో అంచనాలతో ఫిబ్రవరి 26న అంగరంగ వైభవంగా మొదలైంది. ఇది మొత్తం 84 రోజుల పాటు ప్రసారం కానుంది. దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం చేస్తున్నారు. అయితే, మధ్యలో 24 గంటల పాటు షో మొత్తం ఆపేసి.. ఒకరోజు ఆలస్యంగా దీన్ని స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇది మొదటి నుంచే మజాను పంచుతోంది.

17 మందిలో ముగ్గురు అవుట్

17 మందిలో ముగ్గురు అవుట్

బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో 3 వారాల్లో ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూలు ఎలిమినేట్ అయ్యారు.

దీనిపై అందరిలోనూ ఆసక్తి

దీనిపై అందరిలోనూ ఆసక్తి

బిగ్ బాస్ షో అంతటిలో ఎన్నో టాస్కులు.. మరెన్నో చిత్ర విచిత్రమైన పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అయితే, అన్నింటి కంటే ఎంతో ముఖ్యమైన ఘట్టం నామినేషన్స్ ప్రక్రియే. వారం మొదలైన రోజు అంటే ప్రతి సోమవారం దీన్ని ప్రసారం చేస్తుంటారు. నాన్ స్టాప్ సీజన్‌లో ఊహించని ఎలిమినేషన్స్ జరుగుతుండడంతో ఈ వారం నామినేషన్స్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది.

ఈ వారం నామినేషన్స్ ఇలా

ఈ వారం నామినేషన్స్ ఇలా

నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ లారీ, హారన్‌ టాస్క్‌ ద్వారా నిర్వహించారు. ఇందులో భాగంగా లారీ హారన్‌ సౌండ్‌ మోగినప్పుడు ఎవరైతే ముందుగా బజర్‌ నొక్కుతారో వారికి ఇద్దరిని నామినేషన్‌ చేసే అవకాశం లభిస్తుంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరిని ఫైనల్‌గా నామినేట్‌ చేయాలన్నది మాత్రం ఇంటి సభ్యులు నిర్ణయిస్తారని బిగ్ బాస్ వెల్లడించాడు.

నటరాజ్, మహేశ్ 3 ఛాన్స్‌లు

నటరాజ్, మహేశ్ 3 ఛాన్స్‌లు

నాలుగో వారం నామినేషన్స్ టాస్కులో భాగంగా హాల్‌లో ఉన్న హారన్‌ను నటరాజ్ మాస్టర్, మహేశ్ విట్టా మూడు సార్లు అందుకున్నారు. దీంతో వీళ్లు ఇద్దరిని నామినేట్ చేసే అవకాశాన్ని మూడుసార్లు పట్టేశారు. నటరాజ్ మాస్టర్ తనకు యాంటీగా ఉన్న బిందు మాధవి, యాంకర్ శివను టార్గెట్ చేశాడు. మహేశ్ విట్టా మాత్రం స్నేహితులుగా ఉండే ఇద్దరిని ఎంపిక చేశాడు.

శివ టార్గెట్.. బాడీ షేమింగ్‌తో

శివ టార్గెట్.. బాడీ షేమింగ్‌తో

ఈ టాస్కులో భాగంగా నటరాజ్ మాస్టర్ మూడు సార్లు యాంకర్ శివను నామినేట్ చేశాడు. కానీ, అన్ని సార్లూ అతడు తప్పించుకున్నాడు. చివర్లో మాత్రం నామినేట్ అయ్యాడు. ఇక, ఈ ప్రక్రియలో ఆరియానా గ్లోరీ, సరయు రాయ్ మధ్య బాడీ షేమింగ్ గురించి పెద్ద గొడవ జరిగింది. ఇద్దరూ ఏమాత్రం తగ్గకుండా గొడవ పడ్డారు. అయితే, ఎక్కువ మంది ఆరియానాకే మద్దతు ప్రకటించారు.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu
ఈ వారం నామినేషన్స్ లిస్టు

ఈ వారం నామినేషన్స్ లిస్టు

ఎన్నో గొడవలు, ఊహించని పరిణామాల మధ్య నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ఇందులో కొందరు త్యాగాలు కూడా చేశారు. చివరికి బిందు మాధవి, మిత్రా శర్మ, ఆరియానా గ్లోరి, సరయు రాయ్, యాంకర్ శివ, అజయ్, అనిల్ రాథోడ్‌లో నామినేట్ అయ్యారు. ఇందులో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది మాత్రం ఇప్పటి నుంచే ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X