Bigg Boss Non Stop Nominations: చిచ్చుపెట్టిన నటరాజ్ మాస్టర్.. యాంకర్ శివకు, బిందుమాధవి దెబ్బ!
బిగ్ బాస్ మూడు వారాల ఎలిమినేషన్స్ అనంతరం ఇప్పుడు నాలుగో వారం ఎలిమినేషన్ కు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు బిగ్ బాస్ ఎలిమినేషన్స్ లో అయితే ఎవరు ఊహించని విధంగా దారుణమైన ట్విస్టులు ఇచ్చాడు. బలమైన కంటెస్టెంట్స్ ను బయటకు పంపించి అవసరం లేని వాళ్ళని ఇంట్లో పెట్టుకున్నారని కామెంట్స్ గట్టిగానే వస్తున్నాయి. ఇక ఈ వారం ఎవరు వెళ్లిపోతారు? అనే విషయంలో కూడా అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక యాంకర్ శివ ఈ వారం టార్గెట్ అయ్యే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. ఆఖరికి బిందు మాధవి కూడా అతనిపై నెగిటివ్ కామెంట్స్ చేసింది. ఇక రీసెంట్ గా విడుదలైన ప్రోమో వివరాల్లోకి వెళితే..

లారీతో నామినేషన్స్
ఈ వారం నామినేషన్ ప్రక్రియకు సమయం ఆసన్నమైంది. ఈసారి బిగ్ బాస్ మూడు స్టెప్పులలో నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు. ఇక గార్డెన్ ఏరియాలో ఒక లారీని సెట్ చేసిన బిగ్ బాస్ హారన్ సౌండ్ వచ్చినప్పుడు లివింగ్ రూమ్ లో ఉన్న హారన్ ను మొదట పట్టుకున్న వ్యక్తి లారీ డ్రైవర్ గా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక ఆ తరువాత తగిన కారణాలు చెప్పి అతను ఇద్దరిని నామినేషన్స్ కోసం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం మిగతా ప్యాసింజర్స్ తగిన కారణాల చెప్పి ఆ ఇద్దరిలో ఒకరిని నామినేట్ కోసం ఎంచుకోవాల్సి ఉంటుంది.

డేంజర్ జోన్ లో యాంకర్ శివ
ఈ క్రమంలో నటరాజ్ మాస్టర్ అనుకున్నట్లే తన విరోధిని డేంజర్ జోన్ లో పడేసే ప్రయత్నం చేశాడు. ఇక అతను ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుగా యాంకర్ శివ, హీరోయిన్ బిందు మాధవిని ట్రాక్ లోకి తీసుకు వచ్చాడు. ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేషన్ లోకి వెళతారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక బిందు మాదవి మొన్నటివరకు అతనితో చాలా ఫ్రెండ్లీగా ఉండగా ఇప్పుడు నామినేషన్ కు వచ్చే సరికి ఆమె మాట మార్చేసింది..

బిందు మాధవి నెగిటివ్ కామెంట్స్
శివను ఎందుకు నామినేట్ చేయాలి అంటే అతను చాలా సెల్ఫిష్ అంటూ ఎప్పుడు కూడా తన గురించే ఆలోచిస్తాడు అని తను అనుకున్నదే జరగాలి అంటాడు అని బిందు మాధవి కరెక్ట్ గానే చెప్పేసింది. ఇక ఆమె చెప్పినధాన్ని బట్టి యాంకర్ శివ అవును నా గేమ్ నేను సొంతంగా ఆలోచించుకోవాలి అని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. ఇక ర్యాపో నాకు ఎక్కువగా శివతోనే ఉందని అరియానా చెప్పగా.. అతను ఒక లైన్ చెబితే ఒప్పుకోడు అని సరయు చెప్పింది. ఇక తేజస్వి నీ స్టాండ్ నువ్వు తీసుకోవాలి కాదా అని అన్నప్పుడు బిందు మాదవి అందుకు ఒప్పుకొని నేను సేఫ్ అవుతాను అని ధీమా వ్యక్తం చేసింది.
చెల్లిలా తీలుకోవడం లేదని..
ఇక యాంకర్ శివ, మిత్ర శర్మ మధ్యలో కూడా వాదోపవాదాలు నడిచాయి. నేను అన్నయ్య అంటే అతను నన్ను చెల్లిలా తీలుకోవడం లేదని అతని మీద తనకు నమ్మకమే వద్దని తేల్చి చెప్పింది. ఇక హామీదా సైతం అతను చేంజ్ అవ్వడం నచ్చడం లేదని అనగా అషు రెడ్డి మాత్రం మిత్ర జీరో నుంచి 100కు చేంజ్ అయ్యింది అని మద్దతు ఇచ్చింది. ఇక అవసరమైన టైమ్ లో అనిల్ సైలెంట్ గా ఉంటాడు అని శివ చెప్పగా అందుకు అనిల్ తనను ఎవరైనా అడిగితే తప్పకుండా ఆన్సర్ ఇస్తాను అని అనవసరంగా మాట్లాడను అని శివతో చెప్పుకొచ్చాడు.
Recommended Video


మనసులో ఉన్నది బయటకు రావాలి..
ఇక హామీదా ఒక కారణం, అఖిల్ మరొక కారణంతో వివిద రకాలుగా మాట్లాడుతూ ఉండడంతో నటరాజ్ మాస్టర్ మరో డైలాగ్ తో షాక్ ఇచ్చాడు. అందరూ మనసులో ఒకటి అనుకోని బయటకు మరొకటి మాట్లాడుతున్నారు అని.. అలా కాకుండా మనసులో ఉన్నది బయటకు రావాలి అని.. వచ్చి తీరాలి అని నటరాజ్ మాస్టర్ బల్లగుద్ది చెప్పాడు. మరి ఈ వారం ఎలిమినేషన్ లో ఎవరెవరు డేంజర్ జోన్ లోకి వెళతారో చూడాలి.


Click it and Unblock the Notifications











