Bigg Boss Non Stop: నామినేషన్స్‌లో బిగ్ ట్విస్ట్.. ఆ కంటెస్టెంట్లకు బంపర్ ఆఫర్.. బలైన లేడీ యాంకర్

ఎన్నో అనుమానాలు.. మరెన్నో ఊహాగానాల నడుమ తెలుగు బుల్లితెరపైకి వచ్చి.. అతి తక్కువ సమయంలోనే సక్సెస్‌ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. పేరుకు కొత్త కాన్సెప్టుతో నడిచేదే అయినా దీనికి ప్రేక్షకులు భారీ రెస్పాన్స్ అందించారు. ఫలితంగా దేశంలోనే ఈ షో నెంబర్ వన్ షోగా మారిపోయింది. ఈ జోష్‌లోనే ఏకంగా ఐదు సీజన్లను పూర్తి చేసుకున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను ఆరంభించారు. ఇది కూడా మొదటి నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఫలితంగా ప్రేక్షకులకు మజాను పంచుతోంది. ఇక, ఐదో వారానికి సంబంధించిన నామినేషన్స్‌ ప్రక్రియలో తాజాగా బిగ్ ట్విస్ట్ కనిపించింది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

నాన్ స్టాప్‌గా ఎంటర్‌టైన్‌మెంట్

నాన్ స్టాప్‌గా ఎంటర్‌టైన్‌మెంట్

ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ మూడు వారాల క్రితమే స్టార్ట్ అయింది. నమ్మకాలకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా నడుస్తోంది. ఇందులో గత సీజన్ల కంటే ఎక్కువగానే గొడవలు కనిపిస్తున్నాయి. అలాగే, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చతో ఈ సీజన్ అంతకంతకూ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూనే ఉంది.

17 మందిలో నలుగురు అవుట్

17 మందిలో నలుగురు అవుట్

తాజా సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో నుంచి ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయులు ఎలిమినేట్ అయ్యారు.

అన్నింటి కంటే దీనికే ఎక్కువ

అన్నింటి కంటే దీనికే ఎక్కువ

ఈ రియాలిటీ షోలో ఎన్నో టాస్కులు.. మరెన్నో చిత్ర విచిత్రమైన పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అయితే, అన్నింటి కంటే ఎంతో ముఖ్యమైన ఘట్టం నామినేషన్స్ ప్రక్రియే. వారం మొదలైన రోజు అంటే ప్రతి సోమవారం దీన్ని ప్రసారం చేస్తుంటారు. నాన్ స్టాప్ సీజన్‌లో ఊహించని ఎలిమినేషన్స్ జరుగుతుండడంతో ఐదో వారం నామినేషన్స్‌పై అందరూ దృష్టి సారించారు.

ఐదో వారలో కూడా ఏడుగురు

ఐదో వారలో కూడా ఏడుగురు

ఎన్నో గొడవలు, ఊహించని పరిణామాల మధ్య ఐదో వారం నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ఇందులో కొందరు కొట్టుకున్నంత పని చేశారు. చివరికి బిందు మాధవి, మిత్రా శర్మ, ఆరియానా గ్లోరి, మహేశ్ విట్టా, యాంకర్ శివ, అషు రెడ్డి, అనిల్ రాథోడ్‌లో నామినేట్ అయ్యారు. ఇందులో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది మాత్రం ఇప్పటి నుంచే ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పొచ్చు.

నామినేషన్స్‌లో బిగ్ ట్విస్టుతో

నామినేషన్స్‌లో బిగ్ ట్విస్టుతో

ఐదో వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్క్ సోమవారంతో ముగియలేదు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో నామినేట్ అయిన ఏడుగురు సభ్యుల్లో ఒకరిని స్వైప్ అంటే మార్చుకునే మరో టాస్కును కూడా ఇచ్చాడు బిగ్ బాస్. ఫలితంగా ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురు సభ్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు అయింది.

బెలూన్ దాచుకో.. సేఫ్ అయిపో

బెలూన్ దాచుకో.. సేఫ్ అయిపో

నామినేషన్స్‌లో లేని కంటెస్టెంట్‌ను స్వైప్ చేసుకునే ప్రక్రియలో భాగంగా.. సోమవారం నామినేట్ అయిన కంటెస్టెంట్లకు నీటితో కూడిన బెలూన్లను ఇచ్చారు. అందులో ఎవరైతే చివరి వరకూ తమ బెలూన్‌ను కాపాడుకుంటారో వాళ్లు.. నామినేట్ అవని కంటెస్టెంట్ల నుంచి ఒకరిని స్వైప్ చేసుకోవచ్చని చెప్పారు. తద్వారా నామినేషన్స్ నుంచి తప్పించుకోవచ్చని వెల్లడించాడు.

టాస్కులో ఆమె బుక్కైందట

టాస్కులో ఆమె బుక్కైందట

తాజాగా వచ్చిన ప్రోమోలో యాంకర్ శివ ఆరియానా, మిత్రా శర్మ బెలూన్లను పగలకొట్టాడు. ఆ తర్వాత అతడి బెలూన్ కూడా పగిలింది. బిందు, అనిల్ బెలూన్లను ఆరియానా పగలగొట్టింది. చివర్లో అషు రెడ్డి బెలూన్‌ను మహేశ్ విట్టా కొట్టాడు. ఈ క్రమంలోనే కొన్ని గొడవలు జరిగాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ వారం నామినేషన్స్‌లోకి స్రవంతి చోకారపును స్వైప్ చేశారని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X