Bigg Boss Non Stop: ఆరియానా, అషు రెడ్డికి రాంగోపాల్ వర్మ షాక్.. వీళ్లిద్దరినీ కాదని ఆమెకు సపోర్ట్
టాలీవుడ్ నుంచి దర్శకుడిగా పరిచయమై.. దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్నాడు రాంగోపాల్ వర్మ. తెలుగు సినీ ఇండస్ట్రీలో పెట్టుకున్న సరిహద్దులను తన సినిమాలతో చెరిపేసిన ఆయన.. ప్రత్యేకమైన ఇమేజ్‌తో బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. దీంతో దిగ్గజ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే, ఇదంతా గతం అయిపోయింది. ఇప్పుడీ దర్శకుడు తన పంథాను పూర్తిగా మార్చుకుని చిత్ర విచిత్రమైన సినిమాలు చేస్తున్నాడు. అదే సమయంలో అమ్మాయిలతో రచ్చ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోను కూడా చూస్తున్నాడు. గతంలో అషు రెడ్డి, ఆరియానాకు సపోర్ట్ చేసిన ఆర్జీవీ.. ఇప్పుడు మరో వీళ్లిద్దరినీ కాదని మరొకరికి మద్దతు ప్రకటించాడు. ఆ సంగతులు మీకోసం!

బిగ్ బాస్ షోపై ఆర్జీవీ విమర్శలు
గతంలో బిగ్ బాస్ షోపై రాంగోపాల్ వర్మ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'బిగ్ బాస్ అంటే ఏంటి? అది షోనా లేకపోతే ఏమైనానా? హిందీలో అప్పుడెప్పుడో ఎవరో అంటే విన్నాను. ఇది తెలుగులో కూడా మొదలైందా.? అసలు దాని గురించి నాకు కొంచెం కూడా తెలీదు. నేనెప్పుడూ చూడలేదు కూడా' అంటూ సెటైర్లు వేశాడు.

ఆమెకు మద్దతు... షో చూస్తానని
అసలు బిగ్ బాస్ షో అంటేనే తెలియదు అని చెప్పిన దర్శకుడు రాంగోపాల్ వర్మ... నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న ఆరియానా గ్లోరీకి మద్దతుగా ఓ ట్వీట్ చేశాడు. 'అందరూ ఓట్ చేసి ఆరియానాను గెలిపించండి. ఈమె మాత్రమే బిగ్ బాస్‌లో గెలవడానికి అర్హురాలు' అంటూ అందులో పేర్కొన్నారాయన. ఆ తర్వాత నుంచి షో చూస్తున్నానని కూడా చెప్పుకొచ్చాడు.

బిగ్ బాస్ బ్యూటీలతో కలిసి రచ్చ
రాంగోపాల్ వర్మ తరచూ అమ్మాయిలతో కనిపిస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే ఇటీవలే ఆరియానా గ్లోరీతో ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేశాడు. ఇది అప్పట్లో సంచలనం అయింది. ఆ తర్వాత అషు రెడ్డితో కలిసి చాట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా హాట్ టాపిక్ అయిపోయింది. ఈ ఇద్దరితో వర్మ చేసిన చిట్ చాట్‌తో వాళ్లపైన కూడా భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో ఆ ఇద్దరు
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఎంతో గ్రాండ్‌గా మొదలైంది. ఇందులోకి మొత్తం 17 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో తొమ్మిది మంది పాట కంటెస్టెంట్లు.. మిగిలిన వాళ్లు తొలిసారి హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఇలా వచ్చిన వారిలో బోల్డు బ్యూటీలు అషు రెడ్డి, ఆరియానా గ్లోరి కూడా ఉన్నారు. ఆరంభంలోనే తమదైన ఎంట్రీతో వీళ్లిద్దరూ బాగా ఫోకస్ అయిపోయారు.

మరోసారి రాంగోపాల్ వర్మ ట్వీట్
బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలోకి రాంగోపాల్ వర్మ అమ్మాయిలుగా పేరొందిన వాళ్లు వస్తున్నారు. ప్రతి సీజన్‌లోనూ ఎవరో ఒకరు ఇలా ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో వాళ్లే బోల్డుగా వ్యవహరిస్తూ హైలైట్ అవుతున్నారు. ఫలితంగా ఈ సంచలన దర్శకుడు కూడా తరచూ వాళ్లకు మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేయడమో.. కామెంట్లు చేయడమో చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు మరోసారి స్పందించాడు.

ఆరియానా, అషు రెడ్డికి వర్మ షాక్
ఓటీటీ మొదటి సీజన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్'ను ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభించారు. ఆటపాటలతో అంగరంగ వైభవంగా సాగిన ప్రారంభ ఎపిసోడ్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది మొత్తం 84 రోజుల పాటు సాగబోతుంది. ఇందులో కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చిన అషు రెడ్డి, ఆరియానా గ్లోరికి తాజాగా రాంగోపాల్ వర్మ కోలుకోలేని షాక్ ఇచ్చాడు.

వీళ్లిద్దరినీ కాదని ఆమెకు మద్దతు
బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీ రాపాకకు మద్దతు తెలుపుతూ తాజాగా రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ మేరకు ఓ వీడియోను కూడా షేర్ చేశాడు. దీంతో ఆరియానా, అషు రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చినట్లైంది. అన్నట్లు శ్రీ రాపాక రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన 'నగ్నం' అనే సినిమాతోనే భారీగా పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











