For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop : విభేదాలతో రచ్చ.. అఖిల్-అజయ్ మధ్య ముసలం.. ఎత్తి విసిరేసిన హమీదా!

  |

  బిగ్ బాస్ నాన్ స్టాప్ ఆసక్తికరంగా సాగుతోంది. 24 గంటల పాటు లైవ్ స్ట్రీమింగ్ చూడకపోయినా రోజు ప్రసారం అయ్యే గంట ఎపిసోడ్ చూసి ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో మీద ప్రేక్షకులలో అంతగా ఆసక్తి చూపించకపోయినా చూసే వాళ్ళు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది అని అంటున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో ఆసక్తికరమైన దృశ్యాలను బిగ్ బాస్ నిర్వాహకులు చూపించారు.. ముందు నుంచి స్నేహంగా మెలుగుతున్న అజయ్, అఖిల్ మధ్య దూరం పెరిగింది. యాంకర్ శివ మళ్లీ రెచ్చిపోయాడు. అరియనా కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది.. వివరాల్లోకి వెళితే

  ప్రోమోలో

  ప్రోమోలో

  బిగ్ బాస్ హౌస్ స్నేహితులను చేసుకోవడానికే కాదు ఉన్న స్నేహాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి కూడా పరిస్థితులు కల్పిస్తుంది. రాబోయే ఎపిసోడ్‌లో, అజయ్ కతుర్వార్, అఖిల్ సార్థక్ మధ్య విభేదాలు ఆసన్నమైనట్టే కనిపిస్తున్నాయి. తాజా ప్రోమోను పరిశీలిస్తే, అజయ్ మరియు అఖిల్ తమ తమ టీమ్ సభ్యులతో తమ విభేదాలను పంచుకుంటున్నారు. అఖిల్ గేమ్‌లోకి స్నేహాన్ని తీసుకువస్తున్నాడని అజయ్ ఫిర్యాదు చేయడాన్ని మనం ప్రోమోలో చూడవచ్చు.

  స్నేహం తీసుకు రావద్దు

  స్నేహం తీసుకు రావద్దు

  గేమ్స్ నాతో ఆడు నా ఎమోషన్స్ తో వద్దు అంటూ అఖిల్ చెబుతూ ఉండగా, నన్ను ఏదో డైవర్ట్ చేయడానికి నాకు ఏదో నరం పట్టుకుంటుంది అని చెప్పవద్దు అని చెబుతూ ఉండడం కనిపించింది. కాసేపటికి స్రవంతి అజయ్ దగ్గరకు వెళితే అజయ్ కూడా తన బాధ వ్యక్తం చేస్తున్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని, ఆట మధ్యలో స్నేహం తీసుకు రావద్దు అని వంద సార్లు చెప్పాను అని అజయ్ చెబుతున్నారు. అఖిల్ మాత్రం నాకు బూతులు వస్తాయి వెళ్లిపో అని చెప్పాను అని స్రవంతితో చెబుతున్నాడు.

  వాగ్వాదానికి దిగి

  వాగ్వాదానికి దిగి

  ఇష్టం ఉన్నట్లు మాటలు అంటే ఎవరు పడతారు? ఎమోషన్స్ తో ఆడుకునే అంత ఆట అది? అని ఆజాను ప్రశ్నిస్తూ ఉండగా అఖిల్ మంచం మీద ఒక్కడే కూర్చుని బాధపడడం కనిపిస్తోంది.

  ఆ తర్వాత టాస్క్ లో భాగంగా సరయు చెక్ పోస్ట్ దాటుతున్న సమయంలో అటుగా వచ్చిన యాంకర్ శివ తన చేత్తో ఒక బొమ్మ కింద పడవేసి సరయు చెక్ పోస్ట్ దాటుతుంటే ఒక బొమ్మ దొరికిందని, దాన్ని సీజ్ చేశానని చెబుతూ వెళ్లడం కనిపిస్తుంది. దానికి సరయు కెమెరా చూస్తోంది బ్రో అంటూ అనడంతో పోలీసుల బృందం అంతా ఏకమై స్మగ్లర్ల బృందంతో వాగ్వాదానికి దిగినట్టు కనిపిస్తుంది.

  గట్టిగా అరుస్తూ

  మనుషులు వచ్చినప్పుడు ఒకటి పడుతుంది వెళ్ళినప్పుడు ఒకటి పడుతుంది అంటూ శివ తన గేమ్ స్ట్రాటజీ మొదలుపెట్టడంతో శివని చూస్తూ అసలు ఇతను పోలీసా? దొంగా? నాకు అర్థం కావడం లేదు అంటూ అషూ రెడ్డి ఆశ్చర్యపోతుంది. బొమ్మలు చెక్ పోస్ట్ దాటడం లేదు పోలీసు వాళ్ళు జేబులో పెట్టుకొని వాటిని తీసి బయట వేస్తున్నారు అంటూ అరియనా చెబుతూ ఉండటంతో అదే సమయంలో వేరే ఎవరో మాట్లాడుతూ ఉండడంతో ఆమె కెమెరా ముందు గట్టిగా అరుస్తూ రెచ్చి పోయింది.

  ఎత్తి విసిరికొట్టి

  ఎత్తి విసిరికొట్టి

  ఆ తర్వాత హమీద చైతు మధ్య గొడవ జరిగింది. చైతు ప్రవర్తన నచ్చకపోవడంతో హమీద తన మేకప్ కిట్ ఎత్తి విసిరికొట్టింది. ఆ తర్వాత సరయు శివ బట్టలు ముట్టుకోవడానికి ప్రయత్నించడంతో రెచ్చిపోయిన శివ నువ్వు నా మీద నిందలు వేశావు, అలాంటి దానివి నా బట్టలు ముట్టుకునే అధికారం నీకు లేదు అంటూ ఆమె మీద గట్టిగా ఫైర్ అయ్యాడు.

  ఇక్కడితో మొదటి లెవెల్ పూర్తయిందని చెప్పిన బిగ్ బాస్ ఇప్పటివరకు స్మగ్లర్లుగా వ్యవహరించిన వారియర్స్ పోలీసులుగా పోలీసులుగా వ్యవహరించిన చాలెంజర్లు స్మగ్లర్లుగా మారాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ టాస్క్ లో పగ తీర్చుకోవడం కోసం వారియర్స్ ప్రయత్నిస్తున్నారు అని చెప్పవచ్చు

  English summary
  Rift started between Ajay Kathurvar and Akhil Sarthak In Bigg Boss Non Stop.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X