Bigg Boss Non Stop : మూడో వారం ఊహించని ఎలిమినేషన్.. కప్పు కొడతాడు అనుకుంటే అనూహ్యంగా బయటకు?
బిగ్ బాస్ మూడో వారం చివరికి చేరింది. మొదటి రెండు వారాల్లో ఎవరూ ఊహించని విధంగా ఇద్దరు లేడీ కంటెస్టెంట్లు ఇంట్లో నుంచి ఎలిమినేట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సారి ఎవరు ఎలిమినేట్ అయి వెళ్లనున్నారు అనే విషయం ఎప్పటిలాగే లీక్ అయింది. ఆదివారం నాడు టెలికాస్ట్ అవనున్న ఈ ఎపిసోడ్ షూట్ పూర్తి అయింది. దీంతో ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే విషయం బయటకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

చర్చనీయాంశం
బిగ్ బాస్ లో మొదటి వారం వారియర్స్ లో ఒక కంటెస్టెంట్ అయిన ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత వారం కూడా గ్లామరస్ బ్యూటీ శ్రీ రాపాక ఎలిమినేట్ అవ్వడం కూడా అందరికీ షాక్ సీన్ చెప్పాలి. ఎందుకంటే ఇద్దరూ అమ్మాయిలు, మంచి హాట్ కంటెంట్ ఇవ్వడానికి స్కోప్ ఉన్నవారిని పంపేయడం చర్చనీయాంశం అయింది.

12 మందిని డేంజర్ జోన్ లో
ఆ సంగతి పక్కన పెడితే ఇక ఈ వారం ఏకంగా ఎలిమినేషన్ కోసం 12 మంది నామినేషన్ లిస్ట్ లోకి రప్పించడం హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 12 మందిని డేంజర్ జోన్ లో పడేశారు. ఒక విధంగా ఎక్కువ స్థాయిలో ఓటింగ్ రావడం కోసం బిగ్ బాస్ ఈ విధంగా స్ట్రాటజీ అమలు చేశారని ప్రచారం జరిగింది. ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న 12 మందిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చర్చనీయాంశంగా మారింది.

అందరికంటే టాప్ లో
ముందు నుంచి సోషల్ మీడియాలో అందుబాటులో వచ్చిన ఓటింగ్ వివరాల్లోకి వెళితే లిస్ట్ లో బిందు మాధవి అందరికంటే టాప్ లో ఉంది. ఆమె తరువాత అఖిల్ సార్ధక్ రెండవ స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరి మధ్య పోటీ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రతి విషయంలో అయితే ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. వీరి తర్వాత మిగతా కంటెస్టెంట్స్ కూడా ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో టాక్
ఇక ఓటింగ్ లో బిందు మాధవి అనంతరం అఖిల్ సార్ధక్, యాంకర్ శివ, అరియానా, మిత్రశర్మ, తేజస్వి, నటరాజ్, అజయ్, కొనసాగుతున్నారు. చైతు కెప్టెన్ కాబట్టి అతను ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యాడని అందరూ అనుకున్నారు. కానీ షాకింగ్ రీతిలో అతనినే బిగ్ బాస్ యాజమాన్యం ఎలిమినేట్ చేసిందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది

అనూహ్యంగా
గేమ్ లో ఎంత జెన్యూన్ గా ఉన్నా సోషల్ మీడియా ఫాలోయింగ్ వల్లే ఓటింగ్ అనేది జరుగుతోంది. ఎంత ఫాలోవర్స్ ఉన్నా ఫాలోవర్స్ ఉన్న వాళ్లు సేఫ్ అవుతున్నారా ? అంటే లేదంటే చెప్పాలి. ఎవరూ ఊహించని విధంగా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిపోతున్నారు. ఈ వారం మిత్రాశర్మా, లేదా స్రవంతి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వచ్చేయచ్చు అని అందరూ అంచనా వేస్తె అనూహ్యంగా చైతూ ఎలిమినేట్ అయ్యాడని అంటున్నారు. .


Click it and Unblock the Notifications











