twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Non Stop ఫైనల్ లిస్టులో సెలబ్రిటీల పేర్లు.. క్వారంటైన్‌లోకి కంటెస్టెంట్లు.. షో ప్రారంభ ఎప్పుడంటే?

    |

    తెలుగు బుల్లితెరపై గత ఐదు సీజన్లుగా ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్న బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సరికొత్త ఫార్మాట్‌తో ప్రేక్షకులకు చేరువ కానున్నది. బిగ్‌బాస్ రియాలిటీ షోను తొలిసారి ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై 24 గంటలపాటు స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇందుకోసం సెలబ్రిటీల ఎంపిక, షో కోసం ఇంటి నిర్మాణం, ఇతర ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    Bigg Boss OTT Telugu : Contestants List Updates, Starting Date | Filmibeat Telugu
    అన్నపూర్ణ స్టూడియోలోనే సెట్

    అన్నపూర్ణ స్టూడియోలోనే సెట్

    బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ షోకు సర్వం సిద్దమైంది. ఎప్పటి మాదిరిగానే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వేదిక కానున్నది. ఈ షో ప్రారంభించేందుకు నిర్వాహకులు పూర్తిస్థాయి తలమునకలై ఉన్నారు. ఈ షోకు సంబంధించిన లోగోను ఇటీవలే ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థ డీస్నీ+హాట్‌స్టార్ తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ షోకు సంబంధించిన ట్రైలర్‌ను కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం.

    బిగ్‌బాస్ ఓటీటీలోకి వెళ్లే సెలబ్రిటీల జాబితా

    బిగ్‌బాస్ ఓటీటీలోకి వెళ్లే సెలబ్రిటీల జాబితా

    ఇక బిగ్‌బాస్ నాన్ స్టాప్ షో కోసం సెలబ్రిటీల ఎంపిక కూడా పూర్తయింది. తొలి ఓటీటీ షో కోసం ఎంపిక చేసిన జాబితాలో అరియానా గ్లోరి, మహేష్ విట్టా, యాంకర్ స్రవంతి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, నటుడు అజయ్ కథువా, 7 ఆర్ట్స్ సరయూ, సిరి హన్మంతు బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్, మెహబూబ్ దిల్‌సే, అఖిల్ సార్థక్, శ్వేతా వర్మ, వింధ్యా మేడపాటి, నవ్యస్వామి, యాంకర్ వర్ష్, మౌనిక రెడ్డి తదితరులు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

    నాగార్జున అక్కినేని హోస్ట్‌గా

    నాగార్జున అక్కినేని హోస్ట్‌గా


    అలాగే బిగ్‌బాస్ తెలుగు షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున అక్కినేని ఓటీటీ ఫార్మాట్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తారు. తొలి ఓటీటీ షో ప్రారంభ వేడుకను గ్రాండ్‌గా ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేదికపై తారల తళుకుబెళుకులు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి అని తెలిసింది.

    24 గంటలు డిస్నీ+హాట్‌స్టార్‌లో, గంట స్టార్ మాలో

    24 గంటలు డిస్నీ+హాట్‌స్టార్‌లో, గంట స్టార్ మాలో

    బిగ్‌బాస్ నాన్ స్టాప్ షో సుమారు 70 రోజులకుపైగా సాగుతుంది. 24 గంటలపాటు షోను డిస్నీ+హాట్ స్టార్ షోలో ప్రసారం చేస్తారు. ఆ రోజు జరిగిన హైలెట్స్ రాత్రి గంటపాటు స్టార్ మా టెలివిజన్‌లో ప్రసారం చేసేందుకు ప్లాన్ చేశారు అని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. అయితే 24 గంటలపాటు ప్రసారమయ్యే ఈ షో గురించి బిగ్‌బాస్ షో అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

    ఫిబ్రవరి 16 నుంచి క్వారంటైన్‌లోకి

    ఫిబ్రవరి 16 నుంచి క్వారంటైన్‌లోకి


    ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ నాన్ స్టాప్ షో ప్రారంభానికి ముందు కరోనావైరస్ పరిస్థితుల దృష్ట్యా సెలబ్రిటీలను క్వారంటైన్‌కు తరలిస్తారు. ఫిబ్రవరి 16వ తేదీన కంటెస్టెంట్లను క్వారంటైన్‌కు తరలించేందుకు ప్లాన్ సిద్దం చేశారు. దాదాపు పది రోజులపాటు వారిని క్వారంటైన్‌లో పెట్టి.. కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపి హౌస్‌లోకి పంపిస్తారు. ఎవరైనా కోవిడ్ పాజిటివ్ అని తేలితే వారి స్థానంలో మరొకరిని పంపేందుకు స్టాండ్ బై కంటెస్టెంట్లను కూడా సిద్ధంగా ఉంచారు అని తెలిసింది. ఈ షోను ఫిబ్రవరి 27 ఆదివారం రోజున ప్రారంభిస్తారనే వార్త మీడియాలో వైరల్ అవుతున్నది.

    English summary
    Bigg Boss Non Stop promising 24/7 entertainment, direct from the Bigg Boss house, only on Disney+ Hotstar. Bigg Boss launches its logo today on Disney+ Hotstar Telugu social media handle and it’s a vibrant masterpiece. Here is the Bigg Boss Non Stop's Probable list and OTT show start date.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X