Bigg Boss Non Stop : హమీద దెబ్బ.. గుక్కపెట్టి ఏడ్చిన సరయు... వామ్మో నాకొద్దు అంటూ దండం పెట్టిన శివ!
తెలుగులో కొత్తగా మొదలైన బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ప్రేక్షకులలో నెమ్మదిగా ఆసక్తి రేకెత్తిస్తోంది. 24 గంటల పాటు చూడలేని వారి కోసం స్పెషల్ ఎపిసోడ్లు కూడా సిద్ధం చేయడంతో ప్రేక్షకులు షో మీద ఆసక్తి చూపించడం మొదలు పెట్టారు. అయితే నామినేషన్లు ఇప్పటికే జరిగి పోవడంతో హౌస్ సభ్యుల మధ్య దూరాలు పెరిగాయి. అలాగే మధ్య మధ్యలో కొన్ని టాస్కులు కూడా వారి మధ్య మరింత దూరం రూపొందించారు బిగ్ బాస్ నిర్వాహకులు. అందులో భాగంగానే ఒక టాస్క్ హమీద, సరయు మధ్య దూరం పెంచింది. హమీద ప్రవర్తన నచ్చకపోవడంతో ముందు ఆమె మీద అరవడానికి ప్రయత్నించిన సరయూ ఆ తర్వాత కన్నీటి పర్యంతమైంది. ఆ వివరాల్లోకి వెళితే

దూరం పెరిగేలా
హౌస్ సభ్యుల మధ్య రకరకాల టాస్క్ పెడుతున్న బిగ్ బాస్ నిర్వాహకులు తాజాగా నో ఫిల్టర్ అనే ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా బిగ్బాస్ లో ఉన్న హౌస్ సభ్యులు అందరూ ఒకచోట కూర్చుని ఉంటారు. అక్కడ ఉన్న ఒక మెషిన్ లో బాణం గుర్తు ఎవరి వైపు వస్తే వారు బిగ్ బాస్ పంపిన ఒక ప్రశ్నకు ఎలాంటి దాపరికాలు లేకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయంలో దాదాపు అందరికీ సంబంధించిన సీక్రెట్లు బయటకు వచ్చాయి. అయితే హమీద మాట్లాడుతున్న సమయంలో సరయు అడిగిన ప్రశ్నల్లో కొన్ని హమీదకు కోపం తెప్పించాయి. ఇదే వారిద్దరి మధ్య దూరం పెరిగేలా చేసింది.

వార్నింగ్ ఇవ్వు అంటూ వెటకారం
హమీద పని చేసుకుంటూ ఉన్న సమయంలో ఆమె దగ్గరకు వెళ్ళిన సరయు నాతో ఎక్కువ మాట్లాడకు దేవుడితో మాట్లాడు అంటున్నావు ఏమిటి నాకు తెలియదా, ఎప్పుడు దేవుడితో మాట్లాడాలో అంటూ సీరియస్ అయింది. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా అని హామీద ప్రశ్నించగా అవును ఇస్తున్నాను. నాకు రివర్స్ పంచ్ వేయకు నాకు బాధ దేవుడితో ఎప్పుడు మాట్లాడాలో తెలుసు అని సరయూ చెప్పుకొచ్చింది. దానికి హమీద నాకు వార్నింగ్ ఇస్తున్నావా ? నాకు వార్నింగ్ ఇస్తున్నావా అంటూ పదే పదే ప్రశ్నించింది.. దానికి సరయు అవును ఇస్తున్నాను నువ్వు నాకు రివర్స్ పంచ్ వేయొద్దు అని అంటుంటే సరే వార్నింగ్ ఇస్తే ఇచ్చావు కానీ వార్నింగ్ ఇస్తున్నానని చెప్పి వార్నింగ్ ఇవ్వు అంటూ వెటకారం ఆడింది హమీద.

కామెడీ చేశావు
వార్నింగ్ ఇస్తున్నాను అనడం కాదు ఏమి వార్నింగ్ ఇస్తున్నావు అని కూడా చెప్పాలి కదా అని హమీద వెటకారం ఆడింది. దానికి కోపం రావడంతో సరయు నువ్వు ఇలాగే మాట్లాడితే నేను నీతో మాట్లాడను అంటూ ఇంగ్లీష్ లో చెప్పింది. మళ్లీ హమీద వెటకారం ఆడుతూ అది తెలుగులో చెప్పమని అంటుంది. నీకు ఇంగ్లీష్ అర్థం అవుతుంది కదా అంటే లేదు నువ్వు నాకు తెలుగులోనే చెప్పు ఇది తెలుగు షో అంటూ ఆమె చెప్పుకొచ్చింది. తర్వాత వీరిద్దరూ మరోసారి బెడ్ రూంలో కూర్చుని మాట్లాడుతూ కనిపించారు. ఆ సమయంలో నువ్వు నన్ను చూసి కామెడీ చేశావు అంటూ సరయు చెప్పుకొచ్చింది.

నాకేమీ నచ్చలేదు అంటూ
అవును నేను కామెడీ చేస్తున్నప్పుడు నీ వంక చూశాను నువ్వు దాన్ని సిల్లీగా తీసుకుని నవ్వుతున్నట్లు నాకు అనిపించింది అందుకే దాన్ని పొడిగించా నువ్వు సీరియస్ అయి ఉంటే నేను అప్పుడే ఆపేసే దాన్ని అని హమీద చెప్పుకొచ్చింది. అంతేకాక నువ్వు ప్రతి చిన్న విషయానికి వార్నింగ్ అంటున్నావు, వాడుకుంటున్నాను అంటున్నావు అంటూ చెబుతూ ఉండడంతో మరి నన్ను ఇన్సల్ట్ చేస్తే నేను బాధపడను అని ప్రశ్నించింది. ఇప్పుడు ఇన్సల్ట్ అంటున్నావా అవి ఎంత పెద్ద మాటలో తెలుసా? నేను ఎక్కడ నిన్ను ఇన్సల్ట్ చేశాను అని ప్రశ్నించింది. ఎంత పెద్ద పెద్ద మాటలు అంటున్నావు అర్థమవుతుందా? నేను నిన్ను హర్ట్ చేస్తున్నాను అని, ఇన్సల్ట్ చేస్తున్నాను అని అందరి ముందు స్టుపిడ్ లా క్రియేట్ చేస్తున్నాను అని నిన్ను చూసి ఆట పంపిస్తున్నాను అని అనడం నాకేమీ నచ్చలేదు అంటూ హమీద లేచి వెళ్ళిపోయింది.

గుక్క పెట్టి ఏడవడం మొదలు పెట్టి
మాటల మధ్యలో అలా వెళ్ళిపోవడం కరెక్టేనా అని సరయూ మళ్ళీ సీరియస్ అయితే నువ్వేమో మాట్లాడుతుంటే నేనేం చేయను అంటే నువ్వు అనే పద్ధతి వేరేగా ఉంది సరదాగా ఆటపట్టిస్తూ వెటకారంగా నాతో మాట్లాడవద్దు అని సరయు కోరుతుంది. అయితే మధ్యలో కల్పించుకున్న చైతు, యాంకర్ శివ వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించడంతో అసలు మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటూ శివ మీద ఫైర్ అయింది సరయూ.. నేను నాలో నేను మాట్లాడుకుంటున్నా నేను మిమ్మల్ని ఏమీ అనడం లేదు అంటే దానికి బాగా హర్ట్ అయిన సరయు అందరికీ నేనే లోకువ కదా నన్ను బ్యాడ్ చేసి చూపించాలి అనుకుంటున్నారు చూపించండి అంటూ గుక్క పెట్టి ఏడవడం మొదలు పెట్టింది.
Recommended Video

దండం పెట్టిన శివ
అందరూ నన్ను ఎన్ని రకాలుగా మాట్లాడినా నేను అందరితో బాగుండటానికి ప్రయత్నిస్తున్నాను, నేను అందరితో కూర్చుని మంచిగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న సరే నాతో సమస్య ఉంది అంటే నేను వెళ్ళిపోతాను బిగ్ బాస్ నన్ను పంపించేయండి అంటూ ఏడవడం మొదలు పెట్టింది. ఈ సమయంలో అషూ రెడ్డి, అరియానా వచ్చి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. నేను వెళ్ళిపోతాను అనే మాట రానివ్వద్దు అని అరియానా కోరింది. అసలు వెళ్ళిపోతా అనే మనస్తత్వం ఉన్న దానివి లోపలికి ఎందుకు వచ్చావు అని కూడా ప్రశ్నించింది. ఆ తర్వాత సరయు శివతో మాట్లాడే ప్రయత్నం చేయగా నేను అసలు నీతో మాట్లాడను అంటూ శివ దండం పెట్టాడు.. మొత్తం మీద ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











